తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయం. ఆ ఘనత ఎన్టీవీకి దక్కింది. తొలిసారి ఎన్టీవీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. తన మనసులోని మాటను ప్రధాని మోడీ ఎన్టీవీతో పంచుకోనున్నారు. అది ఎప్పుడో కాదు.. నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. పదేళ్లుగా తిరుగులేని విజయాలను సాధిస్తూ ప్రజల గుండెలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రధాని మోడీ.. ఎన్టీవీతో ఈ సార్వత్రిక ఎన్నికల ముచ్చట్ల గురించి మాట్లాడనున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ మీడియాకు అతి తక్కువ సమయం మాత్రమే ఇవ్వగలిగేంత బిజీ షెడ్యూల్‌లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడం గమనార్హం. గతంలో భక్తి టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న కీలక సమయంలో ఎన్టీవీకి ప్రధాని ఇంటర్వ్యూ ఇవ్వడమనేది చాలా పెద్ద విషయం. అలా చూసుకున్నా ఎన్టీవీ దేశ టెలివిజన్ చరిత్రలోనే అరుదైన ఘనతను సాధిస్తోందని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామాలపై ప్రధాని మోడీ సమాధానమివ్వనున్నారు. ప్రజల మెదళ్లలో నానుతున్న ఎన్నో ప్రశ్నలు, ప్రచారంలో ఉన్న మరెన్నో సందేహాలపై తెలుగు ప్రజల తరపున ఎన్టీవీ ప్రశ్నించనుంది. ఒకే ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోడీ దగ్గర కానున్నారు.
ప్రధాని మోడీతో ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://www.youtube.com/watch?v=9sBOhC540e8