• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఏపీలో పెట్టుబడులపై టీడీపీ ఎంపీ ప్రశ్న… పార్లమెంట్ లో టీడీపీ పరువు పాయె

admin by admin
July 23, 2023
in politics
0 0
0
ఏపీలో పెట్టుబడులపై టీడీపీ ఎంపీ ప్రశ్న… పార్లమెంట్ లో టీడీపీ పరువు పాయె
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

* రికార్డు స్థాయిలో వస్తున్నాయని లెక్కలతో సహా కేంద్రం సమాధానం

ఆంధ్రప్రదేశ్‌లో మన పెత్తందార్ల, దోపిడీ ప్రభుత్వం లేదు కాబట్టి అభివృద్ధి .. ప్రగతి ఇవన్నీ లేకుంటే బాగుణ్ణు.. ఏదైనా చేస్తే మనమే చేయాలి.. వేరే పార్టీ వాళ్ళు అది కూడా మనం ఎంతాగానో ప్రయాసపడి బదనాం చేయాలనీ ప్రయత్నిస్తున్న వైయస్ జగన్ ప్రభుత్వం ఉన్నపుడు రాష్ట్రానికి అసలు మంచి జరగకూడదు. మనం లేనపుడు రాష్ట్రం మొత్తం మట్టిగొట్టుకుని పోవాలి.. ఉంటే మనం ఉండాలి.. పొతే రాష్ట్రం పోవాలి.. ఇదీ టీడీపీ వాళ్ళ ఆలోచన. అందుకే ఎప్పుడు ఎక్కడ ఏ చిన్న లోపం… పొరపాటు దొరికినా దాన్ని పట్టుకుని పెద్దది చేసి, మన సొంత పత్రికల్లో వేసి, జగన్‌తో పాటు రాష్ట్రం పరువు తీసిపారేయాలని తపించే తెలుగుదేశం వారి ఆశలు సాక్షాత్తూ రాజ్యసభ సాక్షిగా నిరాశగా మారాయి.

ఆంధ్రాలో విదేశీ పెట్టుబడులు ఘోరంగా తగ్గిపోయినాయ్ అట కదా అంటూ లోలోన సంతోష పడుతూ రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అత్యుత్సాహంతో వేసిన ప్రశ్నకు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ
సహాయమంత్రి సోమ్ ప్రకాష్ సమాధానం ఇచ్చారు. దెబ్బకి టీడీపీ ఎంపీ బిక్కమొహం వేశాడు.

2019 అక్టోబర్ – 2020 మార్చ్ మధ్య : 200.97 మిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు వచ్చాయి
2020- 21 : 85.85 మిలియన్ డాలర్లు
2021-22 : 224.96 మిలియన్ డాలర్లు
2022-23 : 284.22 మిలియన్ డాలర్లు

ఇలా ఏటా ఏపీలో పెట్టుబడులు పెరుగుతూ వస్తున్నాయని లెక్కలతో కూడిన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజా జీవనం స్థంభించిపోగా ఆ ప్రభావం వలన 2020-21 మధ్య మాత్రం పెట్టుబడుల్లో క్షీణత ఉంది. ఆ కొద్దికాలం దాటగానే ఆంధ్రాలో మళ్ళీ పెట్టుబడుల వరద మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రికార్డ్ స్థాయిలో 2022- 23లో 284.22 మిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు రావడం అంటే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి దక్షతకు నిదర్శనం అని చెప్పకనే చెప్పారు.

*సందర్భం వచ్చిన ప్రతిసారీ ఇదే తీరు* …

ఇదే కాదు.. రాష్ట్రం అధోగతి పాలవ్వాలని, దాన్ని చూస్తూ పండగ చేసుకోవాలని ఎదురుచూసే తెలుగుదేశం నాయకుల ఆశల మీద సీఎం వైయస్ జగన్ తరచూ నీళ్లు పోస్తూనే ఉన్నారు. మొన్న మార్చిలో విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సును సైతం ఇలాగే చిన్నచూపు చూసిన తెలుగుదేశం అక్కడి సదస్సును, నిర్వహించే విధానాన్ని, దానికి హాజరైన పారిశ్రామికవేత్తలను చూసి వారం రోజులు కంటికిమింటికి ధారాపాతంగా ఏడ్చింది.

మనం కదా దావోస్ లాంటి సదస్సులకు వెళ్లి పెట్టుబడులు తెస్తాం… ఈ ప్రభుత్వం వళ్ళ అవన్నీ అయ్యేవా అంటూ గోతికాడ నక్కల్లా కూర్చున్న వాళ్ళ కళ్ళలో దుమ్మురేగేలా లక్షల కోట్ల పెట్టుబడులతో సదస్సు ముగిసింది. అంబానీ, అదానీ, బిర్లా, భజంకా ఇలాంటి చాలా పారిశ్రామిక సంస్థలు వచ్చి ఆంధ్రప్రభుత్వం పారిశ్రామికవేత్తల పట్ల, పరిశ్రమల ఏర్పాటు పట్ల చూపుతున్న శ్రద్ధను కొనియాడడం టిడిపికి, దాని అనుకూల మీడియాకు కంటిమీద కునుకులేకుండా చేసాయి.

విశాఖలో ఏటిజి టైర్ల పరిశ్రమ దగ్గర్నుంచి ఎన్నో విదేశీ సంస్థలు ఆంధ్రాలో పెట్టుబడులకు ఆసక్తి చూపడంతో సీఎం వైయస్ జగన్ సారధ్యంలోని ప్రభుత్వం సైతం పరిశ్రమల స్థాపనకు పలు రాయితీలు ప్రకటిస్తూనే వాళ్లకు అన్నివిధాలా సహకారం అందిస్తూ రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్నారు. అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో దేశంలోనే ఏపీ నంబర్ -1 లో నిలిచింది. ఏడ్చేవాళ్ళు ఏడవనీ… నవ్వేవాళ్ళు నవ్వనీ … నా గమనం.. పయనం మాత్రం ప్రగతిపథం వైపే అంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు సాగుతూ ఉంది.

Previous Post

వాట్ ఏ స్పీచ్ జగన్ సాబ్…

Next Post

పేదరికం తగ్గుతోంది… నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడి

Next Post
పేదరికం తగ్గుతోంది… నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడి

పేదరికం తగ్గుతోంది... నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

When Goodbye Becomes the Most Romantic Hello Story
movies

When Goodbye Becomes the Most Romantic Hello Story

by admin
February 13, 2026
0

...

Read more
“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

February 11, 2026
WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

February 10, 2026
టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

February 10, 2026
గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన  సినీ నటి మాళవిక మోహన్

గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన సినీ నటి మాళవిక మోహన్

February 9, 2026
“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

February 2, 2026
“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

February 2, 2026
ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

February 2, 2026
లగ్జరీ సిల్వర్ జువెలరీ  ‘గోయాజ్ (GOYAZ)’ –22వ  స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో  ప్రారంభం

లగ్జరీ సిల్వర్ జువెలరీ ‘గోయాజ్ (GOYAZ)’ –22వ స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో ప్రారంభం

February 1, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In