• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

రామోజీరావు విగ్రహం చేయిస్తున్న టీడీపి ఎంపీ 

admin by admin
June 15, 2024
in politics
0 0
0
రామోజీరావు విగ్రహం చేయిస్తున్న టీడీపి ఎంపీ 
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

భావితరాలకు గుర్తుండిపోయేలా.. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ గౌరవ శ్రీ చెరుకూరి రామోజీరావు గారి నిలువెత్తు విగ్రహాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నామని విజయనగరం ఎంపీ శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు వెల్లడించారు.

శుక్రవారం కోనసీమ జిల్లా కొత్తపేటలో ఉన్న శిల్పి వద్దకు వెళ్లి, రామోజీరావు గారి నిలువెత్తు విగ్రహాన్ని రూపొందించేందుకు సన్నద్ధం చేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు గారు మాట్లాడుతూ తొలినాళ్లలో ఉత్తరాంధ్రలో తెలుగు పత్రిక ఈనాడును ప్రస్థానం చేయించిన ఘనత రామోజీరావు గారికి దక్కుతుందని పేర్కొన్నారు.

తొలినాళ్లలోనే  విశాఖ తీరంలో ఈనాడు పత్రికను స్థాపించి.. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, ఉత్తరాంధ్ర ప్రజల్ని రామోజీరావు గారు చైతన్యపరిచారని అన్నారు. ప్రజా సమస్యలను ఈనాడు పత్రికలో వార్తల రూపంలో ప్రచురించి, ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి,  వాటిని పరిష్కరించే దిశగా వారధి వలె రామోజీరావు గారు పనిచేశారని తెలిపారు.

ఉత్తరాంధ్రలో పత్రిక ముద్రణ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, తొలినాళ్లలో ఇక్కడి నుంచే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ఈనాడు పత్రికను పంపిణీ చేయడం గొప్ప విషయమని అన్నారు. దానికి కృతజ్ఞతగా ప్రస్తుతం ఉత్తరాంధ్రలో రామోజీరావు గారి నిలువెత్తు విగ్రహాన్ని తొలుతగా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని స్పష్టం చేశారు.

తెలుగువారి కోసం, తెలుగుతనాన్ని, తెలుగు పౌరుషాన్ని, తెలుగు జాతిని కాపాడే దిశగా రామోజీరావు గారు పత్రికలు, టీవీలు, ఫిలిం సిటీ, మార్గదర్శి సంస్థల ఏర్పాటుతోపాటు ఎంతోమంది కళాకారులని తీర్చిదిద్దిన సందర్భం.. తదితర రామోజీరావు గారి గురించిన  అంశాలు  భావితరాలకు తెలియాలంటే రామోజీరావు గారి  ప్రతిబింబాన్ని బాహ్య ప్రపంచానికి కనిపించే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

ఈ రోజున ఈ క్రమశిక్షణ, బాధ్యతలు, ఈ సొసైటీ పై ఉన్న నమ్మకం, మంచి సుగుణాలు.. ఈనాడులో పనిచేయడం వల్లనే తనకు అబ్బాయని అప్పలనాయుడు గారి పేర్కొన్నారు.

ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతంలో రామోజీరావు గారి నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ట చాలన్న విషయాన్ని త్వరలో నిర్ణయిస్తామని, రెండో విగ్రహాన్ని రణస్థలంలోని సాయి డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రతిష్టించనున్నట్టు వివరించారు.

Previous Post

మస్ట్ వాచ్: ఆహాలో అదరగొడుతున్న చైతన్య రావ్ ‘డియర్ నాన్న’

Next Post

హీరో అల్లరి నరేష్ లాంచ్ చేసిన బి. శివప్రసాద్, శ్రీ పద్మిని సినిమాస్ ‘రారాజా’ టీజర్

Next Post
హీరో అల్లరి నరేష్ లాంచ్ చేసిన బి. శివప్రసాద్, శ్రీ పద్మిని సినిమాస్ ‘రారాజా’ టీజర్

హీరో అల్లరి నరేష్ లాంచ్ చేసిన బి. శివప్రసాద్, శ్రీ పద్మిని సినిమాస్ 'రారాజా' టీజర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి
movies

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి

by admin
May 6, 2026
0

...

Read more
ఈ నెల 28న  “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్

ఈ నెల 28న “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్

April 26, 2026
బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

April 25, 2026
ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

April 25, 2026
‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

April 25, 2026
‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

April 25, 2026
ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు “The 3rd” ఎంపిక

ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు “The 3rd” ఎంపిక

April 25, 2026
నటుడిగా వెండితెరపై.. సేవామూర్తిగా నిజ జీవితంలో: బహుముఖ ప్రజ్ఞాశాలి అఫ్సర్ ఆజాద్

నటుడిగా వెండితెరపై.. సేవామూర్తిగా నిజ జీవితంలో: బహుముఖ ప్రజ్ఞాశాలి అఫ్సర్ ఆజాద్

April 23, 2026
శ్రీకాకుళంలో విద్యాశాఖలో ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూళ్లు.. ఎవరీ శేషగిరి?

శ్రీకాకుళంలో విద్యాశాఖలో ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూళ్లు.. ఎవరీ శేషగిరి?

April 23, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In