బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ నటుడు ఆనంద్ దేవరకొండకు ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్ వరించింది. హైదరాబాద్లోని హోటల్ దసపల్లాలో శనివారం ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగాయి. కళావేదిక, రాఘవి మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖలు హాజరై సందడి చేశారు.ఈ వేడుకలో బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ నటుడు ఆనంద్ దేవరకొండ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకోగా.. ఉత్తమ దర్శకుడిగా బేబీ దర్శకుడు సాయి రాజేశ్కు ఈ అవార్డు దక్కింది. గతేడాది భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత సాహూ గారపాటికి బెస్ట్ ప్రోడ్యూసర్‌గా అవార్డు వరించింది. ఇక వీరితో పాటు సీనియర్ నటుడు మురళీమోహన్‌కు ఎన్టీఆర్ లైఫ్‌టైం అచివ్‌మెంట్ అవార్డ్‌తో సత్కరించారు.