• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ప్రసన్న వదనం.. మస్ట్ వాచ్ థ్రిల్లర్

admin by admin
May 3, 2024
in movies, reviews
0 0
0
ప్రసన్న వదనం.. మస్ట్ వాచ్ థ్రిల్లర్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సుహాస్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఖచ్చితం కంటెంట్ వుంటుందని నమ్మకం. తను ఎంచుకుంటున్న కథలు ఈ నమ్మకాన్ని ఇచ్చాయి. ఇప్పుడు ప్రసన్న వదనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుహాస్. సుకుమార్ శిష్యుడు అర్జున్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తిని పెంచాయి. ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ క్యురియాసిటీని కలిగించింది. మరి ఇంత బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులని అలరించిందా ? సుహాస్ ఖాతలో మరో హిట్ పడిందా?

కథ:
సూర్య (సుహాస్) ఓ ఎఫ్ఎం స్టేషన్ లో ఆర్జే. తనకి ఓ వింత రుగ్మత వుంటుంది. తను మొహాలని గురించలేడు. ఓ యాక్సిడెంట్ కారణంగా తలకు గట్టిగా దెబ్బ తగలడంతో తనకి ఫేస్ బ్లైండ్ నెస్ డిజార్డర్ వస్తుంది. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత మామూలు జీవితాన్ని గడుపుతున్న సూర్య ఓ రోజు అమృత( సాయి శ్వేతా)ని ఓ దుండగుడు లారీ కింద తోసేసే ఘటన చూస్తాడు. తనకి ఫేస్ బ్లైండ్ నెస్ వుండటం కారణంగా ఆ తోసిన వ్యక్తి ఎవరు గుర్తుపట్టలేడు. అయితే బాదితురాలికి న్యాయం జరగాలని భావించిన సూర్య.. పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి జరిగిన సంగతి అంతా చెబుతాడు. ఈ కేసు టేకాప్ చేసిన ఎసిపీ వైదేహి( రాశి సింగ్) ఎస్ఐ( నితిన్ ప్రసన్న) ఎలాంటి నిజాలు రాబట్టారు? ఫేస్ బ్లైండ్ నెస్ కారణంగా సూర్య ఎలాంటి కష్టాలు ఎదుర్కున్నాడు ? అసలు అమృత ఎవరు ? తనని చంపాల్సిన అవసరం ఎవరికి వుంది ? చివరికి హంతకుడు దొరికాడా ? లేదా ? అనేది మిగతా కథ.

విశ్లేషణ:
కొత్త దర్శకులు కొత్త కాన్సెప్ట్ లతో మ్యాజిక్స్ చేస్తున్నారు. ప్రసన్న వదనం దర్శకుడు అర్జున్ తన తొలి ప్రయత్నంలోనే ఫేస్ బ్లైండ్ నెస్ అనే యూనిక్ కాన్సెప్ట్ ని తీసుకొని సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా నడపడంలో విజయం సాధించాడు. యాక్సిడెంట్ సన్నివేశంతో మొదలైన కథ తర్వాత హీరో ఫేస్ బ్లైండ్ నెస్ క్యారెక్టర్ ని ఎస్టాబ్లెస్ చేస్తూ ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో సూర్య, అధ్య( పాయల్ రాధకృష్ణ) మధ్యతో వచ్చే సన్నివేశాలు, హీరో క్యారెక్టర్ చుట్టూ రాసుకున్న సన్నివేశాలు సరదాగా సాగిపోతాయి.

ఎప్పుడైతే కథలో క్రైమ్ ఎలిమెంట్ వచ్చిందో అప్పటి నుంచి కథనం పరుగులుపెడుతుంది. ఇంటర్వెల్ వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులు షాక్ ఇస్తుంది. నిజంగా ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇది. తర్వాత సెకండ్ హాఫ్ లో సూర్య పాత్ర చుట్టూ నడిపిన సర్వైవల్ డ్రామా చాలా డిఫరెంట్ గా వుంటుంది. కొన్ని సన్నివేశాలు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తాయి. క్లైమాక్స్ మరో స్థాయిలో వుంటుంది. కథలని మలుపులు ఒకొక్కటి మంచి థ్రిల్ ని పంచుతాయి. అయితే ఇందులో కూడా కొన్ని లోటు పాట్లు వున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇంకాస్త పదునుగా వుంటే బావుండేది. ఇలాంటి థ్రిల్లర్స్ లో వేగం కోరుకుంటారు ప్రేక్షకులు. అది తప్పితే ఓవరాల్ గా ప్రసన్న వదనం సినిమా ఆడియన్స్ ని సరికొత్తగా థ్రిల్ ని పంచుతుంది.

నటీనటులు: సూర్య పాత్రలో సుహాస్ జీవించాడు. ఇది రెగ్యులర్ పాత్ర కాదు. ఎమోషనల్ సీన్స్ లో తన నటన మరోస్థాయిలో వుంటుంది. ఇందులో సహజత్వంతో కూడిన యాక్షన్ సన్నివేశాల్లో కొత్త సుహాస్ కనిపిస్తాడు. తన కెరీర్ ఇది మరో గుర్తుండిపోయే పాత్ర. పాయల్ క్యూట్ గా ఆకట్టుకుంది. కథలో కూడా తనకి కీలక పాత్ర దక్కింది. రాశి సింగ్ కు పవర్ ఫుల్ రోల్ దొరికింది. ఆమె పాత్రని థియేటర్స్ లో చూసి ఆస్వాదించాల్సిందే. నితిన్ మరోసారి ఆకట్టుకున్నారు. చాలా నేచురల్ పెర్ఫార్మ్ చేశారు. హర్షతో పాటు మిగతా నటీనటులు కథలో ఇమిడిపోయారు.

టెక్నికల్: సాంకేతికంగా సినిమా ఉన్నతంగా వుంది. కెమరాపనితనం థ్రిల్ ని సరికొత్తగా ఎలివేట్ చేసింది. విజయ్ బుల్గానిన్ నేపధ్య సంగీతం బ్రిలియంట్ గా వుంది. కథలో ఇంటెన్స్ తీసుకొచ్చింది. ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ రిచ్ గా వున్నాయి. నిర్మాతలు చేసిన ఖర్చు తెరపై కనిపించింది. కొత్త దర్శకుడు అర్జున్ కొత్త కథ రాసుకోవడమే కాదు.. దాన్ని కొత్తగా ప్రజెంట్ చేయడంలో విజయం సాధించాడు.

రేటింగ్: 3.25

Previous Post

ఘనంగా “ది ఇండియన్ స్టోరి” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

Next Post

మండుతున్న ఎండలు..వందేళ్ల రికార్డు బ్రేక్

Next Post
మండుతున్న ఎండలు..వందేళ్ల రికార్డు బ్రేక్

మండుతున్న ఎండలు..వందేళ్ల రికార్డు బ్రేక్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం
politics

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

by admin
September 8, 2026
0

...

Read more
ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

September 6, 2026
ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

September 5, 2026
టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన  “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

September 5, 2026
పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

September 4, 2026
Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

September 4, 2026
అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

September 4, 2026
మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

September 3, 2026
ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

September 3, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In