• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

అండీ … అండీ అంటూనే బాగా ఏసేశాడు

admin by admin
June 20, 2023
in politics
0 0
0
అండీ … అండీ అంటూనే బాగా ఏసేశాడు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

పవన్ కు ముద్రగడ లేఖ

గుక్కతిప్పుకోనివ్వని ప్రశ్నలతో పవన్ కు చురకలు

ముద్రగడ పద్మనాభం.. రాష్ట్రంలో పరిచయం అక్కర్లేని ప్రజానాయకుడు.. అవును .. అప్పుడెప్పుడో నలభయ్యేళ్ళ క్రిందట మంత్రిగా చేసి, ఆ తరువాత ఈనాటివరకూ ఏ రాజకీయపదవీ చేపట్టకుండా కేవలం కాపుల ప్రయోజనాలు కాపాడే ఉద్యమాల్లోనే జీవిస్తూ ఆటుపోట్లు ఎదుర్కొంటున్న ఆయన పవన్ కళ్యాణ్ కు గట్టి క్లాస్ పీకారు.. తానూ ఏనాడూ ఉద్యమాన్ని అమ్ముకోలేదు అంటూ కాపు ఓట్లను గంపగుత్తగా చంద్రబాబుకు తాకట్టు పెట్టేందుకు సిద్ధమైన పవన్ కు గట్టి మొట్టికాయ వేశారు. ముందు మాట మార్చుకోండి.. తీరు మారాలండి .. వీధి రౌడీలా మాట్లాడడం ఏమిటి ? అంటూనే మీరు ఇంతవరకూ ఎంతమందికి చెప్పుతో కొట్టారు, ఎన్ని తొక్కలు తీశారు? ఎన్ని గుండ్లు గీశారు అంటూ ర్యాగింగ్ చేసారు. తాను ఏనాడూ ఓటమి ఎరుగను అంటూ నువ్వు రెండు చోట్లా ఓడిపోయావుగా అని చెప్పకుండానే వెక్కిరించారు. తానూ ఇన్నేళ్ళుగా కాపుల ప్రయోజనాలు.. వారి రిజర్వేషన్ల కోసం మాత్రమే పని చేశాను తప్ప వేరేవారి పల్లకీకి భుజం కాయలేదు అని అన్నారు. తాను ఇన్నేళ్ళలో ఎన్నడూ సూట్ కేసులకు అమ్ముడుపోలేదు అని ఘంటాపథంగా చెప్పారు. తాను ఏనాడూ కులాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోలేదని, తానూ అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కుల అస్తిత్వం కాపాడడానికి .. వారి ప్రయోజనాలకోసమే పోరాడుతూ ఉన్నానని. కాపు నాయకులకు సీఎం పదవి ఇవ్వాలని సైతం పట్టుబడిన వ్యక్తిని అని అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్,
స్టీల్ ప్లాంట్ అమ్మకం వంటి సమస్యల మీద పోరాడాలని సూచిస్తూ మీరు కులాన్ని అడ్డంపెట్టుకుని బతకడానికి తప్ప ప్రజాపోరాటాలకు పనికిరారు అనే విషయాన్ని దెప్పి పొడిచారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో అవమానకరంగా మాట్లాడిన పవన్ను ఈ లేఖలో పద్మనాభం ఉతికేసారు. దశాబ్దాలుగా ద్వారంపూడి కుటుంబం ప్రజాజీవనంలో ఉందని గుర్తు చేస్తూనే కాపు ఉద్యమానికి నిత్యం వారితోబాటు వారి తండ్రి , తాతయ్య సైతం వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు. తాను ఎప్పుడు ఉద్యమం చేసినా అన్నివిధాలా వారి కుటుంబం సహకరిస్తూనే ఉండేది అని చెబుతూ ద్వారంపూడి కి తన మద్దతు తెలిపారు.
ఫైనల్ గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికీ మాట్లాడడం రాదని, డబ్బుకు కులాన్ని అమ్ముకునే వ్యక్తి అని వెక్కిరిస్తూ మర్యాదగా వాయించి పారేసారు ముద్రగడ పద్మనాభం.

Previous Post

హైదరాబాద్‌లో హ‌నీహ‌నీ కిడ్స్ స్టోర్ తొలి ఫ్రాంచైజీ స్టోర్ ప్రారంభం

Next Post

స్పైన్ చిల్లింగ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘అశ్విన్స్’

Next Post
స్పైన్ చిల్లింగ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘అశ్విన్స్’

స్పైన్ చిల్లింగ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘అశ్విన్స్’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

When Goodbye Becomes the Most Romantic Hello Story
movies

When Goodbye Becomes the Most Romantic Hello Story

by admin
February 13, 2026
0

...

Read more
“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

February 11, 2026
WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

February 10, 2026
టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

February 10, 2026
గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన  సినీ నటి మాళవిక మోహన్

గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన సినీ నటి మాళవిక మోహన్

February 9, 2026
“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

February 2, 2026
“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

February 2, 2026
ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

February 2, 2026
లగ్జరీ సిల్వర్ జువెలరీ  ‘గోయాజ్ (GOYAZ)’ –22వ  స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో  ప్రారంభం

లగ్జరీ సిల్వర్ జువెలరీ ‘గోయాజ్ (GOYAZ)’ –22వ స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో ప్రారంభం

February 1, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In