శబరిమల అయ్యప్ప ఆలయానికి వచ్చే భక్తులకు పూర్తి సమాచారం అందించే ఉద్దేశంతో పథనంతిట్ట జిల్లా అధికారులు తీసుకొచ్చిన ‘స్వామి చాట్‌బోట్’ను భక్తులు పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటున్నారు.
ఈ ఏడాది నవంబర్ 15న ఈ చాట్‌బోట్‌ను అందుబాటులోకి తేగా వేల మంది భక్తులకు ఇది సేవలందిస్తోంది. పథనంతిట్ట జిల్లా కలెక్టర్ ప్రేమ్ కృష్ణన్ నేతృత్వంలో అధికారుల బృందం దీన్ని అందుబాటులోకి తెచ్చింది.
దీన్ని అందుబాటులోకి తెచ్చిన 10 రోజుల్లోనే 75 వేల మంది భక్తులు ఉపయోగించుకున్నారు.
ప్రతి రోజూ ఈ చాట్‌బోట్‌కు 5 వేల నుంచి 10 వేల వరకు రిక్వెస్టులు వస్తున్నాయి.
భక్తులకు ఫుడ్ చార్ట్, శబరిమల ఆలయం తెరుచుకునే సమయం, మూసివేసే సమయం, కేరళ రాష్ట్ర ప్రభుత్వ బస్సుల వేళలు వంటి సమాచారం అంతా ఈ చాట్‌బోట్ నుంచి తెలుసుకోవచ్చు.
దీంతోపాటు భక్తులకు అత్యవసర పరిస్థితి ఏర్పడినా దీన్నుంచి సహాయం పొందొచ్చు. ఇప్పటివరకు ఇలా 1768 అత్యవసర కేసులను ఈ చాట్‌బోట్ ద్వారా హ్యాండిల్ చేశారు.
తప్పిపోయిన భక్తులను వారివారి కుటుంబీకుల వద్దకు చేర్చడం వంటి విషయాల్లో ఇది ఎంతగానో ఉపయోగపడింది.
6238008000 నంబర్‌కు Hi అని మెసేజ్ పంపిస్తే ఎలాంటి సహాయం కావాలి.. ఎలాంటి వివరాలు కావాలి అంటూ అటు నుంచి సందేశం వస్తుంది. దాని ఆధారంగా చాట్‌బోట్‌తో సంభాషించొచ్చు.