‘గంధర్వ’కు కంప్లీట్ కాంట్రస్ట్‌గా ‘దర్జా’ మ్యూజిక్ ఉంటుంది: సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్
సరికొత్త సౌండింగ్‌ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ.. సక్సెస్‌ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్ రాక్ షకీల్. ఆయన సంగీత దర్శకత్వం వహించిన ‘గంధర్వ’ చిత్రం తాజాగా విడుదలై.. థియేటర్లలో సక్సెస్‌ఫుల్ టాక్‌తో రన్ అవుతోంది. అలాగే ఆయన సంగీతం అందించిన మరో చిత్రం ‘దర్జా’.. ఈ నెల 22న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ‘గంధర్వ’ చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పేందుకు ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ‘గంధర్వ’ చిత్ర విషయాలతో పాటు, ‘దర్జా’ చిత్ర విశేషాలను కూడా ఆయన పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ..
-ముందుగా ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. ఎందుకంటే, ‘గంధర్వ’ చిత్రంతో మంచి విజయాన్ని అందించినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రం కర్నాటకలోనే కాకుండా.. తెలుగు రాష్ట్రాలలో కూడా సక్సెస్‌ఫుల్ టాక్‌తో రన్ అవుతుంది. ముఖ్యంగా మ్యూజిక్ పరంగా ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తుండటం చాలా సంతోషంగా ఉంది.
– నా మరో చిత్రం ‘దర్జా’ కూడా ఈ జూలై 22న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ‘గంధర్వ’ చిత్రాన్ని ఎలా అయితే ఎంజాయ్ చేశారో.. ‘దర్జా’ కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా అందరినీ అలరిస్తుంది. కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘దర్జా’. ఈ చిత్రాన్ని కూడా ఆదరించి.. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.
– నేను చేసే ప్రతి సినిమాకి గుడ్ క్వాలిటీ, గుడ్ సౌండింగ్ ఇచ్చేందుకు ఎంతగానో తాపత్రయపడతాను. నేను చేసే ప్రయోగాలను యాక్సెప్ట్ చేస్తున్న ప్రేక్షకులకు మరొక్కసారి ధన్యవాదాలు. అలాగే నా దర్శకులకి, నా నిర్మాతలకి, ఫిల్మ్ ఇండస్ట్రీ వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నన్ను ప్రేక్షకులకి చేరువ చేసిన మీడియా వారికి కూడా థ్యాంక్యూ సో మచ్.
– ‘దర్జా’ మూవీ మ్యూజిక్.. ‘గంధర్వ’కు కంప్లీట్ కాంట్రస్ట్‌గా ఉంటుంది. ‘గంధర్వ’ మాదిరిగానే ‘దర్జా’ సినిమాకు కూడా మీ ఆశీస్సులు అందించి.. గొప్ప విజయాన్ని అందించాలని కోరుతున్నాను.
– ప్రతి పాటని క్యాచీగా ఉండేలా, ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేయడం జరిగింది. ‘దర్జా’లోని లింగా లింగా సాంగ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఒక్కరోజులోనే ఆ పాట 1 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం. ఇప్పటికీ ఆ పాటకి మంచి స్పందన వస్తూనే ఉంది. అలాగే ‘గంధర్వ’ చిత్రంలోని ‘ఎళ్లిపోకే సవారియా’, ‘కనులకే’ సాంగ్స్‌కి థియేటర్లలో వస్తున్న స్పందన చూస్తుంటే.. అంతకంటే ఇంకేం కావాలి నాకు.. అనే ఫీలింగ్ వస్తోంది.
– ఇలాంటి సపోర్ట్ ప్రేక్షకుల నుండి వస్తుంటే.. ఇంకా ముందు ముందు మరిన్ని మంచి ప్రయోగాలు చేసి.. మంచి మ్యూజిక్‌ని, మంచి సాంగ్స్‌ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటాను. అందుకు బూస్టప్ ఇస్తుంది మాత్రం ప్రేక్షకులే అని మాత్రం ఎప్పటికీ మరిచిపోను. రాబోయే నా ప్రాజెక్ట్స్‌లో కూడా రెగ్యులర్ సౌండ్ కాకుండా డిఫరెంట్ సౌండింగ్‌ని పరిచయం చేయబోతున్నాను.
-ఆర్ఆర్ విషయానికి వస్తే.. ప్రతి బీజియం ప్రేక్షకులకు నచ్చేలా.. మనసు పెట్టి చేస్తాను. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడానికి చాలా చాలా ఇష్టపడుతుంటాను. ఎంత టైమ్ పట్టినా సరే.. ఎంజాయ్ చేస్తూ చేస్తుంటాను. ‘గంధర్వ’ సినిమా విషయంలో ప్రేక్షకుల ఫీడ్‌బ్యాడ్ విన్నాక.. పడిన కష్టమంతా మరిచిపోయాను. ‘దర్జా’ విషయంలో కూడా ఖచ్చితంగా.. ప్రతి ఒక్కరూ థియేటర్ నుండి బయటికి వచ్చాక మాట్లాడుకుంటారు. ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసేలా.. ఒక సరికొత్త సౌండింగ్‌ని మీరు వింటారు.
– సింగర్స్ కూడా ఎంతగానో సపోర్ట్ ఇచ్చారు. ‘దర్జా’ మూవీలో ఉత్తేజ్ గారు పాడిన పాట, మౌష్మి నేహా పాడిన లింగా లింగా పాట, కార్తీక్ గారు పాడిన పాట, అలాగే మన బాలుగారి తనయుడు చరణ్‌గారు పాడిన పాట.. ఇలా ప్రతీ పాటకి వారు ఎంతగానో సపోర్ట్ చేశారు. ‘గంధర్వ’కు కూడా సునీత, హేమచంద్ర వంటి వారంతా ఒక టీమ్‌లాగా నన్ను ఎంకరేజ్ చేశారు. నాకు సపోర్ట్ చేసిన సింగర్స్‌కు, టెక్నిషీయన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా సక్సెస్‌లో భాగం వారిది కూడా. అందుకే వారికి ధన్యవాదాలు.
– ‘దర్జా’ సినిమా దర్శకుడు చాలా సింపుల్‌గా ఉంటారు. కానీ ఆయన కథ చెప్పిన విధానం.. ఒక ‘కెజియఫ్’ రేంజ్‌లో అనిపించింది. ఆయన నాకు ఇచ్చిన ప్రజంటేషన్, ఆయన సినిమా తీసిన తీరుకి.. నేను 100 శాతం సంతృప్తి చెందాను. రేపు థియేటర్లలో సినిమాని చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా హండ్రెడ్ పర్సంట్ శాటిస్‌ఫై అవుతారు. అలాగే ఈ ప్రొడక్ట్ ఇంత క్వాలిటీగా రావడానికి కారణం మా నిర్మాతలు, డీఓపీ.. ఇంకా ఇతర సాంకేతిక నిపుణులందరూ ప్రాణం పెట్టి చేశారు.
– విజువల్ అంత చక్కగా వచ్చినప్పుడు.. మాకు కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఇంకా బాగా ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. నా సాంగ్స్‌కి కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, జావెద్ అలీ మాస్టర్‌లకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ‘గంధర్వ’, ‘దర్జా’ సినిమాల దర్శకులిద్దరికీ థ్యాంక్యూ.
-కొత్తవాళ్లని ఇండస్ట్రీలో తొక్కేస్తారు అనేది నేను నమ్మను. నా వెనుక ఎవరూ లేరు. డే 1 నుండి రోజురోజుకి నాకు సపోర్ట్ లభిస్తూనే ఉంది. డిజప్పాయింట్ చేసేవారు ఉంటారు కానీ.. వారిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లడమే. మనలో టాలెంట్, వర్త్ ఉంటే.. ఇండస్ట్రీ నుండి ఆటోమాటిక్‌గా సపోర్ట్ ఉంటుంది. మన దగ్గర మ్యాటర్ ఉంటే.. ఇండస్ట్రీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కరికీ బెస్ట్ ఫ్రెండ్ లాంటిది. అది మనల్ని షైనింగ్ చేస్తూ ఉంటుంది. అది వెళ్లిపోతూ వెళ్లిపోతూ సక్సెస్ అనే ఒక గొప్ప గిఫ్ట్‌ని ఇచ్చి వెళుతుంది.
-ప్రస్తుతం ‘బ్లాక్‌మ్యాన్’ అనే ఇంగ్లీష్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను. తమిళ్‌లో ఓ చిత్రం చేస్తున్నాను. తెలుగులో నేను చేయబోయే చిత్రాలు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి.