మూర్ఖత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే పెద్దమనిషి ఎవరు అంటే తెలుగు రాష్ట్రం ప్రజలు కళ్ళు మూసుకొని చెప్పే ఒకే ఒక పేరు నారా చంద్రబాబు నాయుడు. మొత్తం నాకే తెలుసు…నాకు తెలిసిందే నిజం…నేను చెప్పేదే కరెక్ట్.. అనే విధంగా మాట్లాడే ఈ పెద్దమనిషి గత కొద్ది కాలంగా ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో కూడా గమనించలేని స్థితిలో ఉన్నాడు.
పదవిలో లేకపోతే ఎవరూ పట్టించుకోరు కాబట్టి ఈసారి ఎలక్షన్స్ లో గెలవకపోతే పూర్తిగా పార్టీ పరిస్థితి గల్లంతవుతుంది అన్న ప్రెషర్ లో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఇందుకు నిదర్శనమే ఇంజనీర్ అవ్వాలి అంటే ఇంటర్మీడియట్ లో బైపిసి చదవాలి అని చంద్రబాబు చెప్పడం. మాట్లాడితే రూలింగ్ పార్టీపై అలా అన్నారు .. ఇలా అన్నారు అని పనిగట్టుకుని స్క్రిప్ట్ డైలాగులు చదివే దత్తపుత్రుడు కంటికి ఈ విషయం కనిపించదు కాబోలు.
ఒకపక్క కొడుకు చూస్తే వర్ధంతికి ,జయంతికి తేడా లేకుండా మాట్లాడుతాడు.. మరో పక్క తండ్రి చూస్తే బైపీసీ చదివితే ఇంజనీర్ అవుతారు అంటారు.. ఇలాంటి వాళ్లను నమ్ముకుని రాష్ట్ర అభివృద్ధి వాళ్ల చేతుల్లో పెడితే ప్రజల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ఓటర్లను సతాయిస్తుంది. చంద్రబాబు మాటలు విని ఇంత పెద్ద రాజకీయ పండితుడు ఏ లాజిక్ లేకుండా ఇంజనీర్ అవ్వాలంటే బైపీసీ చదవాలని ఎలా చెప్పారు అని కొందరు ఆలోచనలో కూడా పడ్డారు.
ఆగస్టు 15 సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఇండియా విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో సదరు మహానుభావుడు ఈ స్టేట్మెంట్ను ఇవ్వడం జరిగింది. పిల్లలు ఇంజనీరింగ్ చేయాలి అనుకోవడం ప్రతి తల్లిదండ్రుల యొక్క 20 ఏళ్ల డ్రీమ్ అని …అదే తన విజన్ అని వివరిస్తూ తడబడ్డ పెద్దమనిషి మీడియా చేతికి అడ్డంగా దొరికిపోయాడు. విజన్ మాట దేవుడెరుగు ఇంజనీర్ అవ్వాలంటే ఇంటర్మీడియట్లో చదవాల్సింది బైపిసి కాదు ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు బాబు అంటూ ప్రస్తుతం నేటిజన్స్ సోషల్ మీడియాలో ఈ విడియో ను బాగా వైరల్ చేస్తున్నారు.