• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

సంక్షేమానికి బ్రాండ్‌ ఆంబాసిడర్‌ జగన్‌ – మంత్రి అమర్‌నాథ్‌

admin by admin
June 16, 2022
in politics
0 0
0
సంక్షేమానికి బ్రాండ్‌ ఆంబాసిడర్‌ జగన్‌ – మంత్రి అమర్‌నాథ్‌
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే 90శాతానికి పైగా హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. విశాఖ నగరం లోని తూర్పు నియోజకవర్గం పరిధిలోని వివిధ వార్డులకు చెందిన లబ్ధి దారులకు ఇళ్ల పట్టాలను
ఆయన అందచేశారు. స్థానిక ఎ.ఎస్. రాజా గ్రౌండ్స్ లో గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన అమర్‌ నాథ్ మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ఆరోగ్యశ్రీ వంటి అద్భుత పథకాలను అమలు చేశారని, జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అమ్మ ఒడి, రైతు భరోసా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటు న్నారని మంత్రి అమర్ చెప్పారు. సంక్షేమం పేరు చెపితే రాజశేఖర్ రెడ్డి, జగన్ గుర్తుకు వస్తారని ఆయన
అన్నారు .దేశంలో నే మరెక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశలో 32 లక్షల మందికి సొంత ఇళ్లు మంజురు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇటువంటి వంటి ఘనత దక్కలేదని ఆయన చెప్పారు. లబ్ధిదారులకు ఎక్కడో మారుముల ప్రాంతాల్లో ఇళ్ల స్థలను కేటాయించలేదని, జాతీయ రహదారులు, నగర పరిధిలోన్ను ప్రాంతాల్లోనే స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణానికి నిదులు కేటాయించారని మంత్రి అమర్ వెల్లడించారు.ఇటు వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు జగన్ ఒక పక్క చేపడుతుంటే, ప్రతి పక్ష నేత చంద్ర బాబు కోర్టులకు వెళ్లి పధకాలు అమలు కాకుండా అడ్డుకుంటున్నారని మంత్రి అమర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్ర చెప్పుకోదగ్గ ఒక్క సంక్షేమ పథకాన్నిఅమలు చేయలేకపోయారని, ఒక్కపథకం పేరు చెప్పినా ఆయన కాళ్ళ కింద నుంచి దూరి వెళతానని అమర్ నాథ్ సవాలు విసిరారు. జనంలో విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుచుకుంటామని చెప్పడం ఆయన తెలివి తక్కువతనానికి నిదర్శనమని అమర్ అన్నారు. జగన్ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటే వచ్చే ఎన్నికల్లో మూడుసీట్లు కూడా రావని ఆయన అన్నారు. జగన్ రాష్ట్రలోని మహిళలకు బీసీ, ఎస్టీ, ఎస్సీలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని చంద్రబాబు హాయంలో ఈ వర్గాలకు కనీస ప్రాధాన్యత లేకుండా పోయిందన్నారు. జగన్‌ను టీడీపీ నాయకులు అయ్యన్నపాత్రుడు, అనిత తదితరులు తీవ్రంగా పరుష పదజాలంతో విమర్శిస్తుంటే చంద్రబాబు చప్పట్లు కోట్టడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని అమర్‌ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ని రెండోసారి ముఖ్యమంత్రిని చేయడానికి తాను ఒక సామన్యకార్యకర్తగా ఎక్కడికైనా వచ్చి పనిచేస్తానని అమర్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌, నగర మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, తూర్పు నియోజకవర్గానికి చెందిన కార్పోరేటర్లు, కార్పోరేషన్‌ చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే మంత్రి అమర్‌ పలువురి లభ్డిదారులకు తన చేతుల మీదుగా పట్టాలను పంపిణీ చేశారు.

Previous Post

విరాటపర్వంలో కత్తెర పర్వం వర్క్ అవుట్ అవుతుందా…?!!!

Next Post

‘పోయే ఏనుగు పోయే’ ట్రైలర్ విడుదల

Next Post

'పోయే ఏనుగు పోయే' ట్రైలర్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

సన్ ఆఫ్ మూవీ రివ్యూ: కట్టిపడేసే తండ్రీకొడుకుల బంధం
movies

సన్ ఆఫ్ మూవీ రివ్యూ: కట్టిపడేసే తండ్రీకొడుకుల బంధం

by admin
February 28, 2026
0

...

Read more
పేలుడులో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం- సీఎం చంద్రబాబు

పేలుడులో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం- సీఎం చంద్రబాబు

February 28, 2026
హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

February 28, 2026
యూత్‌ఫుల్ లవ్ డ్రామాతో  హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై ప్రెస్టేజీయస్  ప్రాజెక్ట్ ప్రారంభం

యూత్‌ఫుల్ లవ్ డ్రామాతో హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై ప్రెస్టేజీయస్ ప్రాజెక్ట్ ప్రారంభం

February 28, 2026
హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

February 28, 2026
రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

February 28, 2026
KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు..100 కోట్ల డాల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌

KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు..100 కోట్ల డాల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌

February 28, 2026
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్

February 28, 2026
సుహాసిని, వినోద్ కుమార్ ఆవిష్కరించిన ‘ఓ మాట అనుకుందామా!’ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్!

సుహాసిని, వినోద్ కుమార్ ఆవిష్కరించిన ‘ఓ మాట అనుకుందామా!’ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్!

February 27, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In