లెహరాయి మూవీ రివ్యూ
చిత్రం: లెహరాయి
విడుదల తేదీ : డిసెంబర్ 09, 2022
నటీనటులు: రంజిత్ సొమ్మి, సౌమ్య మీనన్, రావు రమేష్, అలీ, నరేష్, సత్యం రాజేష్
దర్శకుడు : రామకృష్ణ పరమహంస
నిర్మాత: మద్దిరెడ్డి శ్రీనివాస్
సంగీత దర్శకులు: ఘంటాడి కృష్ణ
సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాలరెడ్డి
ఎడిటర్: ప్రవీణ్ పూడి
రివ్యూ రేటింగ్ : 3/5
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం లెహరాయి. టీజర్, ట్రైలర్ , సాంగ్స్ తో మంచి అంచనాలను క్రియేట్ చేసిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎంతమేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
కథ:
డాక్టర్ వృత్తిలో ఉన్న పురుషోత్తం (రావు రమేష్) కి కూతురు మేఘన (సౌమ్య మీనన్). చిన్నప్పుడు నుంచి చాలా పర్ఫెక్ట్ గా పెరిగినటువంటి అమ్మాయి. ఓ రోజు ఓ అమ్మాయి ప్రేమలో విఫలం అయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ ఘటనకి చలించిపోయిన రావు రమేష్ తన కూతురు వలన తనకు అలాంటి పరిస్థితి రాకూడదని కూతురితో ప్రామిస్ చేయించుకుంటాడు. మేఘన తన తండ్రైన పురుషోత్తంకి తన లైఫ్ లో ఎవరినీ ప్రేమించను అని మాట ఇస్తుంది. కానీ ఊహించని విధంగా కార్తీక్(రంజిత్ సొమ్మి) కి ఆమె ప్రపోజ్ చేస్తుంది. అయితే ఆమె ఎందుకు అతనికి ప్రపోజ్ చేయాల్సి వస్తుంది? సౌమ్య, రంజిత్ ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగింది, మొదట్లో ఆత్మహత్య చేసుకున్న అమ్మాయికి, రంజిత్‌కి ఉన్న సంబంధం ఏంటి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాన్ని చూపించే ఒక చక్కని ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో కూడుకున్న ఒక పక్కా కమర్షియల్ చిత్రంగా దీనిని చెప్పొచ్చు. ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీనే అయినా, దీన్ని తెరకెక్కించిన తీరు, దాన్ని నడిపించిన విధానంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో కథ కాస్త ఇంట్రెస్ట్ గా మారుతుంది.
అప్ కమింగ్ హీరో రంజిత్ హీరోయిజం సన్నివేశాల్లో బాగా చేశాడు. తనుకున్న పరిధిలో హీరోయిన్ సౌమ్య మీనన్ బాగా చేసింది. హీరోయిన్ తండ్రిగా రావు రమేష్, హీరో తండ్రిగా నరేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. గగన్ విహారీ నెగటివ్ షేడ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. రాంప్రసాద్, సత్యం రాజేష్, అలీ కామెడీ బాగా వర్కౌట్ అయింది.
దర్శకుడు రామకృష్ణ పరమహంస ఓ రెగ్యూలర్ స్టోరీని తీసుకున్న కూడా చాలా వరకు బోర్ ఫీలింగ్ లేకుండా చూసుకున్నాడు.బీఎన్ బాల్ రెడ్డి కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. జీకే(ఘంటాడి కృష్ణ) మ్యూజిక్ సినిమాకి పెద్ద ప్లస్. పాటలు, బీజీఎం ఆకట్టుకున్నాయి.
ప్లస్ పాయింట్స్:
రంజిత్, సౌమ్య ఇంప్రెసివ్ పెర్ఫామెన్స్
ఫ్యామిలీ ఎలిమెంట్స్
జీకే(ఘంటాడి కృష్ణ) మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ లైన్
ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని అనవసర సన్నివేశాలు
కొన్ని సాంగ్స్ ప్లేస్ మెంట్
మొత్తంగా:
ఇది ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్