• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

admin by admin
February 28, 2026
in movies, politics
0 0
0
రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ తన ఆర్కే ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం మహిళా కబడ్డీ. ఈ చిత్రంలో ఇండియన్ వుమెన్స్ కబడ్డీ టీమ్ వైస్ కెప్టెన్ పూజ నర్వాల్, ఇండియన్ కబడ్డీ టీమ్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి, హీరో సుమన్, అక్సాఖాన్, తులసి తో పాటు ఏడుగురు రియల్ కబడ్డీ ప్లేయర్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు . ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఈ చిత్ర వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ ఇండియన్ వుమెన్స్ కబడ్డీ టీమ్ ప్లేయర్ పూజ నర్వాల్, ఇండియన్ కబడ్డీ టీమ్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి, హీరో సుమన్, అక్సాఖాన్, తులసి, దర్శక నిర్మాత డా, ఆర్కే గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా

ఇండియన్ కబడ్డీ టీమ్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ – పూజ నర్వాల్ వుమెన్ కబడ్డీ వరల్డ్ కప్ లో గోల్డ్ మెడలిస్ట్. నేను మన టీమ్ కు కోచ్ గా ఉన్నాను. ప్రో కబడ్డీ లీగ్ కు కోచ్ గా పనిచేశాను. త్వరలో వుమెన్ ప్రో కబడ్డీ లీగ్ కూడా రాబోతోంది. “మహిళా కబడ్డీ” సినిమా కోసం ఆర్కే గౌడ్ గారు నన్ను అప్రోచ్ అయ్యారు. మేమిద్దరం ఈ చిత్రం లో నటిస్తున్నాము. నాకు తెలిసిన విషయాలు ఆయనతో షేర్ చేసుకున్నాను. అలాగే ఇది మహిళల కబడ్డీ మూవీ కాబట్టి పూజ నర్వాల్ ను సంప్రదించి ఆమెతో ఈ కార్యక్రమంలో మాట్లాడిస్తే బాగుంటుందని అనుకున్నాం. క్రికెట్ తర్వాత కబడ్డీకే ఎక్కువ ఆదరణ ఉంది. క్రికెట్ లో మహిళల జట్టు ఎలా రాణిస్తున్నారో కబడ్డీలోనూ అలాగే ప్రతిభ చాటుతున్నారు అన్నారు.

ఇండియన్ వుమెన్స్ కబడ్డీ టీమ్ ప్లేయర్ పూజ నర్వాల్ మాట్లాడుతూ – చిన్నప్పటి నుంచే నాకు కబడ్డీ ఆట మీద చాలా ఆసక్తి ఉండేది. జిల్లా, రాష్ట్ర స్థాయిలో మెడల్స్ గెల్చుకున్న తర్వాత ఇప్పుడు నేషనల్, ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఎదిగాను. వుమెన్ కబడ్డీకి ఎంతో భవిష్యత్ ఉంది. మహిళలకు ప్రో కబడ్డీ లీగ్ కూడా ప్రారంభం కాబోతోంది. కబడ్డీని ప్రొఫెషనల్ గా ఎంచుకునే అమ్మాయిలకు మంచి భవిష్యత్ ఉంటుంది. ఇలాంటి టైమ్ లో “మహిళా కబడ్డీ” అనే సినిమాను ఆర్కే గౌడ్ గారు రూపొందిస్తుండటం ఇందులో నేను కూడా నటించడం సంతోషంగా ఉంది అన్నారు.

దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – నేను కూడా కబడ్డీ ప్లేయర్ ను. కబడ్డీ పోటీల్లో మా టీమ్ తరుపున ఛాంపియన్ షిప్ గెల్చుకున్నాం. అప్పుడు కబడ్డీ ప్లేయర్ గా జిల్లా స్థాయి వరకు వచ్చాను. మన దేశంలో క్రికెట్ తర్వాత కబడ్డీకి చాలా ఆదరణ దక్కుతోంది. గత రెండేళ్లుగా మన వాళ్లే ఛాంపియన్ షిప్ గెల్చుకున్నారు. మహిళల కబడ్డీలో పూజ నర్వా లాంటి ఎంతోమంది క్రీడాకారిణిలు ప్రతిభ చాటుతుండటం సంతోషంగా ఉంది. నేను మహిళా కబడ్డీ మూవీ కోసం వీళ్లను అప్రోచ్ అయ్యాను. కోచ్ శ్రీనివాసరెడ్డి ద్వారా పూజ గారిని సంప్రదించాం. వాళ్లిద్దరూ మా మూవీలో నటించడానికి అంగీకరించడం,ప్రెస్ మీట్ కు రావడం హ్యాపీగా ఉంది. పల్లెటూరి నుంచి వచ్చిన ఒక పేద అమ్మాయి కబడ్డీ ఆటలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా పేరు తెచ్చుకుంది, ఆ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంది అనే కథాంశంతో “మహిళా కబడ్డీ” చిత్రాన్ని రూపొందిస్తున్నాను. రియల్ కబడ్డీ ప్లేయర్స్ మా మూవీలో నటించబోతున్నారు. కోచ్ గా శ్రీనివాస రెడ్డి గారు నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషలలో రూపొందించే ఈ సినిమాలో అక్సాఖాన్ తో మరో హీరో హీరోయిన్ ని కూడా సెలెక్ట్ చేశాను. వీరితో పాటు సుమన్ గారు, ఆమని, ఇంద్రజ నటిస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది. సాంగ్స్ రికార్డింగ్ చేశాం. మంగ్లీ, మధు ప్రియ ఈ సాంగ్స్ పాడారు. స్క్రిప్ట్, పాటలు బాగా వచ్చాయి. త్వరలోనే మా చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తాం అన్నారు.

హీరో సుమన్ మాట్లాడుతూ – తెలుగులో వస్తున్న మంచి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ ఇది. ఈ చిత్రంలో కూతురిని కబడ్డీ ప్లేయర్ గా ఉన్నతస్థాయికి తీసుకెళ్లే తండ్రి పాత్రలో నటిస్తున్నాను. నా స్నేహితుడు ఆర్కే గౌడ్ మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు. పల్లెటూరి పేద ఫ్యామిలీ అమ్మాయి కబడ్డీలో దేశం గర్వించేలా ఎంత కష్టపడి ఎదిగింది అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. నిజంగా కబడ్డీ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ ఈ సినిమాను ఆర్కే గౌడ్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకోవాలి అన్నారు.

నటి అక్సాఖాన్ మాట్లాడుతూ – “మహిళా కబడ్డీ” చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో కబడ్డీ ప్లేయర్ గా నటిస్తున్నాను. ఈ చిత్రంతో నటిగా నాకు మంచి గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నాను. సుమన్ గారు, మరికొందరు సీనియర్ యాక్టర్స్, మరియు రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో కలిసి ఈ సినిమాలో నటించబోతున్నాను. కబ్డడీ ప్లేయర్స్ కావాలనుకునే అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చేలా ఈ సినిమా ఉంటుంది అన్నారు.

కబడ్డీ ప్లేయర్ రాధిక రెడ్డి మాట్లాడుతూ – 1997లో ఉమ్మడి ఏపీకి నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించాను. ఇప్పటిదాకా అదొక్కసారే మనకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఈ సినిమా కింద స్థాయి నుంచి కబడ్డీలో ఎదిగేందుకు ప్రయత్నించే అమ్మాయిలకు ఇన్సిపిరేషన్ కావాలి. త్వరలో రాబోతున్న మహిళా కబడ్డీ ప్రో లీగ్ కూడా సక్సెస్ కావాలి అన్నారు.

నటి తులసి మాట్లాడుతూ.. మహిళా కబడ్డీ చిత్రంలో నేను కూడా మంచి పాత్రలో నటిస్తున్నాను. ఈ ఆకాశం ఇచ్చిన ఆర్కే గౌడ్ గారికి కృతజ్ఞతలు అన్నారు.

Previous Post

KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు..100 కోట్ల డాల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌

Next Post

హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

Next Post
హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

సినిమా రివ్యూ: జయహో రామానుజ — భక్తి, సమానత్వ భావనల అద్భుత దృశ్య కావ్యం
movies

సినిమా రివ్యూ: జయహో రామానుజ — భక్తి, సమానత్వ భావనల అద్భుత దృశ్య కావ్యం

by admin
October 24, 2026
0

...

Read more
ఘనంగా “జయహో రామానుజ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

October 22, 2026
ఆసక్తికరంగా “జయహో రామానుజ” సినిమా ట్రైలర్

ఆసక్తికరంగా “జయహో రామానుజ” సినిమా ట్రైలర్

October 15, 2026
హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

October 10, 2026
ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

October 10, 2026
అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

October 3, 2026
సీనియర్ దర్శకుడు  బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

సీనియర్ దర్శకుడు బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

October 3, 2026
‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

October 2, 2026
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In