అజ్మీర్ దర్గాకు టి.పి.సి.సి. వర్కింగ్ ప్రెసిడెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇంఛార్జ్ మహ్మద్ అజహరుద్దిన్ చాదర్ సమర్పించారు. మంగళవారం గాంధీభవన్ లో ఆయన ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి దీపా దాస్ మున్షితో కలిసి నిర్వహించారు. ప్రతి ఏటా అజ్మీర్ కు తాను చాదర్ ను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని ఆయన అన్నారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో తాను మొక్కు చెల్లించుకున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అదికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలలో రెండింటిని అమలు చేసి… మహిళా లోకం నుంచి అశేష ఆదరణ పొందామన్నారు. రానున్న వందరోజుల్లో మిగతా వాటిని అమలు చేస్తాం అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని నిర్వహించిన ప్రజాపాలనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. సుమారు కోటి 25లక్షలకు పైగా ప్రజల నుంచి వినతులు వచ్చాయని, వాటి అమలు కోసం మంత్రి వర్గ ఉపసంఘం వేసి… త్వరిత గతిన పరిష్కరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ప్రలకిచ్చిన హామీలను నెరవేర్చి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లను గెలిచి సోనియా గాంధీ గారికి కానుకగా ఇస్తామన్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ అసదుద్దీన్ తో పాటు కాగ్రెస్ యూత్ లీడర్ మహ్మద్ అసదుద్దీన్, టి.పి.సి.సి జనరల్ సెక్రటరీ సయ్యద్ అబ్దుల్ ఫహీమ్, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.