• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

‘న‌ల్ల‌మ‌ల’ ట్రైల‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. సినిమా పెద్ద స‌క్సెస్ కావాలని కోరుకుంటున్నాను – ప్రముఖ నిర్మాత దిల్ రాజు

admin by admin
February 14, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

◆ న‌ల్ల‌మ‌ల ట్రైల‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. ◆ సినిమా పెద్ద స‌క్సెస్ కావాలని కోరుకుంటున్నాను – ప్రముఖ నిర్మాత దిల్ రాజు

అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం న‌ల్ల‌మ‌ల‌. ఈ చిత్రం ద్వారా రవి చరణ్ ‌దర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆర్‌.ఎమ్‌ నిర్మిస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ముఖ్య అతిథిగా పాల్గొని న‌ల్ల‌మ‌ల ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు..

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘అందరూ కొత్త వాళ్లు కలిసి ఇలా కొత్త సినిమాలు తీస్తున్నారు. మామూలుగానే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువ. ఇలా కొత్త వాళ్లంతా కలిసి వస్తుంటే మరింత తక్కువగా ఉంటుంది. ఎంత మంది సక్సెస్ అవుతున్నారో గమనించి సినిమాలు తీయండని నా వద్దకు వచ్చే వారికి చెబుతాను. కొత్తగా చేసే వాళ్లని ప్రోత్సహించాలని నాకు ఉంటుంది. అలా నన్ను ఒకరు ప్రోత్సహిస్తేనే ఇక్కడి వరకు వచ్చాను. ఈ మూవీ డైరెక్టర్ రవి చరణ్ నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. ఒకసారి కలవాలని మెసెజ్‌లు చేస్తూ వచ్చాడు. ఏదో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటే తప్ప నాకు టీజర్, ట్రైలర్ ఈవెంట్లకు రావాలనిపించదు. నల్లమల అని చెప్పగానే.. ఏమున్నవే పిల్లా అనే సాంగ్ గుర్తొచ్చింది. ఈ సాంగ్ అంత పెద్ద హిట్ అయిందంటే సినిమాలో, దర్శకుడిలో ఏదో ఉందని అర్థమైంది. అపాయింట్మెంట్ ఇచ్చాను. పార్క్ హయాత్‌లో ఈవెంట్ అని చెప్పారు. అక్కడ ఎందుకు?..అని అడిగాను మీరు వ‌స్తున్నారు క‌దా సార్ అందుకే అక్క‌డ అనుకుంటున్నాం.. అన్నారు. నేను ఎక్కడ ఈవెంట్ పెట్టినా నేను వస్తాను..నిర్మాత‌కు ఖ‌ర్చు త‌గ్గించ‌మ‌ని చెప్పాను. నేను చెప్పినందుకు రవిచరణ్ ఇలా ఈవెంట్‌ ప్లాన్ మార్చినందుకు థ్యాంక్స్. సినిమాలో విషయం ఉంటే ఈవెంట్ ఎక్కడ చేసినా చూస్తారు. కొత్త వాళ్లంతా కలిసి చేస్తున్న ఈ సినిమా పెద్ద స‌క్సెస్‌ అవ్వాలి..టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌’ అని అన్నారు.

ద‌ర్శ‌కుడు రవి చరణ్ మాట్లాడుతూ.. ‘నిర్మాత దూరంగా ఉన్నా కూడా నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. పాట విడుదలైన రోజు నుంచి ప్రతీ ఒక్కరూ మెచ్చుకున్నారు. మొదటగా త్రివిక్రమ్ గారి వద్దకు మా హీరో తీసుకెళ్లారు. పాట బాగుంది.. సినిమా బాగా తీయండని అన్నారు. ఆ తరువాత నాజర్ గారు మెచ్చుకున్నారు. టీజర్ ఈవెంట్‌కు దేవాకట్టా వచ్చారు. సినిమా బాగా తీశావని రాఘవేంద్రరావు గారు కూడా అన్నారు. సినిమా విడుదలకంటే ముందే ఇలాంటి ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. నాకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఇంత మంచి కంటెంట్‌కు ఓ పెద్ద వ్యక్తి ఉండాలని అనుకున్నాను. దిల్ రాజు గారిని కలిశాను. ఈవెంట్‌కు వచ్చేందుకు ఒప్పుకున్నారు. నేను ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ముందు నుంచి కూడా మీడియా మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే వచ్చారు. మా టీం అంతా కూడా మాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచింది’ అని అన్నారు.

అమిత్ తివారి మాట్లాడుతూ.. ‘నాకు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. మూడేళ్లు కష్టపడ్డాం. ఈ రోజు ట్రైలర్ విడుదలైంది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. దిల్ రాజు గారు ఇక్కడకు వచ్చినందుకు థ్యాంక్స్. ఆయన బ్యానర్లో కారెక్టర్ ఆర్టిస్ట్‌గా పని చేశాను. ఈ రోజు నేను హీరోగా రాబోతోన్న సినిమాకు ఆయన గెస్ట్‌గా వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. నల్లమల సినిమాకు హీరో కథ. ఇంత మంచి కథను రాసి నాకు హీరోగా కారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ రవి చరణ్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. తెలుగు ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

భాను శ్రీ మాట్లాడుతూ.. ‘పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతీ విషయంలో మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే వచ్చారు. నన్ను నమ్మి ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడికి థ్యాంక్స్. మా టీంలో చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ఆ పాటను విన్నప్పుడే చెప్పుడే ఎక్కడికో వెళ్తుందని అన్నాను. అనుకున్నట్టే జరిగింది. మా సినిమాను అందరూ థియేటర్లో చూడండి. మా సినిమాను చాలా పెద్ద వ్యక్తులు సపోర్ట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. దిల్ రాజు గారికి థ్యాంక్స్’ అని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ పాల్గొని ప్ర‌సంగించారు.

నటీన‌టులు: అమిత్ తివారి, భానుశ్రీ‌, నాజ‌ర్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, అజ‌య్ ఘోష్‌, కాశీ విశ్వ‌నాథ్‌, కాల‌కేయ ప్ర‌భాక‌ర్‌, ఛలాకీ చంటి, శుభోద‌యం రాజ‌శేఖ‌ర్‌, చ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, ముక్కు అవినాష్‌, శేఖ‌ర్ అలీ, అరోహి నాయుడు, అసిరి శ్రీ‌ను

సాంకేతికంగానూ హై స్టాండర్డ్స్ లో నిలిచే ఈ మూవీకి
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవి చరణ్
నిర్మాత: ఆర్.ఎమ్
సినిమాటోగ్రఫీ: వేణు మురళి
సంగీతం, పాటలు: పి.ఆర్
ఎడిటర్: శివ సర్వాణి
ఆర్ట్: పీవీ రాజు
ఫైట్స్: నబా
స్టైలిస్ట్‌: శోభ ర‌విచ‌ర‌ణ్‌
విఎఫ్ఎక్స్: విజయ్ రాజ్
పిఆర్ఓ – శ్రీ‌ను – సిద్ధు

Previous Post

నిర్మాతలు మరింతగా ఆదాయం ఆర్జించేలా Oracle Movies NFT: COO విజయ్ డింగరి

Next Post

‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ ఫస్ట్ లుక్ విడుదల..

Next Post

'ప్రభుత్వ జూనియర్ కళాశాల' ఫస్ట్ లుక్ విడుదల..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”
movies

పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

by admin
September 4, 2026
0

...

Read more
Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

September 4, 2026
అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

September 4, 2026
మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

September 3, 2026
ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

September 3, 2026
ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

September 1, 2026
‘ధర్మస్థల నియోజకవర్గం’ “ఆది” అంత గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

‘ధర్మస్థల నియోజకవర్గం’ “ఆది” అంత గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

August 31, 2026
మిస్సింగ్ మేఘన 2nd  లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

మిస్సింగ్ మేఘన 2nd లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

August 30, 2026
యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

August 29, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In