‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంపై జర్నలిస్ట్ కట్టెపోగు వెంకటయ్య వేసిన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది.
పిటిషనర్ తరఫున న్యాయవాదులు ఉమేశ్ చంద్ర, నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
‘వై ఏపీ నీడ్స్ జగన్’ను ప్రభుత్వ కార్యక్రమంగా మార్చడంపై న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం, ప్రభుత్వ సొమ్ము వాడటం తదితర అంశాలను వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొనడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచనలు ఇచ్చారని న్యాయవాదులు తెలిపారు.
దీంతో ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సజ్జల, సీఎస్, పంచాయతీరాజ్, పురపాలక శాఖ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం 4 వారాలకు వాయిదా వేసింది.