75 ఏళ్లుగా అంచలంచలుగా అభివృద్ధి చెందిన భారత దేశాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టుపెట్టి ప్రజల మానప్రాణాలకు రక్షణ లేకుండా చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ల వైశాచిక ఆనందానికి అడ్డుకట్ట వేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ పిలుపునిచ్చారు. శనివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దోచుకో దాచుకో , పీక్కోవడం లాక్కోవడం వంటి కార్యక్రమాలు చేస్తున్న వైసిపి నాయకులు ఆగడాలను కల్లుండి కబోదిలా చూస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలన్నారు. వరదొస్తే వారం దాటిన తర్వాత వెళ్లే ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నామని రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ భ్రస్టు పట్టించారని మండిపడ్డారు. రాయలసీమలో కరువు వస్తే ఏమి మాట్లాడకుండా నిస్సిగ్గుగా మోడీ తాబేదారుగా మారిన జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో కూడా రాష్ట్రానికి ఏమీ చేయలేరని గుర్తు చేశారు . స్వాతంత్ర ఉద్యమంలో ఎందరో నాయకులను పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని కోరారు . ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు సైతం దేశానికి పణంగా పెట్టారని గుర్తు చేశారు. 15 శాతం ఉన్న అక్షరాస్యతను 100 శాతానికి పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ దన్నారు. కరువుతో అల్లాడుతున్న భారత దేశంలో ఉచిత బియ్యాన్ని అందించే స్థాయికి పంచవర్ష ప్రణాళికలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టారని గుర్తు చేశారు . రైల్వేలు , పోర్టులు, రోడ్లు, భూములు ఇలా అన్నింటిని అమ్మేస్తూ తన సొంత సామ్రాజ్యంలో సారాయి తయారుచేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు . మతం పై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారని ప్రాంతాల అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు కోసం గౌరవప్రదమైన రాజకీయం చేయాలని సూచించారు. ఆర్ఎస్ఎస్ , బిజెపి స్వాతంత్ర ఉద్యమానికి తూట్లు పొడిచారని ఇప్పుడే వారు అధికారంలోకి వచ్చి తామే స్వాతంత్రం తెచ్చినట్టు ఫోజులిస్తున్నారని ఎద్దేవా చేశారు. తిరంగా జండా గురించి మాట్లాడే అర్హత కూడా బిజెపి , ఆర్ఎస్ఎస్ కు లేదన్నారు . బిజెపిలో స్వాతంత్రం కోసం ఎవరు పోరాడారో గుర్తు చేయాలని ఆ పార్టీ నాయకులకు సవాల్ విసిరారు . మహాత్మా గాంధీ, నెహ్రూ, శాస్త్రి మౌలానా ఆజాద్ వంటి మహనీయులు నిర్మించిన కాంగ్రెస్ పార్టీకి ఆదరించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు .. దేశానికి కష్టం వచ్చింది దోచుకునే వారి చేతుల్లో పోయింది తీపి మాటలు మాట్లాడుతూ ప్రజల మానప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రధాని మోడీ జగన్ ప్రభుత్వాలను కూలగొట్టాలని కోరారు . సెప్టెంబర్ లో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేస్తుందని ప్రతి నియోజకవర్గంలో ప్రజల అవస్థలు గుర్తెరిగి రానున్న రోజుల్లో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజల మద్దతు కోరుతున్నట్లు గుర్తు చేశారు.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అనేక ప్రాజెక్టులు తెచ్చామని చెరువులకు నీళ్లు , ప్రాజెక్టులు నిర్మించడం,, తాగునీళ్లు ఇవన్నీ సమకూర్చితే వాటన్నింటిని పక్కనపెట్టి కమిషన్ల కోసం కక్కుర్తి పడి భూములు లాక్కోవడం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్యాకేజీ తెచ్చి అనంతపురం, కడప ,కర్నూలు, చిత్తూరు జిల్లాలో టమోటా రైతుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు అనంతను అమలు చేయాలని డిమాండ్ చేశారు . ప్రజల ఆస్తులు ప్రాణ రక్షణ ఇవ్వకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు హితువు పలికారు .
మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి సీనియర్ నాయకులు బాల నరేంద్రబాబు, రాయపాటి అశోక్ , జియావుద్దీన్ ,బోయ నాగరాజు ,రిటైర్డ్ ఎమ్మార్వో తిమ్మప్ప ఉద్ధిప్ సింగ్, ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు.