తెలుగు బిగ్‌బాస్ రియాల్టీ షో కు ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో తెలిసిందే. మన దేశంలో హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడంలో బాగా పాపులర్ అయిన ఈ షో త్వరలోనే తెలుగు వెర్షన్‌లో 8వ సీజన్ స్టార్ట్ కానుంది. ఇక తెలుగులో ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ షోకు ప్రతి సీజన్ ప్రారంభానికి ముందు ఏదో ఒక కాంట్రవర్సీ అయితే క్రియేట్ అవుతూనే వస్తోంది. ఇక త్వరలోనే 8వ సీజన్ స్టార్ట్ అవుతోంది. 7వ సీజన్ మాంచి రసవత్తరంగా సాగడంతో 8వ సీజన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఆస్ట్రాలజర్ అయిన వేణుస్వామిని ఈ రియాల్టీ షోకు కంటెస్టెంట్‌గా తీసుకు వచ్చే ప్రయత్నాలు అయితే మొదలైనట్టు టాక్ ?
త్వరలో స్టార్ట్ అవ్వబోయే బిగ్ బాస్ సీజన్ 8లో కుమారి ఆంటీ, బర్రెలక్క వంటి వారితో పాటు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంట్రీ కూడా ఉందని తెలుస్తోంది. వేణు స్వామి ఇటీవల జ్యోతిష్యాలు చెప్పడం మానేస్తానని ఓ వీడియో చేశారు. ఏపీలో మళ్లీ జగన్ గెలుస్తారని ఆయన చెప్పిన జ్యోతిష్యం ఫెయిల్ అయ్యి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అలాగే తెలంగాణలో కేసీఆరే గెలుస్తారని చెప్పిన జ్యోతిష్యం కూడా సక్సెస్ కాలేదు. వేణుస్వామి అలా చెప్పినా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటకీ స్టార్ హీరోయిన్లు ఆయనతో పూజలు చేయించుకుంటున్నారు.
ఇక వేణుస్వామి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టుగా కూడా టాక్ ? అయితే నిర్వాహకులు అంత రెమ్యునరేషన్ ఇచ్చుకోలేమంటూ భేరసారాలు ఆడినా వేణుస్వామి హౌస్‌లో ఉంటే టోటల్ షోకు వచ్చే క్రేజ్ వేరుగా ఉంటుందని… అటు హౌస్‌లోనూ, ఇటు టీవీ టీఆర్పీలతో పాటు యూట్యూబ్, సోషల్ మీడియాలో షో ర్యాంప్ ఆడేస్తుందని ఆయన ముందు చెప్పిన రేటుకే ఓకే చెప్పినట్టు తెలిసింది. ఈ రెమ్యునరేషన్ బిగ్‌బాస్ చరిత్రలోనే టాప్ రెమ్యునరేషన్ రికార్డుగా ఉండబోతోందట.
ఇక వేణుస్వామి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి… అక్కడ కూడ కంటెస్టెంట్ల జాతకాలు చెపుతాడా ? అలా చేస్తే హౌస్‌లో మామూలు రచ్చ ఉండదు. అలాగే ఈ సారి సీజన్లో ఎవరు విజేతగా నిలుస్తారో ? ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో లాంటి డిస్కషన్లు కూడా పెడితే ఆ రచ్చ రంబోలా మామూలుగా ఉండదు. హౌస్‌లో కావాల్సినంత రచ్చ లేపినట్లవుతుంది.