వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో ఇటు దక్షిణాది ప్రేక్షకులనే కాదు, ఉత్తరాది ప్రేక్షకులకు సైతం సుపరిచితులయ్యారు టాలెంటెడ్ యాక్టర్ ధనుష్. ఈ వెర్సటైల్ స్టార్ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టారు. ఆ మూవీ ఏదో కాదు.. మ్యాస్ట్రో ఇళయ రాజా బయోపిక్. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సంగీత జ్ఞానిగా తనదైన ముద్ర వేసిన ఈయనపై సినిమా రానుండటం అనేది సంగీతాభిమానులతో పాటు ఇళయరాజా అభిమానులను, సినీ ప్రేక్షకులను ఆనందోత్సహాల్లో ముంచెత్తింది. ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ సంస్థలు కలిసి రూపొందించనున్నాయి. ఈ నిర్మాణ సంస్థల కలయికలో తొలి చిత్రంగా రూపొందనున్న ఈ బయోపిక్ షూటింగ్ అక్టోబర్ 2024లో ప్రారంభమై 2025 మధ్యలో విడుదల కానుంది.