టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ ని మెప్పించిన మసూద
మళ్ళీ రావా లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి థ్రిల్లర్ తరువాత విభిన్న కథలను ఎంచుకొనే నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తన మూడవ చిత్రంగా మసూద అనే హారర్ డ్రామాని నిర్మించారు.
ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్,. సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీమియర్ ని చిత్రయూనిట్ తో పాటు… యువ దర్శకులు చూశారు. ఈ సదర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సంద్భంగా యువ దర్శకులు ఏజెంట్ సాయి శ్రీనివాస దర్శకుడు స్వరూప్ అర్. ఎస్. జే., కేరాఫ్ కంచర పాలెం దర్శకుడు వెంకటేశ్ మహా, అంటే సుందరానికీ… దర్శకుడు వివేక్ ఆత్రేయ, మిడిల్ క్లాస్ మెలోడీస్ దర్శకుడు వినోద్ అనంతోజు, కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్ లు మసూద మూవీ చూసి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. హారర్ అంటే… హారర్ కామెడీనే అనుకునే ఈ రోజుల్లో చాలా కాలం తరువాత ఒక ట్రూ హారర్ డ్రామాగా వచ్చిన మసూద సినిమా చూసి థ్రిల్ ఫీల్ అయ్యాం అన్నారు. ఇలాంటి హై టెక్నికల్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని థియేటర్ లో చూస్తేనే వారికి కలిగిన అనుభూతి, ప్రేక్షకులకి కూడా కలుగుతుందని చెప్పారు. ఈ జానర్ లో ఇంకొన్ని కథలు రావటానికి మసూద ఓ స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. మా చిన్నతనంలో చూసిన అమ్మోరు, దేవి చిత్రాలు ఏవిధంగా అయితే ప్రేక్షకుల్ని మెప్పించిందో మసూద కూడా అంతే జెన్యూన్ గా మెప్పిస్తుందన్నారు. ఈ కథను నమ్మి హై టెక్నికల్ వ్యాల్యూస్ తో నిర్మించిన నిర్మాత రాహుల్ యాదవ్ ని అభినందించారు. దర్శకుడు సాయి కిరణ్ గురించి మాట్లాడుతూ… కథలోనే హారర్ వాతావరణాన్ని క్రియేట్ చేసినందుకు, అలా క్రియేట్ చేయడం చాలా కష్టమని, ఆ విషయంలో దర్శకుణ్ణి అభినందించారు. ఈ చిత్రానికి సౌండ్ అండ్ విజువల్ ముఖ్య పాత్ర పోషిస్తాయని అన్నారు.
చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. సూపర్ స్టార్ కృష్ణ గారి మరణం చాలా బాధాకరం. మహేష్ బాబు గారికి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మళ్లీరావా, ఏజెంట్ తరువాత మళ్లీ ఒక మంచి చిత్రం చేసినందుకు ఆనందంగా ఉంది. మసూద రేపు రిలీజ్ కాబోతోంది. మేం సినిమాను జెన్యూన్‌గా తీశాం. టెర్రిఫిక్, హారిఫిక్ ఎక్స్‌పీరియెన్స్ కోసం థియేటర్లో ఈ సినిమాను చూడండి. సినిమా మీకు కశ్చితంగా నచ్చుతుంది అని మా నమ్మకం. సినిమా కోసం టీంలో అందరూ కష్టపడి పని చేశారు.’ అని అన్నారు.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ డైరెక్టర్ స్వరూప్ మాట్లాడుతూ.. ‘సరైన హారర్ సినిమాగా మసూద వస్తోంది. ఇలాంటి చిత్రాలను థియేటర్లో చూస్తేనే థ్రిల్ ఫీలింగ్ వస్తుంది. మేం సినిమాను చూస్తూ ఎంత ఎంజాయ్ చేశామో మీరు చూసినపుడు మీకు కూడా అర్థమవుతంది. అన్ని డిపార్ట్మెంట్లు అద్భుతంగా పని చేశాయి. రేపు ఆడియెన్స్ ఆ ఎక్స్‌పీరియెన్స్‌ను ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.
కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ‘మళ్లీ రావా, ఏజెంట్ చిత్రాల తరువాత రాహుల్ ఎలాంటి సినిమా తీస్తారో అనుకున్నాను. హారర్ సినిమా అని చెప్పినప్పుడు.. రొటీన్ అని అనుకున్నాను. కానీ సినిమా చూసిన తరువాత షాక్ అయ్యాను. చాలా చోట్ల కచ్చితంగా భయపడతాం. డెబ్యూ డైరెక్టర్ తీసిన సినిమాగా అనిపించదు. సరైన టీం కలిసి పని చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా ఉదాహరణగా నిలుస్తుంది. మ్యూజిక్, సౌండ్, కెమెరా అన్నీ చక్కగా కుదిరాయి. మీరు కూడా థియేటర్లో ఆ ఎక్స్‌పీరియెన్స్ చేయాలని అనుకుంటున్నాను’ అని అన్నారు.
వెంకటేష్ మహా మాట్లాడుతూ.. ‘హారర్ జానర్ తీయాలనే ఇంట్రెస్ట్ లేదని ఇప్పుడున్న దర్శకులు అంటున్నారు. నేను కూడా అన్నాను. కానీ నేను ఈ చిత్రాన్ని రెండు సార్లు చూశాను. హారర్‌ను ఫుల్లుగా ఎక్స్‌పీరియెన్స్ చేశాను. చాలా భయపడ్డాను. సాయి విజన్‌కు తగ్గట్టుగా అద్భుతంగా విజువలైజ్ చేశారు. ఇది విజువల్ హారర్ ఫిల్మ్. సౌండింగ్, మ్యూజిక్ పరంగానూ అద్భుతంగా పని చేశారు. హారర్ అంటే కామెడీ, మసాలా ఉండాలని అనుకునే సమయంలో.. ఇలాంటి కథను నిర్మించిన రాహుల్‌కు థాంక్స్. సినిమాలపరంగా రాహుల్ నాకు సోల్ మేట్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
మిడిల్ క్లాస్ మెలోడిస్ డైరెక్టర్ వినోద్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం హారర్ ఫార్మాట్ రొటీన్ అయింది. అందులోనూ కొత్త ఎలిమెంట్, పాయింట్ తీసుకోవడం బాగుంటుంది. దెయ్యాన్ని చూస్తే వచ్చే భయం కాదు. ఆ సీన్‌లోంచి, వాతావరణంలోంచి భయాన్ని క్రియేట్ చెయ్యటం మామూలు విషయం కాదు. సినిమా ప్రారంభమైన ఇరవై నిమిషాల్లోనే భయపెట్టేస్తాడు. ఇదేదో తేడాగా ఉందే అనే భయం కలుగుతుంది. టీం అంతా కలిసి సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఫోన్‌లో చూస్తే ఈ ఎక్స్‌పీరియెన్స్ రావడం చాలా కష్టం. థియేటర్లోనే ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఈ కథను నమ్మి తీసిన రాహుల్‌కు థాంక్స్. ఈ చిత్రం రేపు విడుదల కాబోతోంది. తప్పకుండా చూడండి’ అని అన్నారు.
వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. ‘రాహుల్, ప్రశాంత్ నాకు మంచి ఫ్రెండ్స్. ప్రీమియర్స్‌కు పిలిచారు. అమ్మోరు, కాంతారా ప్రపంచంలో మనం ఉన్నప్పుడు.. పాత్రలకు ఏమైనా జరుగుతూ ఉంటే మనం భయపడుతుంటాం. ఈ చిత్రంలోనూ అలాంటి ఫీలింగ్ వస్తుంది. హారర్ సినిమా చేయాలంటే టెక్నికల్‌గా ఎంతో నాలెడ్జ్ ఉండాలి. సాయి మొదటి సినిమానే ఇలా చేయడం చాలా గ్రేట్. సంగీత, తిరువీర్, కావ్యా, శుభలేఖ సుధాకర్ ఇలా అందరూ చక్కగా నటించారు. బెలూన్ సౌండ్‌కి కూడా నా గుండె ఝల్లుమంది. రాత్రి ఇంటికి వెళ్లి ఒంటరిగా భోజనం చేయాలన్నా కూడా భయంగా అనిపించింది. హారర్ సినిమాకు ఆర్ఆర్ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఆర్ఆర్, విజువల్స్ అద్భుతంగా అనిపిస్తుంది. థియేటర్లోనే చూస్తేనే ఈ ఫీలింగ్ వస్తుంది. మసూద రేపు విడుదల కాబోతోంది. థియేటర్లోనే ఈ సినిమాను చూడండి’ అని కోరారు.
సాయి కిరణ్ మాట్లాడుతూ.. ‘మంచి సినిమాను తీశాం. ఫలితం ఎలా వస్తుందనే ఆలోచన అయితే ఉంది. నాకు ఆఫర్ ఇచ్చినందుకు రాహుల్‌కు థాంక్స్. ప్రతీ ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుందని అనుకుంటున్నాను. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్.ఇందులో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. మసూద కల్పిత చిత్రమే. ఇందులో మసూద నెగెటివ్ పాత్ర. ఆమె కోణంలోంచి సినిమా నడుస్తుంది. కాబట్టే ఈ చిత్రానికి మసూద అని టైటిల్ పెట్టాం. మీ అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని అనుకుంటున్నాను’ అని అన్నారు.
తిరువీర్ మాట్లాడుతూ.. ‘నాకు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్‌గా అందరినీ భయపెట్టే ఇమేజ్ ఉంది. స్వధర్మ్ వాళ్లు నన్ను ఈ పాత్రకు అప్రోచ్ అయినప్పుడు షాక్ అయ్యాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చాన్స్ వదులుకోవద్దని అనుకున్నాను. కథ, పాత్ర గురించి కూడా అడగొద్దని అనుకున్నాను. కానీ నాకు పూర్తి స్క్రిప్ట్ ఇచ్చి చదువుకోమని అన్నారు. కథ నాకు ఎంతో బాగా నచ్చింది. నాకు డ్రామాలంటే చాలా ఇష్టం. స్వధర్మ్ వాళ్లు నన్ను అప్రోచ్ అవ్వడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇంత మంచి పాత్రను నాకు ఇవ్వడం నాకు ఆనందంగా ఉంది.రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా ఎక్కువ మాట్లాడతాను’ అని అన్నారు.
కావ్యా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘మా సినిమా గురించి మేం గొప్పగానే చెబుతుంటాం. కానీ ఇక్కడకు వచ్చిన దర్శకులంతా కూడా మా సినిమాను ఎంతో గొప్పగా చెప్పారు. అలాంటి క్రియేటివ్ పీపుల్స్ చెప్పాక మేం చెప్పడానికి ఇంకేం ఉంటుంది. థియేటర్లో ఈ దర్శకులంతా సినిమాను చూస్తున్నప్పుడు వీళ్ల రియాక్షన్స్ మేం చూశాం. ఈ రోజు ఇక్కడ చెప్పిందంతా జెన్యూన్ అని మాకు తెలుసు. రేపు ఆడియెన్స్ సినిమాను చూశాక వాళ్లకి కూడా తెలుస్తుంది. ప్రతీ సినిమాకు అందరూ కష్టపడి చేస్తుంటాం. కరోనాలో ఎన్నో కష్టాలు వచ్చినా సినిమాను పూర్తి చేశాం. రేపు ఈ సినిమాను ఆడియెన్స్ అంతా చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను’ అని అన్నారు.
భాందవి శ్రీదర్ మాట్లాడుతూ.. ‘ఇది నాకు మొదటి చిత్రం. ఇంత మంచి టీంతో కలిసి పని చేయడం నాకు ఆనందంగా ఉంది. మేం తీసిన సినిమా అని చూడమని చెప్పడం లేదు. ఎవరైనా హెల్ప్ అడిగితే.. అనవసరం అయిన దాంట్లో ఎందుకు హెల్ప్ చేయడం అని అంతా అనుకుంటారు. కానీ ఇందులో ఓ మంచి సందేశం ఉంది. మనిషికి మూడు సందర్భాల్లో ఏడుపు వస్తుంది. ఈ మూడు సందర్భాల్లో వచ్చే సీన్స్ బాగుంటాయి. మా దర్శకుడు ఎంతో సహజంగా తీసేందుకు ప్రయత్నిస్తుంటారు. స్వధర్మ్ అంటే ఏజెంట్, మళ్లీరావా సినిమాలు గుర్తొస్తాయి. హారర్ సినిమాలకు విజువల్స్, మ్యూజిక్ ఇంపార్టెంట్. అవి రెండూ చక్కగా కుదిరాయి. తిరువీర్ ఎంతో సైలెంట్‌గా ఉంటారు. సంగీత గారు నా తల్లి పాత్రను పోషించారు. కావ్యా నాకు మంచి ఫ్రెండ్. మసూద సినిమా రేపు రిలీజ్ అవుతోంది. అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను’ అని అన్నారు.
ప్రశాంత్ ఆర్.విహారి మాట్లాడుతూ.. ‘భయపెట్టడం చాలా కష్టమని నాకు తెలిసింది. ఇంత వరకు నేను హారర్ మూవీలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయలేదు. రిలీజ్ చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమా కోసం అందరూ కష్టపడ్డారు. ఈ చిత్రానికి పని చేయడం ఆనందంగా ఉంది. రేపు ఈ చిత్రం విడుదల కాబోతోంది. అందరూ సినిమాను చూడండి’ అని అన్నారు.
ఆర్డ్ డైరెక్టర్ క్రాంతి మాట్లాడుతూ.. ‘స్వధర్మ్ బ్యానర్‌లో పని చేయడం నాకు సంతోషంగా ఉంది. వరుసగా మూడు చిత్రాలు చేశాను. శివపుత్రుడు, ఖడ్గం, మసూద అనేది సంగీత మేడం కెరీర్‌లో నిలిచిపోతాయి. ఈ చిత్రంలో చిన్న పాత్రను కూడా పోషించాను’ అని అన్నారు.
సినిమాటోగ్రాఫర్ నగేష్ బనెల్ మాట్లాడుతూ… ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రాహుల్ గారికి, దర్శకుడు సాయి గారికి థాంక్స్ చెబుతున్నాను. ఈ కథని తెరకెక్కించడానికి కావాల్సిన అన్నింటినీ స్వధర్మ్ ఎంటర్ టైన్మెంట్ అందించింది. దర్శకుడు సాయి కిరణ్ మైండ్ లో వున్న షాట్స్ ని అలాగే తెరకెక్కించారు. సినిమాలో విజువల్స్ గ్రాండ్ గా వుంటాయని, ఈ సినిమాని థియేటర్ లోనే చూడాలని కోరారు.
తారాగణం: సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ, కార్తీక్ అడుసుమిల్లి తదితరులు
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్
కళ: క్రాంతి ప్రియం
కెమెరా: నగేష్ బానెల్
స్టంట్స్: రామ్ కిషన్ మరియు స్టంట్ జాషువా
సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి
ఎడిటింగ్: జెస్విన్ ప్రభు
PRO: బి.వీరబాబు
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
రచన, దర్శకత్వం: సాయికిరణ్
‘Masooda’ gets lauded by Tollywood’s young directors
‘Masooda’ is going to be released in theatres on November 18. Producer Rahul Yadav Nakka of Swadharm Entertainment has produced the movie. He is the producer of ‘Malli Raava’ and ‘Agent Sai Srinivas Athreya’ fame. Directed by newcomer Sai Kiran, the film was today screened for young Tollywood directors ahead of its theatrical release. They loved the performances, the story, the thrills, and the production values.
Swaroop RSJ of ‘Agent..’ fame, Venkatesh Maha of ‘Care Of Kancharapalem’ fame, Vivek Athreya of ‘Brochevarevarura’, Vinod Ananthoju of ‘Middle Class Melodies’, Sandeep Raj of ‘Colour Photo’ fame appreciated the movie. They said that ‘Masooda’, a horror drama, has been made in an age when horror movies have become synonymous with horror-comedies. They praised the movie’s technical values as well. They said that the film might become as popular as ‘Ammoru’ and ‘Devi’, standing as an inspiration for several such movies to be made in the future. They lauded director Sai Kiran for creating an atmosphere of horror in the film. Masooda’s visual effects were also praised.
Producer Rahul Yadav Nakka began his speech by condoling Superstar Krishna’s demise and extending sympathies to Mahesh Babu and others. About ‘Masooda’, he said that the film is a genuine one. “Watch it in theatres for a terrific and horrific experience. We are confident of scoring a hit,” he added.
Swaroop RSJ said that ‘Masooda’ is a proper horror movie that must be watched only in a theatre. “Each and every department has done a great job. We were thrilled while watching the movie. When I was told ‘Masooda’ is a horror movie months ago, I presumed it must be a routine one. But I am genuinely shocked upon watching it today. Music, sound effects, cinematography and other elements are awesome,” he added.
Venkatesh Maha said, “These days, new directors are not interested in making horror movies. I too am like them. But ‘Masooda’ is a different experience altogether. Sai’s vision is amazing. It truly scared me. This is a visual horror movie. The sounding, music are great. I wish the team all the best.”
Vinod Anantoju said, “Horror movies have become routine of late. Horror is supposed to be generated not by showing the ghost but by creating a spooky atmosphere through other means. ‘Masooda’ achieves that. This has to be watched in a theatre, not on a smartphone. I appreciate producer Rahul for believing in the story.”
Vivek Athreya said, “When you are watching an ‘Ammoru’ or a ‘Kantara’, you are scared that the characters might be harmed. ‘Masooda’ subjects you to a similar experience. It takes a lot of technical knowledge to make a horror movie. The performances are great. The balloon sound that comes in the movie gave me chills. It’s not an easy task to give RR to horror movies. ‘Masooda’ is technically brilliant.”
Director Sai Kiran said, “Ahead of the film’s release, I am nervous thinking about the audience’s response. I thank producer Rahul for the opportunity. ‘Masooda’ is a fiction. I thank everyone for working on it. Masooda is a negative character. And the story is narrated from her perspective. That’s why the title.”
Thiruveer said, “I have done scary characters as a villain and negative characters. When ‘Masooda’ came my way, I didn’t want to lose the opportunity at any cost. They gave me the full script to read. I love dramas. I was surprised when Swadharm Entertainment approached me. I thank them for the opportunity.”
Composer Prashanth R Vihari said, “This is my first horror movie. It’s not easy to scare through sounds. Our film is coming out tomorrow. Please watch it.”
Art Director Kranthi said, “This is my third film with the production house. For Sangeetha garu, this is going to be her third great movie after ‘Shivaputrudu’ and ‘Khadgam’.”
Cinematographer Nagesh Bannell thanked the producer. He also appreciated director Sai Kiran for executing his vision with efficiency.
Cast:
Sangeetha, Thiruveer, Kavya Kalyanram, Subhalekha Sudhakar, Akhila Ram, Bandhavi Sridhar, Satyam Rajesh, Satya Prakash, Surya Rao, Surabhi Prabhavathi, Krishna Teja and others.
Crew:
Banner: Swadharm Entertainment
Art Director: Kranthi Priyam
Stunts: Ram Kishan, Stunt Joshua
Music Director: Prashant R Vihari
Editor: Jesvin Prabhu
Cinematographer: Nagesh Banell
PRO: B Veera Babu
Producer: Rahul Yadav Nakka
Writer, Director: Sai Kiran