అంజన్ కస్తూరి, సాంచి బార్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “దిల్ రెడ్డి”. ఈ చిత్రాన్ని ధీరజ్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం.1గా నిర్మిస్తోంది. అమ్మగారి రామరాజు (రమేష్) ఈ చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. చంద్రశేఖర్ వై. సి. ఈశ్వర్ రెడ్డి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో దిల్ రెడ్డి సినిమా ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు తనికెళ్ల భరణి హీరో హీరోయిన్లపై క్లాప్ నిచ్చారు. త్రినయని ఫేమ్ భరద్వాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
దర్శక నిర్మాత అమ్మగారి రామరాజు మాట్లాడుతూ – మా ధీరజ్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం.1గా దిల్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నాం. సరికొత్త కథా కథనాలతో కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ ఉంటుంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమిది. తనికెళ్ల భరణి గారు కీ రోల్ చేస్తున్నారు. చంద్రశేఖర్, ఈశ్వర్ రెడ్డి నాకు ప్రొడక్షన్ లో సపోర్ట్ గా నిలుస్తున్నారు. త్వరలోనే మా చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తాం. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం. అన్నారు.
హీరో అంజన్ కస్తూరి మాట్లాడుతూ – నేను నటిస్తున్న మొదటి చిత్రమిది. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ రామరాజు గారికి థ్యాంక్స్. ఎలాంటి అసభ్యత లేకుండా సకుటుంబంగా ప్రేక్షకులు చూసేలా క్లీన్ గా మూవీ ఉంటుంది. లవ్, ఫ్యామిలీ డ్రామా కథతో దిల్ రెడ్డి సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.
నటుడు భరద్వాజ్ మాట్లాడుతూ – దిల్ రెడ్డి సినిమా టైటిల్ ఎంత పవర్ ఫుల్ గా ఉందో సినిమా కూడా అంతే బాగుంటుంది. ఇందులో నేను కీ రోల్ చేస్తున్నాను. హీరో అంజన్ కస్తూరికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. మంచి సబ్జెక్ట్ తో వస్తున్న ఈ సినిమా మిగతా టీమ్ అందరికీ పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ సాంచి బార్తి మాట్లాడుతూ – దిల్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ రామరాజు గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమా మా టీమ్ అందరికీ సంతోషాలను తీసుకురావాలని కోరుకుంటున్నా.సపోర్ట్ చేస్తున్న మీ అందరికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
సి దినకరన్ గారు మాట్లాడుతూ దిల్ రెడ్డి సినిమా మంచి విజయాన్ని సాధించాలని తెలియజేసారు.
*నటీనటులు* – అంజన్ కస్తూరి, సాంచి బార్తి, తనికెళ్ల భరణి, ఆలీ, టార్జాన్,భరద్వాజ్, వి లక్ష్మీ నారాయణ, డి అశోక్ బాబు, ఎ అనన్య శ్రీ,ఎ శ్రీ వర్ష, ఆరోజు శ్రీదేవి తదితరులు
*టెక్నికల్ టీమ్*
ఆర్ డైరెక్టర్ – భూపతి యాదగిర్
సినిమాటోగ్రఫీ – రామచంద్ర రావ్
మ్యూజిక్ – షారుఖ్ షేక్
కాస్ట్యూమ్ డిజైనర్: శ్వేతా మురళి కృష్ణ
కాస్ట్యూమ్ చీఫ్:- మెరుగు తిరుపతి
ప్రొడక్షన్ మేనేజర్- కుర్మ భీమేష్
పీఆర్ఓ – వీరబాబు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రొంపల్లి మురళీకృష్ణ ( NBk మురళి)
కో ప్రొడ్యూసర్స్ – చంద్రశేఖర్ వై, సి. ఈశ్వర్ రెడ్డి
ప్రొడ్యూసర్ , డైరెక్టర్ – అమ్మగారి రామరాజు (రమేష్)