• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

కేసీఆర్ స్వ‌యంగా ఫోన్ చేసి రమ్మంటేనే వెళ్లాను: ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్

admin by admin
June 13, 2022
in politics
0 0
0
కేసీఆర్ స్వ‌యంగా ఫోన్ చేసి రమ్మంటేనే వెళ్లాను: ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో హ‌రీశ్ రావు ఆహ్వానం ప‌లికారు కేసీఆర్‌తో క‌లిసి లంచ్ చేశాను.

విందులో ప్ర‌శాంత్ కిశోర్ కూడా పాల్గొన్నారు.
ఎలాంటి రాజ‌కీయ పార్టీ గురించి చ‌ర్చ జ‌ర‌గ‌లేదు
మ‌రోమారు పిలుస్తాన‌న్నారు.
కేంద్రంలో బీజేపీ పాల‌న‌పైనే ప్ర‌ధాన చ‌ర్చ‌
బీజేపీ పాల‌న‌పై నాదీ, కేసీఆర్‌దీ ఒకే భావ‌న‌
కేసీఆర్‌తో భేటీపై ఉండ‌వ‌ల్లి వ్యాఖ్య‌లు

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీకి చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఆదివారం భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ భేటీకి సంబంధించిన వివ‌రాల‌ను ఉండ‌వ‌ల్లి సోమ‌వారం రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు. కేసీఆర్ స్వ‌యంగా ఫోన్ చేసి పిలిస్తేనే ఆయ‌న‌తో భేటీ అయ్యాన‌ని ఈ సంద‌ర్భంగా ఉండ‌వ‌ల్లి చెప్పారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ భేటీలో ఎలాంటి పార్టీ గురించి చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

కేసీఆర్ ఆహ్వానం మేర‌కే తాను ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లాన‌ని చెప్పిన ఉండ‌వల్లి…త‌న‌ను మంత్రి హరీశ్ రావు రిసీవ్ చేసుకున్నారని తెలిపారు. ఆ త‌ర్వాత కేసీఆర్‌తో త‌న‌ భేటీలో హ‌రీశ్‌తో పాటు మ‌రో మంత్రి, ఓ ఎంపీ పాల్గొన్నార‌ని ఆయ‌న చెప్పారు. తాము చ‌ర్చించుకున్నంత సేపు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ కూడా అక్క‌డే ఉన్నార‌ని తెలిపారు. అయితే ప్ర‌శాంత్ కిశోర్ చ‌ర్చ‌లో పాలుపంచుకోలేద‌ని, తాము మాట్లాడుకుంటూ ఉంటే ఆయ‌న సాంతంగా విన్నార‌ని తెలిపారు. ఏపీలో అన్ని పార్టీల కంటే బీజేపీనే బ‌ల‌మైన పార్టీ అని ఉండ‌వ‌ల్లి చెప్పారు. ఏపీలో 25 మంది ఎంపీలు బీజేపీ ఎంపీలుగానే భావించాల‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ఈ భేటీలో రాజ‌కీయాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింద‌న్న ఉండ‌వ‌ల్లి… బీఆర్ఎస్ గురించి మాత్రం ప్ర‌స్తావ‌న రాలేద‌న్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాల‌న‌పైనే చ‌ర్చ జ‌రిగింద‌న్నారు. దేశంలో మోదీ పాల‌న‌ను వ్య‌తిరేకించే వారిలో కేసీఆరే బ‌ల‌మైన నేత‌గా ఉన్నార‌న్నారు. తాను బీజేపీకి వ్య‌తిరేకం కాద‌ని చెప్పిన ఉండ‌వ‌ల్లి… ఆ పార్టీ విధానాలతో తాను వ్య‌తిరేకిస్తాన‌ని చెప్పారు. బీజేపీ విధానాలు ఇప్పుడున్న‌ట్లుగా మ‌రింత మేర పెరిగితే ప్ర‌మాద‌మేన‌ని ఉండ‌వ‌ల్లి చెప్పారు. ఈ విష‌యంపైనే తాము ప్ర‌ధానంగా చ‌ర్చించుకున్నామ‌న్నారు. కేంద్రంలో బీజేపీకి వ్య‌తిరేకంగా ప‌నిచేసే దిశ‌గా కేసీఆర్ సుదీర్ఘ క‌స‌ర‌త్తే చేశార‌న్నారు. బీజేపీపై కేసీఆర్‌తో పాటు త‌న‌దీ ఒక‌టే అభిప్రాయ‌మ‌ని ఆయ‌న చెప్పారు.

ఇక కేసీఆర్‌తో క‌లిసి తాను మ‌ధ్యాహ్న భోజ‌నం చేశాన‌ని ఉండ‌వ‌ల్లి చెప్పారు. త‌న‌ను కేసీఆర్ ఆహ్వానిస్తే… సీఎంఓ నుంచి తాను వెజ్ తింటానా? నాన్ వెజ్ తింటానా?అంటూ ఆరా తీసింద‌ని ఆయన చెప్పారు. త‌న‌తో పాటు కేసీఆర్ కూడా వెజిటేరియ‌నే తిన్నార‌ని చెప్పారు. ఆదివారం నాడు నాన్ వెజిటేరియ‌న్లు మాంసాహారం తినేందుకు ఆస‌క్తి చూపుతార‌ని, అయితే కేసీఆర్ ఏం తింటారో త‌న‌కు తెలియ‌ద‌ని, త‌నతో క‌లిసి వెజ్ మాత్ర‌మే తిన్నార‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌శాంత్ కిశోర్ కూడా త‌మ‌తో క‌లిసి లంచ్ చేశార‌ని ఆయ‌న చెప్పారు. తాను అర‌గంట మాట్లాడితే కేసీఆర్ రెండున్న‌ర గంట‌లపాటు మాట్లాడార‌ని ఉండ‌వ‌ల్లి చెప్పారు.

Previous Post

ఘనంగా ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

Next Post

ఇంటర్వ్యూ ; మురళి, సురేఖ దంపతుల ప్రయాణమే ‘కొండా’ సినిమా – RGV

Next Post
ఇంటర్వ్యూ ; మురళి, సురేఖ దంపతుల ప్రయాణమే ‘కొండా’ సినిమా – RGV

ఇంటర్వ్యూ ; మురళి, సురేఖ దంపతుల ప్రయాణమే 'కొండా' సినిమా - RGV

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల
movies

“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

by admin
February 11, 2026
0

...

Read more
WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

February 10, 2026
టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

February 10, 2026
గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన  సినీ నటి మాళవిక మోహన్

గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన సినీ నటి మాళవిక మోహన్

February 9, 2026
“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

February 2, 2026
“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

February 2, 2026
ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

February 2, 2026
లగ్జరీ సిల్వర్ జువెలరీ  ‘గోయాజ్ (GOYAZ)’ –22వ  స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో  ప్రారంభం

లగ్జరీ సిల్వర్ జువెలరీ ‘గోయాజ్ (GOYAZ)’ –22వ స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో ప్రారంభం

February 1, 2026
వైభవంగా జరిగిన హీరో  సతీష్ జై కుమార్తె ‘నైరా ‘  పుట్టినరోజు వేడుక

వైభవంగా జరిగిన హీరో సతీష్ జై కుమార్తె ‘నైరా ‘ పుట్టినరోజు వేడుక

January 29, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In