• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఫన్ అండ్ యాక్షన్ స్పై థ్రిల్లర్… జాక్

admin by admin
April 10, 2025
in movies
0 0
0
ఫన్ అండ్ యాక్షన్ స్పై థ్రిల్లర్… జాక్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా అనగానే ఏదో ఒక ఆకట్టకునే పాయింట్ వుంటుంది. బొమ్మరిల్లు సినిమాలోనైనా.. ఆ తరువాత వచ్చిన ఆరెంజ్ సినిమాలోనైనా ఏదో ఒక ట్రిగ్గర్ పాయింట్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. అంతెందుకు మొన్న వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లో కూడా ఓ సున్నితమైన అంశాన్ని టచ్ చేశారు. ఇప్పుడు జాక్ తో మన ముందుకు వచ్చారు. ఇందులో స్టార్ బోయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరో. సిద్ధూ సినిమాలంటేనే యూత్ ను మెప్పించే అంశాలే ఎక్కువగా ఫన్నీ వేలో వుంటాయి. మరి వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలావుందో తెలుసుకుందాం పదండి.

కథ: పాబ్లో నెరోడా అలియాస్ జాక్(సిద్ధూ జొన్నలగడ్డ) ఏం చేయకుండా తిరుగుతూ ఉంటాడు. అతను ఏం చేస్తున్నాడు అని తండ్రి ప్రసాద్(సీనియర్ నటుడు నరేష్) ఒక డిటెక్టివ్ ఏజెన్సీకి డబ్బులు ఇచ్చి కనిపెట్టమంటాడు. దీంతో ఆ డిటెక్టివ్ ఏజెన్సీ ఓనర్ కూతురు అఫ్జానా(వైష్ణవి చైతన్య) తన టీంతో జాక్ వెనక తిరుగుతూ ఉంటుంది. జాక్ ని ట్రాప్ చేసి ఏం చేస్తున్నాడో కనుక్కోవాలనుకుంటుంది. జాక్ రా ఏజెంట్ గా జాబ్ చేయాలనుకుంటాడు. రా ఇంటర్వ్యూకి కూడా వెళ్తాడు. అతనికి ఇంకా జాబ్ రిజల్ట్ రాకపోవడంతో తనే ఒక రా ఏజెంట్ లా ఫీల్ అయి ఒక ఉగ్రవాద చర్యను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఒక టెర్రరిస్ట్ తో పాటు అనుకోకుండా రా ఆఫీసర్ మనోజ్(ప్రకాష్ రాజ్)ని కిడ్నాప్ చేస్తాడు. ఇవేమీ తెలియని అఫ్జానా అనుకోకుండా ఆ టెర్రరిస్ట్ ని తప్పిస్తుంది. దీంతో రా ఆఫీసర్స్ జాక్ ని పట్టుకుంటారు. అసలు జాక్ ఎందుకు రా ఆఫీసర్ అవ్వాలి అనుకుంటాడు? ఉగ్రవాదులు ఏం చేయబోతున్నారు? రా ఆఫీసర్ మనోజ్ ఎవర్ని పట్టుకోవాలని ట్రై చేస్తాడు? అఫ్జానా జాక్ ఏం చేస్తాడో కనిపెట్టిందా? ప్రసాద్ కి తన కొడుకు ఏం చేస్తున్నాడో తెలుస్తుందా? జాక్ ఉగ్రవాద చర్యని కనుక్కుంటాడా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ.. సిద్ధూ జొన్నలగడ్డ సినిమాలు అంటే కామెడీతో పక్కా హైదరాబాదీ స్టైల్ లో ఉంటాయని తెలిసిందే. ఈ జాక్ కూడా హైదరాబాదీ స్టైల్ లో సిద్ధూ మార్క్ తోనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో సిద్ధూ ఫుల్ గానే నవ్విస్తాడు. టెర్రరిస్ట్ లని తనే సొంతంగా పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు సస్పెన్స్ అనిపిస్తునే నవ్విస్తాయి కూడా. సెకండ్ హాఫ్ లో అసలు మెయిన్ టెర్రరిస్ట్ ని పట్టుకోడానికి జాక్, రా ఆఫీసర్స్ చేసే ప్రయత్నాలు కాస్త సీరియస్ గా కామెడీగానే సాగుతాయి.

అయితే రా అనే ఒక గొప్ప సంస్థని, అందులో పని చేసే ఆఫీసర్స్ ని జాక్ సినిమాలో సినిమాటిక్ లిబర్టీతో ప్రేక్షకులను నవ్వించడానికి కాస్త కామెడీని జొప్పించి చూపించారు దర్శకుడు. రా వాళ్ళు ఏం చేయలేరు, అంతా హీరోనే చేయగలడు అని ఓ సినిమాటిక్ లిబర్టీలో చూపించడం కాస్త ఫన్నీగా అనిపించినా… ఎంటర్టైనింగ్ గా వుంటుంది. మామూలుగానే సిద్ధూ సినిమాలు హైదరాబాద్ హిందీ మిక్స్ అయి ఉండి నవ్విస్తాయి. ఇందులో కూడా హిందీ భాషలోని డైలాగులతో, హీరోయిన్ కూడా ముస్లిం పాత్ర కావడంతో ఆమెతో హిందీ డైలాగులతో చేసే కామెడీ అంతా మాస్, క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమాని ఒక స్పై థ్రిల్లర్ లా సీరియస్ గా తీయొచ్చు. కానీ సిద్ధూ తన స్టైల్ మిస్ అవ్వకూడదు అని కామెడీని జోడించాడు. ఇందులోని ట్విస్ట్ లు బాగా మెప్పిస్తాయి. సినిమాలో అమ్మ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఒక రెగ్యులర్ స్పై సినిమాని కామెడీగా చూపించే ప్రయత్నం చేసారు. బొమ్మరిల్లు భాస్కర్ మార్క్ కు… సిద్ధూ జొన్నలగడ్డ మార్క్ కూడా తోడు కావడంతో మోర్ ఎంటర్టైనింగ్ గా ఆకట్టుకుంటుంది.
సిద్దు తన రెగ్యులర్ టిల్లు స్టైల్ లోనే ఈ సినిమాలో కూడా మెప్పించాడు. వైష్ణవి చైతన్య డిటెక్టివ్ పాత్రలో ఆకట్టుకుంటుంది. ప్రకాష్ రాజ్ సీరియస్ రా ఆఫీసర్ పాత్రలో బాగా మెప్పించారు. సీనియర్ నరేష్ కూడా యూట్యూబర్ గా కాసేపు నవ్విస్తారు. బ్రహ్మాజి పాత్ర కూడా కాసేపు ఆకట్టుకుంటాడు. నెగిటివ్ రోల్ లో రాహుల్ దేవ్ కాసేపు కనిపించి పర్వాలేదనిపించారు. బిగ్ బాస్ అలీ నెగిటివ్ పాత్రలో మెప్పించాడు. నటుడు రవి ప్రకాష్ తదితర నటీనటులు వారి వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ లు కూడా బాగున్నాయి. చాలా వరకు రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేసారు. నెపాల్, ఓల్డ్ సిటీ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకుంటుంది. సినిమాకి నేపథ్య సంగీతం బాగా ప్లస్ అయింది. సినిమా నిడివి కూడా పర్ ఫెక్ట్ గా సెట్ అయింది. ఎక్కడా బోరింగ్ లేకుండా వుంది. బొమ్మరిల్లు భాస్కర్ కథ, డైరెక్షన్ అతని స్టైల్ కి భిన్నంగా తెరకెక్కిన ఈచిత్రాన్ని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. మస్ట్ వాచ్ మూవీ.
రేటింగ్: 3

Previous Post

అశ్విన్ బాబు హీరోగా ‘వచ్చిన వాడు గౌతమ్’ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ విడుదల

Next Post

వైభవోపేతంగా జరిగిన ఫిలిం ఫైనాన్సర్ బంగారు బాబు కుమారుడి వివాహ మహోత్సవం

Next Post
వైభవోపేతంగా జరిగిన ఫిలిం ఫైనాన్సర్ బంగారు బాబు కుమారుడి వివాహ మహోత్సవం

వైభవోపేతంగా జరిగిన ఫిలిం ఫైనాన్సర్ బంగారు బాబు కుమారుడి వివాహ మహోత్సవం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్
movies

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

by admin
July 24, 2026
0

...

Read more
నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

July 21, 2026
‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

July 10, 2026
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

July 6, 2026
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

July 4, 2026
రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

June 19, 2026
హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

June 13, 2026
‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

June 12, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

June 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In