అఫ్సర్ ఆజాద్ ! తెలుగు సినివినిలాకాశంలో సూపరిచితమైన పెరది. ఆర్టిస్ట్ గా, విలన్ గా, దాదాపు అరవై సినిమాలలో నటించిన ఆజాద్ , నటుడిగానే కాకుండా సమాజ సేవలో ముందుండి సెబాష్ అనిపించుకున్నారు. కరోనా కష్టకాలంలో ఎంతోమందికి మెడిసిన్స్, ఆహారం, అందించి ఆదుకుని మరో సోనూసూద్ అనిపించుకున్నారు.ఆజాద్ ఫౌండేషన్ ను స్థాపించి పేద వృద్ధులకు, నిత్యం ఆర్ధిక సహాయం అందిస్తూనే వున్నారు. అటువంటి ఉన్నత మనస్తత్వం ఉన్న ఆజాద్ రీసెంట్ గా టాలెంట్ ఉన్న అరవై మంది కళాకారులను గుర్తించి వారిని సన్మానించడం విశేషం.అటువంటి మంచి మనసున్న నటుడి పుట్టినరోజు జూన్ 5. కావున ఆజాద్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని ,మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అతని మనసేరిగిన సాటి కళాకారులు కోరుకోవడం విశేషం.