• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

రివ్యూ: ఇట్లు… మీ సినిమా… యువతకు ఏమి మెసేజ్ ఇస్తుందంటే..?!!!

admin by admin
June 21, 2024
in movies, reviews
0 0
0
రివ్యూ: ఇట్లు… మీ సినిమా… యువతకు ఏమి మెసేజ్ ఇస్తుందంటే..?!!!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సినిమా అనేది ఓ మహా సముద్రం. అందులో నుంచి బయటపడటం అంద ఈజీ కాదు. అందుకే సినిమా మీద ఎంతో ప్యాషన్ ఉన్నా కూడా కొంత మంది వెనకడుగు వేస్తుంటారు. మరి కొంత మంది అందులోనే నిజాయతీగా ఎంతో పట్టుదలతో రాణించి విజయతీరాలకు చేరుతుంటారు. అలాంటి యువకుల కథే… ఇట్లు… మీ సినిమా. ఇందులో ప్రధాన పాత్ర ధారులుగా అభి రామ్, వెన్నెల, మనోహర్, పవన్, కృష్ణ, మంజుల నటించగా… సపోర్టింగ్ రోల్స్ లో ప్రదీప్, అమ్మ రమేష్ నటించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు హరీష్ చావా వెండితెరపై ఆవిష్కరించారు. లిటిల్ బేబీస్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత నోరి నాగ ప్రసాద్ ఈ నిర్మించారు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం పదండి.

కథ: రామ్(అభి రామ్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తనకు సినిమాల్లో నటించడం అంటే చాలా ఇష్టం. అందుకే సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్ ఫిలిం నగర్ లో సినిమా అవకాశాలకోసం కాళ్లు అరిగేలా తిరుగుతూ ఉంటారు. అతనితో పాటు మరో ముగ్గురు(పవన్, మనోహర్, కృష్ణ)లు కూడా తమకు ప్యాషన్ తో సినిమాల్లో రాణించాలని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ట్రయల్స్ వేస్తూ ఉంటారు. ఈ నలుగురు కలిసి సినిమా ప్రయత్నాలు సాగిస్తారు. అయితే రామ్ కి జాను(వెన్నెల) అనే లవర్ ఉంటుంది. ఎలాగైనా రామ్ ను పెళ్లి చేసుకొని తీరాలని రామ్ వెంబడి పడుతూ ఉంటుంది. మరి ఈ క్రమంలో రామ్, జానుల ప్రేమ ఫలించిందా? రామ్ అతని స్నేహితులు ముగ్గురూ సినిమా రంగంలో రాణించారా? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలావుందంటే…
గత కొన్ని దశాబ్దాలుగా సినిమా రంగంలో ఉండే కష్టాల మీద చాలా సినిమాలు వచ్చాయి. రవితేజ నటించిన ‘నేనింతే’, అప్పల్రాజు లాంటి సినిమాలు పీక్స్ లో సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులను చూపించారు. అలా ఎప్పటికప్పుడు కొత్త కోణంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే కష్టాల మీద దర్శకులు, నిర్మాతలు సినిమాలు తీస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి కష్టాలను ఫోకస్ చేస్తూ ‘ఇట్లు… మీ సినిమా’ తీశారు. మంచి జాబ్ ను, బిజినెస్ ను వదిలేసి… సినిమా రంగంలో రాణించాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొంత మంది సక్సెస్ అవ్వొచ్చు… కొంత మంది సక్సెస్ కాకపోవచ్చు. కానీ ప్రయత్నం అనేది సాగిస్తేనే… దానికి సార్థకత ఉంటుంది. చాలా నిజయతీగా పట్టుదలతో ప్రయత్నిస్తే… రాణించలేని రంగం అంటూ ఏదీ ఉండదనేది ఇందులో ఓ మెసేజ్ రూపంలో చూపించారు దర్శకుడు. చాలా మంది సినిమా ఇండస్ట్రీలో కష్టాలు ఎక్కువ… సక్సెస్ కాలేమనే వారికి ఇందులో నలుగురు యువకులు ఎంతో పట్టుదలో చేసే ప్రయత్నమే వారికి స్ఫూర్తిగా నిలుస్తుంది. అలాంటి పాయింట్ తో దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ అంతా సినిమా ప్రయత్నాల కోసం యువకులు పడే పాట్లను చూపించి… సెకెండాఫ్ లో కేవల ప్రయత్నాలే కాదు… తామే ఓ సినిమాని ఎందుకు తీయకూడదు… అందకు కావాల్సిన వనరుల్ని క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఎందుకు సమకూర్చకోకూడదని ఆలోచించి… చివరకు ఓ మంచి మూవీని తీసి విజయం సాధిస్తారు. ఇలాంటి స్పూర్తి దాయకమైన ప్లాట్ ను దర్శకుడు చాలా మెసేజ్ ఓరియంటెడ్ గా… లవ్, రొమాన్స్ తదితర వాటిని మేళవించి తెరకెక్కించారు. సినిమా రంగంలో సెటిల్ అవ్వాలనే యువకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. అందులో స్థిరపడి విహరించాలని ఓ నలుగురు యువకులు అనుకుంటారు. అలాంటి యువకుల పాత్రలు పోషించిన నలుగురూ బాగా నటించి ఎంటర్టైన్ చేశారు. అభిరామ్, వెన్నెల లీడ్ పెయిర్ గా కనిపించినా… మిగత ముగ్గురు యువకుల పాత్రలు కూడా సమానంగానే ఉన్నాయి. టీ స్టాల్ రాణిగా నటించిన మంజుల పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. కాస్టింగ్ కౌచ్ కు పాల్పడే నిర్మాత పాత్రలో నటించిన నటుడు బాగానే నటించారు. హీరోయిన్ తండ్రిగా నటించిన అతని పాత్ర పర్వాలేదు. నటుడు ప్రదీప్… మొదట్లో, చివర్లో కాసేపు కనిపించి ఆకట్టుకుంటారు. ఇక మిగతా పాత్రలన్నీ తమ తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.

దర్శకుడు సినిమా ఇండస్ట్రీలో కష్టాలపై రాసుకున్న కథ… స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ గా ఉంది. ఎక్కడా బోర్ లేకుండా సినిమాని తెరకెక్కించారు. టీ స్టాల్ రాణిలాంటి సినిమాల్లో స్థిరపడే అమ్మాయిలను … సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నిర్మాతలు వేషాలు ఇస్తాం… మాకేంటి అని చెప్పి… చివరకు ఎలా మోసగిస్తారో… కాస్టింగ్ కౌచ్ రూపంలో చూపించారు. అలాగే కొత్తగా వచ్చే యువకులను నిర్మాతలు డబ్బులు కొంత మీరూ పెట్టండి…. మిగతాది నేను చూసుకుంటా అని చెప్పడం… ఇలాంటి సీన్స్ అన్నీతెరమీద చాలా సహజంగా అనిపిస్తాయి. పాటలు పర్వాలేదు. సంభాషణలు చాలా సరదాగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఎక్కడా రాజీ పడకుండా సినిమాని తెరకెక్కించారు. ఈ వీకెండ్ మంచి ఎంటర్టైనింగ్ మూవీ. ఓ సారి సరదాగా చూసేయండి.

రేటింగ్: 3

Previous Post

శ్రీవారి మెట్టు నడక మార్గంలో స్కాన్ చేసిన టోకెన్లు ఉంటేనే శ్రీవారి దర్శనం : టీటీడీ

Next Post

ఘనంగా ‘జయహో రామానుజ’ సినిమా లిరికల్ సాంగ్స్ లాంఛ్

Next Post
ఘనంగా ‘జయహో రామానుజ’ సినిమా లిరికల్ సాంగ్స్ లాంఛ్

ఘనంగా 'జయహో రామానుజ' సినిమా లిరికల్ సాంగ్స్ లాంఛ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…
movies

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

by admin
May 31, 2026
0

...

Read more
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In