క్రియేటివ్ జీనియస్ సుకుమార్ చేతులమీదుగా గ్రాండ్ గా లాంచ్ అయిన “వేద” టీజర్
ఫ్రాగ్రన్స్ మ్యానిఫెస్టేషన్ పతాకంపై చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా జే.డి. స్వామి దర్శకత్వంలో జె.సుధాకర్, శివ బి, రాజీవ్ కుమార్ బి, శ్రీనివాస్ లావూరి, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) లు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం “వేధ”. శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న సందర్భంగా చిత్రం యూనిట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ గారు చిత్ర టీజర్ ను విడుదల చేయగా, ప్రముఖ రచయిత చంద్రబోస్ మోషన్ పోస్టర్ ను లాంచ్ చేశారు.. ఇంకా ఈ కార్యక్రమానికి నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్, ఎడిటర్ ప్రవీణ్ పూడితోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.అనంతరం
*ప్రముఖ దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ…* ఈ సినిమాకు ఆ స్వామి ఏడు కొండలు లాగా ఏడుగురు నిర్మాతలు ఉన్నారు. ఇక్కడే వీరి సక్సె కన్‌ఫర్మ్ అయింది. మోషన్ పోస్టర్, టీజర్ చాలా బాగుంది. మోషన్ పోస్టర్ అదిరిపోయింది. టీజర్ చూస్తే బ్లాస్టింగ్. ‘వేద’ టైటిల్ కూడా నైస్. నిర్మాతలు అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సూపర్‌హిట్ అయి యూనిట్ అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా. సంగీత దర్శకుడు అజయ్ మంచి వర్క్ చేశారు. చంద్రబోస్ గారి సాహిత్యం గురించి ఇక చెప్పేదేముంది – రాకింగ్. హీరో చేనాగ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. టీం అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.
*లిరిక్ రైటర్ చంద్ర బోస్ మాట్లాడుతూ..* ప్రపంచంలో ఏడు వింతలు ఉంటాయి అన్నట్టు.. వాటిని చూడలేదు కానీ ఈ సినిమాకు మాత్రం ఏడుగురు నిర్మతాలను చూశాను. చిత్ర దర్శకుడు జె.డి. చిన్న నాటి ఫ్రెండ్. నాకంటే చిన్న అయినా మేము కలసి చదువుకున్నాం. కలసి ఆడుకున్నాము. నేను ఏం చేస్తే తను అదే చేసేవాడు. నేను సినిమాలలోకి వస్తే ఇప్పుడు తను సినిమాలలోకి వచ్చాడు. ప్రస్తుతం నేను దిగ్విజయంగా నా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాను. చక్కటి అవగాహన, ఓర్పు, వంటి మంచి లక్షణాలు తనలో కలగి ఉన్న తనుకూడా నాలాగే ఇండస్ట్రీ లో పెద్ద సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అక్షరానికి గౌరవమిచ్చే సంగీత దర్శకుడు అజయ్ కు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎన్నో అవరోదాలను దాటుకొని వచ్చాడు జె.డి. పట్టుపట్టి నాతో నాలుగు పాటలు రాయించుకున్నాడు. నా భార్య సుచిత్ర కూడా ఒక పాటకు కోరియోగ్రఫీ చేసింది. ఇలాంటి మంచి సినిమాలో వర్క్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.
*చిత్ర దర్శకుడు జె.డి. స్వామి మాట్లాడుతూ..* సొసైటీ లో ఉన్న చాలా విషయాలలో ఒక కొత్త జానర్ తో రావాలని సైకో రొమాంటిక్ థ్రిల్లర్ కథను రెడీ చేసుకొని ముందుకు రావడానికి ముగ్గురు కారణం. వారే చిత్ర నిర్మాతలు, దర్శకులు సుకుమార్, చంద్రబోస్ గార్లు. మన లైఫ్ లో తల్లి, తండ్రి, గురువు అనే వారు సిగ్నిఫికెంట్ గా ఉంటారు. ఈ ప్రాజెక్ట్ కు తల్లి గా నిర్మాతలు ఉన్నారు. అప్పుడే తడ బడుతూ అడుగులు వేస్తూ ముందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు చేయూత నిచ్చి తడబాటు అడుగులకు తండ్రి గా ధైర్యాన్ని ఇచ్చి నడక నేర్పారు సుకుమార్ గారు. అలాగే ప్రేమంటే ఏంటి? అది ఎలా ఉంటుంది అంటూ చంద్రబోస్ గారు కొత్త కాన్సెప్ట్ తో పాట రూపంలో చాలా విషయాలు నేర్పించారు. ప్రస్తుతం చాలా మంది సిగరెట్ రూపంలో, కోకైన్ రూపంలో ఇలా ఎదో రూపంలో డ్రగ్స్ తీసుకుంటుంటారు. కానీ.. ఈ డ్రగ్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ను డ్యామేజ్ చేస్తుంది .అయితే ఈ ఫిల్మ్ లో ఇచ్చే డ్రగ్ మాత్రం మీకు ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ను క్యూర్ చేసి మిమ్మల్ని లైఫ్ లాంగ్ హెల్తీగా ఉంచుతుంది అని కోరుకుంటున్నాను అన్నారు.
*చరణ్..* వేద సినిమాను బ్లెస్సింగ్ చేయడానికి వచ్చిన సుకుమార్ కు పెద్దలకు ధన్యవాదములు. చిత్ర దర్శకుడు డైరెక్టర్ సుకుమార్ గారి ఇన్స్పిరేషన్ తో చక్కటి కథను తెరకెక్కిస్తున్నాడు. హీరో చే నాగ్ క్యారెక్టర్ లో లీనమై నటించాడు. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ కు చంద్రబోస్ గారితో పాటలు రాయించాలి, చిత్ర గారితో పాట పాడియ్యాలానే డ్రీమ్ అంటే చిత్ర గారితో పాడించాము. చంద్ర బోస్ గారిచ్చిన అద్భుతమైన పాటలకు సంగీత దర్శకుడు అజయ్ చక్కటి మ్యూజిక్ చేశాడు. ఇందులో ఉన్న నాలుగు పాటలు పెద్ద హిట్ అవుతాయి. ఇలా మంచి సినిమా తీయాలానే డ్రీమ్ ఉన్న టెక్నిసియన్స్ దొరికారు. వారందరూ ఈ సినిమాను ఓన్ చేసుకొని చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.
*మరో నిర్మాత రాజీవ్ కుమార్ మాట్లాడుతూ…* ఈ కార్యక్రమానికి వచ్చిన సుకుమార్ కు ధన్యవాదాలు. మా ఏడుగురు ఫ్రెండ్స్ కు సినిమాలంటే ఇష్టం. అయితే ఒక్కొక్కరు ఒక్కో సినిమా తీసినప్పుడు సక్సెస్ కాకపోతే ఇబ్బంది పడతాము. అదే అందరూ కలసి సినిమాలు చేస్తే అందరూ ఫెయిల్ కాకుండా అందులో కొన్ని అయినా సక్సెస్ అవుతాయనే నమ్మకంతో సమాజానికి ఉపయోగపడే ఒక కొత్త ఎక్స్పరిమెంటల్ సినిమా చేస్తున్నాము. ఇలా మేము అందరికీ ఉపయోగపడే సినిమాలు చేస్తూ సక్సెస్ వచ్చే వరకు మేమంతా సినిమాలు చేస్తూనే ఉంటాము అన్నారు.
*మరో నిర్మాత రాజేంద్ర మాట్లాడుతూ..* మా కార్యక్రమానికి వచ్చిన సుకుమార్ కు ధన్యవాదములు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు.
*చిత్ర హీరో చే నాగ్ మాట్లాడుతూ..* మా వేద సినిమాను బ్లెస్ చేయడానికి వచ్చిన సుకుమార్ గారికి ధన్యవాదములు. అలాగే నన్ను నమ్మి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చిన ఏడుగురు నిర్మాతలుకు ధన్యవాదములు. జె.డి.స్వామి లేకపోతే నేను ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉండే వాడిని కాదు. డి. ఓ పి మంచి విజువల్స్ ఇచ్చారు. ఇందులోని సాంగ్స్ అద్భుతంగా ఉంటాయి. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
*సంగీత దర్శకుడు అజయ్ మాట్లాడుతూ..* ఇలాంటి మంచి ప్రాజెక్ట్ లో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టు వల్ల నాకు చంద్రబోస్ గారితో వర్క్ చేసే అదృష్టం దొరికింది అనుకుంటుంటే చిత్ర గారు కూడా యాడ్ అయ్యారు. అలాగే సుకుమార్ గారు నా పాటలు విన్నారని తెలిసి చాలా సంతోషం వేసింది. ఇలా ఈ సినిమా నాకు లైఫ్ లాంగ్ లో మెమోరీ గా నిలుస్తుంది. ఇందులోని పాటలు అందరికీ కచ్చితంగా నచ్చుతాయి అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు.
*నటీ నటులు:*
చేనాగ్ (హీరో), ప్రాచీ థాకర్ (హీరోయిన్), డా.అభినయ ఆనంద్, ఇషన్, నోమిన తార, భూషణ్, బాబా మీర్, కేశవ్ దీపక్, లావణ్య రెడ్డి, స్నేహ గీతాంజలి తస్య, హరిశ్చంద్ర (బాహుబలి ఫేమ్ ),లావణ్య, గిరి, అయిషా, సత్తన్న, మేఘా రాజ్, కృష్ణ తేజ, సింగ్, సిద్దు, గ్రీష్మ, లావణ్య, గౌతమి, సత్యవాణి, గట్టు రవి, టోని, వేణు, ప్రియ, చైతన్, ఇషా, ఉద్ధవ్, నవీన్ , కోటి , తదితరులు
*సాంకేతిక నిపుణులు:*
బ్యానర్ : ఫ్రాగ్రన్స్ మ్యానిఫెస్టేషన్
నిర్మాతలు: జె.సుధాకర్, శివ బి, రాజీవ్ కుమార్ బి, శ్రీనివాస్ లావూరి, రాజేందర్ కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా)
కథ, స్క్రీన్ ప్లే & దర్శకత్వం: జే .డి స్వామి
టెక్నికల్ హెడ్: పీ .జీ . విందా
డి .ఓ .పీ : రామ్ కె మహేష్
సంగీతం: అజయ్
సాహిత్యం: చంద్రబోస్
కొరియోగ్రాఫర్‌లు: సుచిత్ర చంద్రబోస్, అన్న రాజ్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
పీ ఆర్. ఓ : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు
కో-డైరెక్టర్: పవిత్రం,
అసోసియేట్ డైరెక్టర్లు: డి.ఆర్.కుమార్ & నవీన్,
అసిస్టెంట్ డైరెక్టర్: వజ్ర ప్రమోద్,
అసోసియేట్ ఆఫ్ సినిమాటోగ్రఫీ: భాను,
చీఫ్ అసోసియేట్ ఎడిటర్స్: రామకృష్ణ & వేణు,
పోస్టర్ డిజైనర్: శివ
ఆర్ ఆర్,సౌండ్ ఎఫెక్ట్స్: ఇతిరాజ్,
డి ఐ : బసవ, గణేష్, విక్రమ్ (డిజిపోస్ట్)
వి.యఫ్ ఎక్స్ : శివ
డబ్బింగ్ ఇంజనీర్: గణేష్
Gripping Teaser Of Che Nag, JD Swamy’s Vedha Unveiled
Vedha is an upcoming unique psychological romantic thriller film written and directed by JD Swamy. Che Nag is playing the lead in the movie produced by J Sudhakar, Shiva B, Srinivas lavoori, Rajeev Kumar B, Rajendra Kanukuntla and Sridhar Akkineni (USA) under Fragrance Manifestation banner. Prachi Thaker is the leading lady.
Star director Sukumar launched teaser of the movie and he appreciated the team for coming up with an atypical subject. Leading lyricist Chandra Bose who penned lyrics for all the songs also graced the occasion and released motion poster.
The teaser shows Vedha (Che Nag) as an alcohol addict who is mad and is a hyperosmaik (smelling obsession). He runs after females to smell their body odour. Is it a gift or a curse? A psychiatrist warns he will become a serial killer, if he’s not stopped. In the meantime, Vedha falls in love with a girl and the rest of the story is about how the love changes him.
JD Swamy opted for a different story and there is uniqueness in narration as well. Che Nag’s character is the biggest strength. The youngster has played the role with perfection. Abhinaya explores the character as ACP. Technically, the teaser is very impressive. PG Vinda is the technical head of the movie for which cinematography is by Ram K Mahesh and Ajay Arasada provided music. Prawin Pudi is the editor.
The teaser has generated curiosity on the movie which is getting ready for release.