దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్ బాస్ ఫెమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మిస్తున్న ఔట్ & ఔట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “లక్కీ లక్ష్మణ్”. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావి పూడి విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్బంగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావి పూడి మాట్లాడుతూ.. ”లక్కీ లక్ష్మణ్” ఫస్ట్ లుక్ చాలా బాగుంది. దర్శక, నిర్మాతలకు ఇది మొదటి చిత్రమైనా చాలా చక్కగా తెరకెక్కించారు.వీరిద్దరికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలి. నటుడు సోహైల్ నాకు బిగ్ బాస్ నుండి తెలుసు తను నటన బాగుంటుంది. వీరి ముగ్గురు కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
చిత్ర హీరో సొహైల్ మాట్లాడుతూ… మా అనిల్ రావిపూడి అన్న ఎంతో బిజీగా ఉన్నా మా ”లక్కీ లక్ష్మణ్” ఫస్ట్ లుక్ ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది.తను లాంచ్ చేయడంతో మా సినిమా బిగ్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నాము.మా దర్శక, నిర్మాతలకు సినిమాపై ఎంత ప్యాషన్ ఉందో సినిమా కథలను సెలెక్ట్ చేసుకోవడంలో కూడా అంతే అభిరుచిని కలిగి ఉన్నారు ఈ సినిమాకు టెక్నికల్ పరంగా, ఔట్ ఫుట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సీనియర్ టెక్నీషియన్స్ తో నిర్మించారు.ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.
చిత్ర దర్శకుడు అభి మాట్లాడుతూ…నటీ, నటులు టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడం జరిగింది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ చేసుకునే వరకు రావడమే కాకుండా నా ఫెవరెట్ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి గారి చేతుల మీదుగా మా ”లక్కీ లక్ష్మణ్” ఫస్ట్ లుక్ విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. మా జనరేషన్ దర్శకులకు ఆయనే ఇన్స్పిరేషన్. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
చిత్ర నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ… దర్శకుడు అనిల్ రావీపూడి గారు ఎంతో బిజీగా ఉన్నా మేము అడిగిన వెంటనే మా ”లక్కీ లక్ష్మణ్” ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. వారికి మా ధన్యవాదాలు. మా ”లక్కీ లక్ష్మణ్” మోషన్ పోస్టర్ ను చూసిన చాలా మంది ఇది చాలా క్రియేటివ్ గా ఉంది, దర్శక, నిర్మాతలు డిఫ్రెంట్ సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకొని తీస్తున్నారు. ప్రేక్షకులకు ఒక మంచి కాఫీ లాంటి సినిమాను ఇస్తారనే కామెంట్స్ రావడంతో మాకది ఎంతో ఎనర్జీని ఇచ్చినట్లు అయ్యింది.దర్శకుడు అభి ఎంతో ట్యాలెండెడ్ పర్సన్ తను చెప్పిన కథ నచ్చడమే కాకుండా సినిమా కొరకు తను పడే కష్టం, తపన చూసి తనకోసం ఈ సినిమా చేస్తున్నాను. సోహైల్ తో పాటు సీనియర్ నటులు మరియు సీనియర్ టెక్నిషన్స్ అందరూ మాకు ఫుల్ సపోర్ట్ చేయడంతో షూటింగ్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మంచి డీఫ్రెంట్ సబ్జెక్టు తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది. త్వరలో ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తామని అన్నారు.
నటీనటులు
సోహెల్, మోక్ష, దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని సాల్మన్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, మాస్టర్ రోషన్, మాస్టర్ అయాన్, మాస్టర్ సమీర్, మాస్టర్ కార్తికేయ, ఝాన్సీ, రచ్చ రవి , జబర్దస్త్ కార్తిక్ , జబర్దస్త్ గీతు రాయల్ కామెడీ స్టార్స్ ఫేమ్ యాదం రాజు తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్స్ – దత్తాత్రేయ మీడియా, నిర్మాతలు – హరిత గోగినేని, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – ఏఆర్ అభి, సంగీతం – అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రాఫర్ – ఐ. ఆండ్రూ, ఎడిటర్ – ప్రవీణ్ పూడి, పాటలు – భాస్కరభట్ల, కొరియోగ్రాఫర్ – విశాల్,
ఆర్ట్ డైరెక్టర్ – చరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విజయానంద్. కీత, పీఆర్వో – నాయుడు-ఫణి, మార్కెటింగ్ పార్ట్ నర్ – టికెట్ ఫ్యాక్టరీ, పబ్లిసిటీ డిజైనర్ – ధని ఏలే, కాస్టింగ్ డైరెక్టర్ – ఓవర్ 7 ప్రొడక్షన్స్