వర్షాకాలం రోజురోజుకూ వరదనీరు పెరుగుతున్నట్లు .. నదుల్లో నీటిమట్టం పెరుగుతున్నట్టు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ఓటు మట్టం పెరుగుతోంది.. ఎవరు ఎన్నిరకాలుగా గ్రూపులు కట్టినా .. కూటములు కట్టినా ఈసారి కూడా జగన్‌ని నిలువరించడం కష్టమే అని ఇంకో సర్వే తేల్చింది. ఈమధ్య నేషనల్ మీడియా టైమ్స్ నౌ – నవ భారత్ చేసిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదని తేల్చేసింది. ఇక ఇప్పుడు పోల్ స్ట్రాటజీ అనే సంస్థ చేపట్టిన సర్వేలో సైతం మళ్ళీ అదే ఫలితం వచ్చింది. అవును పంచదార ఎంతమంది చూసినా తియ్యగానే ఉంటుంది ఒక్క షుగర్ వ్యాధి ఉన్నారు రోగి తప్ప.
పోల్ స్ట్రాటజీ గ్రూప్ చేపట్టిన సర్వేలో జగన్ మోహన్ రెడ్డి ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. తెలుగుదేశం, జనసేన కలిసివెళ్లినా ? విడివిడిగా వెళ్లినా గెలుపు జగన్ వైపే ఉంటుందని ఆ సర్వే తేల్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 49 శాతం ఓట్లు వస్తాయని టిడిపి జనసేన కలిసి వెళ్తే వారికి 41 శాతం ఓట్లు వస్తాయని సర్వే చెబుతోంది. ఇతరులకు పదిశాతం ఓట్లు వస్తాయి. ఇక సీఎంగా ఎవరు ఉంటే బాగుంటుంది అనే ప్రశ్నకు 56 శాతం మంది జగన్ కు ఓటేయగా , చంద్రబాబుకు 37 శాతం మంది జైకొట్టారు. పవన్‌ను కేవలం 7 శాతం మంది మాత్రమే ఎంచుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనా బాగుందని 56 శాతం మంది చెప్పగా 22 శాతం మంది బాలేదని అన్నారు. 9 శాతం మంది చాలా బాగుందని చెప్పగా 8 శాతం మంది అసలు బాలేదని అన్నారు. మూడు శాతం మంది మాత్రం ఎటూ చెప్పలేక న్యూట్రల్ గా ఉన్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే? 2019తో పోలిస్తే వైయస్‌ఆర్‌సీపీ ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగింది.
సంక్షేమ, అభివృద్ధి పథకాలే ప్రాణం
సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాలూ.. చిన్నచిన్న వాడల్లోకి సైతం చేరిపోగా ప్రజలంతా జగన్ కుటుంబంలో భాగమయ్యారు.. ప్రజలు సైతం ఈయన్ను తమ కుటుంబ సభ్యడిలా భావిస్తున్నారు. దీంతో పథకాలు పొందిన లబ్ధిదారులు మొత్తం గంపగుత్తగా జగన్ కు జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. దానికితోడు నాడు – నేడు, పోర్టులు, విమానాశ్రయాలు, విద్య వైద్య రంగాల్లో సాధించిన గణనీయమైన మార్పులు జగన్ పాలనా దక్షతకు అద్దం పడుతున్నాయని ఓటర్లు భావిస్తున్నారు ఇక చంద్రబాబు కూడా అర్హులందరికీ సంక్షేమ పథకాలు.. అంటూ ఏవేవో చెప్పినా ప్రజలు ఆయన్ను నమ్మడం లేదు.. అయన గత చరిత్ర తెలిసినవాళ్ళు చంద్రబాబును ఓ అవకాశవాదిగా మాత్రమే చూస్తారు తప్ప ఆయన్ను నమ్మదగిన నాయకుడిగా చూడలేరు. అందుకే మొన్న మహానాడులో చంద్రబాబు ఇచ్చిన హామీల టీజర్ ఫెయిల్ అయింది. దానికితోడు గతంలో చాలా హామీలు ఇచ్చి మరిచిన ఆయన్ను మళ్ళీ నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.
టిడిపికి పొత్తులే ప్రాణం
తెలుగు దేశం పార్టీ పొత్తుల్లేకుండా ఎన్నికలకు వెళ్లిన చరిత్ర లేనందున ఈసారి జగన్‌ను ఎదుర్కొనేందుకు పొత్తులకోసం ప్రయత్నిస్తోంది. అటు బిజెపి.. జనసేనలో పొత్తులో ఎన్నికలకు వెళ్లాలన్నది చంద్రబాబు ప్లాన్. అది సరిగ్గా పొసగడం లేదు.. పవన్ వాగుడు చూస్తే చంద్రబాబుకె భయం వేస్తోంది. ఈయనతో వెళితే మొత్తాన్ని ముంచేసేలా ఉన్నాడు అనే సంశయం మొదలైంది. అలాగని పొత్తులేకుండా వెళితే ఓటమి కన్ఫామ్ అయినట్టే. ఇక బిజెపికి సైతం రాష్ట్రాల్లో ఎదురుదెబ్బలు తప్పేలా లేదు.. దీంతో బిజెపితో వెళ్లాలా వద్దా? వెళ్తే ఏమవుతుందో అనే భయం వెంటాడుతోంది. ఇక ఇటు పవన్ కళ్యాణ్ సైతం ఒక దిశా నిర్దేశం లేని మార్గంలో పయనిస్తూ తనకుతానే దారితప్పిపోతున్నారు. ఇక జగన్ మాత్రం ఎవర్నీ నమ్ముకోకుండా అచ్చం ప్రజలతో మాత్రమే మా పొత్తు. మీ ఇంట్లో మేలు జరిగితే.. మీకు మంచి జరిగితే మీ బిడ్డను ఆశీర్వదించండి అనే కాన్ఫిడెన్స్ తో ఎన్నికలకు వెళ్తున్నారు. ఇవన్నీ గ్రహించిన ప్రజలు జగన్‌కు మరోమారు పట్టంగట్టే అవకాశాలు ఉన్నాయని ఆ సర్వే చెబుతోంది.