• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఐదు భాషలలో జనవరి 28న భారీగా థియేటర్లలో ‘ DSJ‘ (దెయ్యంతో సహజీవనం) విడుదల

admin by admin
January 2, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ప్రముఖ నిర్మాత నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం). నట్టికుమార్ దర్శకత్వం వహించారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి నట్టి లక్ష్మి సమర్పణలో నట్టి క్రాంతి ఐదు భాషల్లో నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సన్నద్ధమవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం వంటి ఐదు బాషలలో ఈ చిత్రాన్ని జనవరి 28న థియేటర్లలో భారీగా విడుదల చేయనున్నట్లు దర్శకుడు నట్టి కుమార్, నిర్మాత నట్టి క్రాంతి తెలిపారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం థియేటర్ల టిక్కెట్ల రేట్లు పెంచిన నేపథ్యంలో చిన్న సినిమాలకు తగ్గట్టుగా టిక్కెట్ల రేట్లు ఉంటేనే తన సినిమాలను తెలంగాణాలో విడుదల చేస్తానని ప్రకటించానని,. ఆ తర్వాత చిన్న సినిమాలకు అనుకూలంగా టిక్కెట్ల ధరలను నిర్ణయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ, తెలంగాణలో తన సినిమాలను విడుదల చేయబోతున్నట్లు నట్టి కుమార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా చిన్న సినిమాలకు అనుకూలంగా టిక్కెట్ల ధరలు ఉండేలా నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, అందుకు చొరవ చూపిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ కార్యవర్గానికి, అలాగే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు దర్శకుడు నట్టి కుమార్, నిర్మాత నట్టి క్రాంతి పేర్కొన్నారు.

ఇక ఈ చిత్ర కధాంశం గురించి దర్శకుడు నట్టి కుమార్ మాట్లాడుతూ, ‘ఒక యథార్థ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. తనకు జరిగిన అన్యాయానికి ఒక ఆత్మ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనేదాన్ని హారర్ నేపథ్యంలో చాలా వినూత్నంగా చూపిస్తున్నాం. వైవిధ్యమైన స్క్రీన్ ప్లేతో అత్యద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని మలిచాం. అలానే సుపర్ణ మలాకర్ అనే బెంగాల్ అమ్మాయి ఇందులో సెకెండ్ హీరోయిన్ గా ఓ పవర్ ఫుల్ కాల్ గర్ల్ పాత్రలో నటించింది’ అని అన్నారు.
హీరోయిన్ నట్టి కరుణ మాట్లాడుతూ ‘లేడీ ఓరియెంటెడ్ చిత్రమిది. హీరోయిన్ గా పరిచయమవుతున్న నాకు తొలి చిత్రంలోనే విభిన్న కోణాలలో నటించే పాత్ర లభించింది. నటిగా నాకు పేరుతెచ్చే పాత్ర ఇది. అలాగే మా నాన్న డైరెక్షన్ లో హీరోయిన్ గా పరిచయం కావడం కూడా మరింత ఆనందంగా వుంది. అంచనాలకు తగ్గట్టు చిత్రం చాలా బాగా వచ్చింది’ అని అన్నారు.
నట్టి కరుణ హీరోయిన్ గా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో సుపర్ణ మలాకర్, బాబూమోహన్, హేమంత్,, స్నిగ్ధ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి సంగీతం: రవిశంకర్, సినిమాటోగ్రాఫర్: వెంకట హనుమ నరిసెటి, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్: కె.వి. రమణ, నిర్మాత: నట్టి క్రాంతి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నట్టికుమార్.

Previous Post

లయన్ కిరణ్ సుచిరిండియా అధినేత బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి కెయూరాను ప్రోత్స‌హించేందుకు ల‌క్ష రూపాయ‌లను అందించారు

Next Post

అందమైన “కల” పాట విడుదల

Next Post

అందమైన "కల" పాట విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఈ నెల 28న  “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్
movies

ఈ నెల 28న “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్

by admin
April 26, 2026
0

...

Read more
బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

April 25, 2026
ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

April 25, 2026
‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

April 25, 2026
‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

April 25, 2026
ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు “The 3rd” ఎంపిక

ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు “The 3rd” ఎంపిక

April 25, 2026
నటుడిగా వెండితెరపై.. సేవామూర్తిగా నిజ జీవితంలో: బహుముఖ ప్రజ్ఞాశాలి అఫ్సర్ ఆజాద్

నటుడిగా వెండితెరపై.. సేవామూర్తిగా నిజ జీవితంలో: బహుముఖ ప్రజ్ఞాశాలి అఫ్సర్ ఆజాద్

April 23, 2026
శ్రీకాకుళంలో విద్యాశాఖలో ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూళ్లు.. ఎవరీ శేషగిరి?

శ్రీకాకుళంలో విద్యాశాఖలో ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూళ్లు.. ఎవరీ శేషగిరి?

April 23, 2026
భవిష్యత్తరాలకు కూడా చోటిద్దాం… పుడమితల్లిని కాపాడుకుందాం…రాధే దగ్గుమల్ల

భవిష్యత్తరాలకు కూడా చోటిద్దాం… పుడమితల్లిని కాపాడుకుందాం…రాధే దగ్గుమల్ల

April 23, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In