అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 జగమెరిగిన సత్యం చిత్ర టైటిల్, మోషన్ పోస్టర్ ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. అచ్చ విజయ భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తిరుపతి పాలే దర్శకత్వం వహిస్తున్నారు. అవినాష్ వర్మ ఆద్య రెడ్డి, నీలిమ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటుంది.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ నేపద్యంలో 1994 లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తిరుపతి పాలే. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా నిర్మాత అచ్చ విజయ భాస్కర్ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. మేలో సినిమాను థియేటర్స్ లో విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ…
జగమెరిగిన సత్యం టైటిల్ బాగుంది. మోషన్ పోస్టర్ గ్రాండ్ గా ఉంది. మంచి కథ కథనాలతో వస్తోన్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సినిమా సక్సెస్ అయ్యి చిత్ర యూనిట్ అందరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను అన్నారు.
నటీనటులు: అవినాష్ వర్మ, ఆద్య రెడ్డి, నీలిమ పతకమ శెట్టి
డైరెక్టర్: తిరుపతి పాలె
నిర్మాత: అచ్చ విజయ భాస్కర్
కెమెరామెన్: షోయబ్
ఎడిటర్: అమర్ రెడ్డి
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీపాల్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ కుమార్ ఘటకల
పీఆర్ఓ: శ్రీధర్