పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, ఎస్ ఆర్ డి స్టూడియోస్ కలిసి నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు ‘చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా ఇటీవల రెండు జాతీయ అవార్డ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రెసెంట్ SRD స్టూడియోస్ సంస్థ పై ఫణి అడపాక ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో ఒక హీరోగా నటించిన ఈశ్వర్ రాచిరాజు హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రం ద్వారా రవీందర్.బి అనే యంగ్ డైరెక్టర్ పరిచయం కానున్నారట. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ చేయనున్నారని సమాచారం. త్వరలో దీనిపై చిత్ర నిర్మాతలు అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.









