• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

శివంగి… ఇది ఒక ఆడపులి కథ

admin by admin
March 7, 2025
in movies, reviews
0 0
0
శివంగి… ఇది ఒక ఆడపులి కథ
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘వంగే వాళ్లు వుంటే… మింగే వాళ్లు వుంటారు… నేను వంగే రకం కాదు… మింగే రకం…’ అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఈ డైలాగ్ విపరీతంగా వైరల్ అయింది. అంతగా ఆ డైలాగ్ వైరల్ కాడానికి కారణం… ఎప్పుడూ హోమ్లీగా కనిపించే ఆనంది అంత వైల్డ్ గా చెప్పడమే కారణం. దాంతో శివంగి సినిమా టీజర్, ట్రైలర్ లు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాయి. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి దర్శకత్వం దేవరాజ్ భరణి ధరన్ వహించారు. ఫస్ట్ కాపీ మూవీస్ పతాకంపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మించారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించారు. ఇతర పాత్రల్లో జాన్ విజయ్, కోయ కిశోర్ తదితరులు నటించారు. సింగిల్ లోకేషన్ లో రిచ్ నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే థియేటర్లలో సందడి చేయడానికి వచ్చింది. మరి ఈ శివంగి ఎలా మెప్పించిందో తెలుసుకుందాం రండి.

కథ: ఆనంది… ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయిగా… చాలా పద్ధతిగా కనిపించే సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అలాంటి అమ్మాయి ఒక్కసారిగా ఓ బోల్డ్ డైలాగ్ ను సత్యభామ పాత్రలో చెప్పడంతో ఇండస్ట్రీ అటెన్షన్ అంతా గ్రాబ్ చేసుకుంది. ఈరోజు విడుదలైన శివంగి చిత్రంలో ఆనంది పోషించిన సత్యభామ పాత్ర చుట్టూ ఎన్నో సమస్యలు… వాటిని ఛేదించుకునే క్రమంలో ఎన్నో ఆటంకాలు. వాటన్నింటినీ చివరకు ఎలా అధిగమించి శివంగిలా పోరాడిందనేది నేటీ మహిళాలోకానికి ఆదర్శంగా వుండేలా రూపొందించారు దర్శక, నిర్మాతలు. ఓ వైపు భర్త అనారోగ్య పరిస్థితులు… మరో వైపు ఆర్థిక సమస్యలు సత్యభామ(ఆనంది)ను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దానికి తోడు తన అత్త నుంచి ఎదురయ్యే వేధింపులు తనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తాయి. మరోవైపు తల్లిదండ్రులు అనుకోకుండా వరదల్లో చిక్కుకు పోవడంతో మరింత సతమతమవుతుంది సత్యభామ దాంతో ఆమె పోలీసులను ఆశ్రయిస్తుంది. సత్యభామ పోలీసులను ఆశ్రయించడానికి గల కారణాలు ఏమిటి? ఎవరైనా హత్యకు గానీ, ఆత్మహత్యకు గానీ గురయ్యారా? సత్యభామ తనకు ఎదురైన హార్డిల్స్ ను ఎలా అధిగమించిందనేది తెలియాలంటే మూవీని ఓసారి చూడాల్సిందే.

సినిమా కథ… కథనం విశ్లేషణ:
సత్యభామగా చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆనంది నటన మనం గతంలోనే ఎన్నో చిత్రాలలో చూశాము. అదేవిధంగా ఈ చిత్రంలో కూడా తనదైన మార్క్ సృష్టిస్తూ ఆనంది తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. చిత్రం అంతా తానే కనిపిస్తూ ప్రేక్షకులు ఎక్కడా బోర్ కొట్టకుండా తనదైన శైలిలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఎక్కడా గ్లామర్ షో లేకుండా… కేవలం రెండు చీరలలో మాత్రమే సినిమా అంతా కనిపిస్తూ… తన పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పోలీస్ రోల్ లో గతంలో ఎన్నో చిత్రాలలో నటించినప్పటికీ, ఈ చిత్రంలో తెలంగాణ యాసతో వరలక్ష్మి శరత్ కుమార్ తనలో మరో యాంగిల్ యాక్టింగ్ స్టైల్ ఉందని నిరూపించుకున్నారు. అదేవిధంగా చిత్రంలో నటించిన జాన్ విజయ్, కోయా కిషోర్ స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ తమ మార్క్ కనిపించేలా నటించి మెప్పించారు.

దేవరాజ్ భరణి ధరన్ రచన ఇంకా దర్శకత్వంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడు అనేది మీ చిత్రం చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. స్క్రీన్ మీద ఎక్కువగా ఒకటే వ్యక్తి కనిపిస్తున్నప్పుడు ఆడియన్స్ సాధారణంగా బోర్ ఫీల్ అవుతారు. కానీ ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఎక్కడా కూడా బోర్ ఫీల్ అయ్యే అవసరం రాదు. ఎంతో ఇంటెన్సిఫైడ్ గా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. అసలు జరిగేది నిజమా కాదా అనే ఒక డౌట్ తో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా చూసే విధంగా స్క్రీన్ ప్లే వచ్చేలా రాసుకున్నాడు దర్శకుడు. సింగిల్ లోకేషన్ లో… క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. సినిమా మొత్తం సింగిల్ లొకేషన్ లో చిత్రీకరణ చేసినప్పుడు ఆర్ట్ వర్క్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే బ్యాగ్రౌండ్ యాంబియన్స్ ను సెట్ చేసుకున్నాడు కళాదర్శకుడు రఘు కులకర్ణి. అలాగే ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు సంగీత దర్శకుడు. చిత్రంలో ఎక్కడ కూడా వల్గారిటీ లేదా డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా, చాలా డీసెంట్ గా కుటుంబ సమేతంగా వెళ్లి చూసే విధంగా సినిమాను తెరకెక్కించారు. ఒక మహిళకు అనేక సమస్యలు ఒకే సమయంలో వచ్చినప్పటికీ ఆమె ఆ సమస్యలను మొక్కవోని ధైర్యంతో… ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఎలా నిలబడ్డారు అనేది నేటి మహిళలకు మెసేజ్ ఇచ్చేలా సినిమా వుంది. ప్రపంచ మహిళాదినోత్సవం సందర్భంగా మహిళా ప్రేక్షకులకు మంచి ఇన్స్ పిరేషన్ ఇచ్చే సినిమా ‘శివంగి’. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కోనే అనేక సమస్యలును ఇందులో చూపించి… వాటికి పరిష్కార మార్గాలు చూపించారు. ఓ సారి చూసేయండి.
రేటింగ్ : 3.25

Tags: AnandiDirector Dharani BharanProducer Panchumarthi Naresh KumarShivangi Movie Review RatingShivangi Movie Telugu ReviewTelugu EntertainmentTelugu Movie ReviewVaralakshmi Sarathkumar
Previous Post

ఆద్యంతం ట్విస్టులతో ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే… జిగేల్

Next Post

నారి… అవలక్షణాలున్న వారిపై సమర భేరి

Next Post
నారి… అవలక్షణాలున్న వారిపై సమర భేరి

నారి... అవలక్షణాలున్న వారిపై సమర భేరి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

నవ్విస్తూ… భయపెట్టే “శుభం”
movies

నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

by admin
May 9, 2025
0

...

Read more
Review; “హిట్: ది థర్డ్ కేస్”

Review; “హిట్: ది థర్డ్ కేస్”

May 1, 2025
లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

April 29, 2025
కాశ్మీర్ మనదే కాశ్మీర్ ప్రజలు మనవాళ్లే – హీరో విజయ్ దేవరకొండ

కాశ్మీర్ మనదే కాశ్మీర్ ప్రజలు మనవాళ్లే – హీరో విజయ్ దేవరకొండ

April 27, 2025
‘తుడరుమ్’ సినిమా రివ్యూ (తెలుగు డబ్బింగ్)

‘తుడరుమ్’ సినిమా రివ్యూ (తెలుగు డబ్బింగ్)

April 27, 2025
“సారంగపాణి జాతకం” (2025) సినిమా రివ్యూ

“సారంగపాణి జాతకం” (2025) సినిమా రివ్యూ

April 25, 2025
అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు

అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు

April 23, 2025
ఏప్రిల్ 25న “శివ శంభో” చిత్రం విడుద‌ల‌

ఏప్రిల్ 25న “శివ శంభో” చిత్రం విడుద‌ల‌

April 22, 2025
a-grand-50th-birthday-celebration-elevates-telugu-communitys-presence-in-detroit

a-grand-50th-birthday-celebration-elevates-telugu-communitys-presence-in-detroit

April 20, 2025
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In