సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘దర్జా’. జూలై 22న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం.. ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకుంది. భారీ వర్షాల కారణంగా కాస్త ఓపెనింగ్స్ తగ్గినప్పటికీ.. సినిమాకి వస్తున్న టాక్‌తో ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతుందని నిర్మాతలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మా పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో జూలై 22న విడుదలైన ‘దర్జా’ చిత్రం మొదటి ఆట నుండి పాజిటివ్ టాక్‌తో రన్ అవుతుంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సినిమాలోని పాటలు, ఫైట్స్, సెంటిమెంట్.. చాలా బాగున్నాయంటూ పలువురు సినీ ప్రముఖులు మాకు ఫోన్ చేసి అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే చాలా మంది ఇది యాక్షన్ సినిమా అనుకుని వచ్చాము.. కానీ సినిమాలో అక్కాచెల్లెళ్ల అనుబంధం, అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని చాలా చక్కగా చూపించారని, ముఖ్యంగా సెంటిమెంట్ సీన్లు చాలా బాగున్నాయని ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందనకు మా టీమంతా చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి ఈ సినిమాని మరింతగా సక్సెస్ చేయాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా ఆదరించిన ప్రేక్షకులు, చిత్రంలో నటించిన నటీనటులు-సాంకేతిక నిపుణులకు, సహకరించిన వారందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు. కాగా, కామినేని శ్రీనివాస్ సమర్పణలో.. పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివశంకర్ పైడిపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి వ్యవహరించారు.