• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

తెలుగు తేజం చిన్నారి కలశకు గౌరవ డాక్టరేట్ ప్రధానం

admin by admin
May 2, 2024
in politics
0 0
0
తెలుగు తేజం చిన్నారి కలశకు గౌరవ డాక్టరేట్ ప్రధానం
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

* ప్రపంచంలో అతి పిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలిగా గుర్తింపు

పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ…
వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము….
అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది.
ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.
అది ఆగస్టు 13, 2013… తెలుగు నేల ను పులకింపజేస్తూ ఈ లోకంలో అడుగు పెట్టింది ఆ బంగారు తల్లి. పేరు కలశ… కలశ నాయుడు.. పసితనము నుండే పరుల కష్టాలకు స్పందించడం మొదలుపెట్టింది తనలాంటి పసిపిల్లలు, పనివాళ్ళుగా ఉండడం చూసి తట్టుకోలేకపోయింది ఆ చిన్నారి గుండె. తన వంతుగా, తన వయసుకు తెలిసినంతగా సాయం ప్రారంభించింది. పలకలు, బలపాలు, చాక్లెట్లు, ఆట బొమ్మలు… ఒకటేమిటి ఎవరికి ఏ అవసరం ఉన్నా అన్నీ ఇచ్చేస్తూ ఉండేది. ఆ చిన్నారి దాన గుణానికి, సేవా తత్వానికి మురిసిపోయిన ఆమె తల్లిదండ్రులు ఆమెకు కావాల్సినంత స్వేచ్ఛనిచ్చారు. చేయూతను అందించారు. దాని ఫలితమే కలశ ఫౌండేషన్ సాధించిన ఘనవిజయాలు. వాటిలో మచ్చుకు కొన్ని తెలుసుకుందాం.
‘అక్షర కలశం’ అనే జ్ఞాన జ్యోతిని వెలిగించి ఎందరో చిన్నారుల జీవితాల్లో వెలుగులు పంచుతుంది. విభిన్న రంగాలలోని విశిష్ట సేవలు అందించిన మహిళా మూర్తులను గుర్తిస్తూ, వారిని గౌరవిస్తూ ‘మార్వలెస్ ఉమెన్’ పురస్కారాలతో సత్కరిస్తుంది. ‘గ్రీన్ రన్’ పేరిట పర్యావరణ పరిరక్షణకై ప్రజల్లో లోతైన అవగాహన కోసం పాటుపడుతుంది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగిస్తుంది. చిన్నారి కలశ తన సేవలను దేశ సరిహద్దులు దాటి విస్తరించింది. ఎన్నో దేశాల అవార్డులు, రివార్డులు తనను వరించాయి. అవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ అందించిన గౌరవ డాక్టరేట్ మరో ఎత్తు. సామాజిక సేవా రంగంలో ఆ చిన్నారి చేసిన సేవను గుర్తించి లండన్ పార్లమెంటు భవనంలో.. చిన్నారి కలశ నాయుడు ‘ప్రపంచవ్యాప్తంగా అతిచిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలు’గా అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. పలు దేశాలలో చిన్నారి కలశ అందించిన సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ ఈ పురస్కారం మరియు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం జరిగింది.
బ్రిటిష్ పార్లమెంట్, గౌరవ పార్లమెంటు సభ్యులు, గ్రేట్ బ్రిటన్ లోని ఇండియన్ హైకమీషనర్ మరియు అనేకమంది ప్రముఖులను ఉద్దేశించి చిన్నారి కలశ రెండు నిమిషాల పాటు అద్భుతంగా ప్రసంగించడం జరిగింది. అంతేకాదు కలశ నాయుడు గురించి లండన్ పార్లమెంట్లో రెండు నిమిషాల నిడివి గలిగిన ఆడియో విజువల్ ప్లే చేయడం జరిగింది. అతి ముఖ్యమైన పార్లమెంటు క్వశ్చన్ అవర్ లో భాగం కావలసి వచ్చినందున గ్రేట్ బ్రిటన్ ప్రధాని శ్రీ రిషి సునక్, ఈ కార్యక్రమంలో భాగం కాలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. అంతేకాక చిన్నారి కలశ నాయుడు కఠోర శ్రమ మరియు నిబద్ధతను గుర్తించి, గౌరవించుకోవడం ఒక సదవకాశం అని, ఇంత చిన్న వయసులో తను అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అని, ఈ పురస్కారం తనకు మేము అందించే గౌరవం, విశ్వ మానవ సేవలో ఈ చిన్నారి అత్యుత్తమ శిఖరాలు అందుకోవాలని ఆశిస్తున్నాను అని అన్నారు. చిన్నారి కలశ నాయుడిని తనతో కలిసి ఒక ప్రత్యేక హై-టీ పంచుకోవలసిందిగా ఆహ్వానం పలుకుతూ, తన అత్యద్భుత సేవలు మరియు ఈ వ్యక్తిగత విజయానికి ప్రతిగా ప్రతిష్టాత్మకమైన లండన్ పార్లమెంట్ సందర్శించవలసిందిగా వ్యక్తిగత ఆహ్వానం అందించడం జరిగింది.

Previous Post

‘మై డియర్ దొంగ’కు ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులు కృతజ్ఞతలు: హీరో అభినవ్ గోమటం

Next Post

విక్రమ్ ప్రభు, ఎ. రాజ్‌దీప్ సీట్ ఎడ్జ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘అసురగురు’ మే 3న ఆహాలో స్ట్రీమింగ్

Next Post
విక్రమ్ ప్రభు, ఎ. రాజ్‌దీప్ సీట్ ఎడ్జ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘అసురగురు’ మే 3న ఆహాలో స్ట్రీమింగ్

విక్రమ్ ప్రభు, ఎ. రాజ్‌దీప్ సీట్ ఎడ్జ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ 'అసురగురు' మే 3న ఆహాలో స్ట్రీమింగ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,
movies

“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

by admin
February 2, 2026
0

...

Read more
“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

February 2, 2026
ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

February 2, 2026
లగ్జరీ సిల్వర్ జువెలరీ  ‘గోయాజ్ (GOYAZ)’ –22వ  స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో  ప్రారంభం

లగ్జరీ సిల్వర్ జువెలరీ ‘గోయాజ్ (GOYAZ)’ –22వ స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో ప్రారంభం

February 1, 2026
వైభవంగా జరిగిన హీరో  సతీష్ జై కుమార్తె ‘నైరా ‘  పుట్టినరోజు వేడుక

వైభవంగా జరిగిన హీరో సతీష్ జై కుమార్తె ‘నైరా ‘ పుట్టినరోజు వేడుక

January 29, 2026
సునీత చేతుల మీదుగా బ్యాండ్ క్యాప్రిసియో చారిత్రక యూఎస్ఏ టూర్ 2026 పోస్టర్ ఆవిష్కరణ

సునీత చేతుల మీదుగా బ్యాండ్ క్యాప్రిసియో చారిత్రక యూఎస్ఏ టూర్ 2026 పోస్టర్ ఆవిష్కరణ

January 22, 2026
ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి బర్త్ డే సందర్భంగా ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” హీరో పిడుగు విశ్వనాథ్ పరిచయ కార్యక్రమం

ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి బర్త్ డే సందర్భంగా ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” హీరో పిడుగు విశ్వనాథ్ పరిచయ కార్యక్రమం

January 14, 2026
ప్రముఖ దర్శకుడు వి. సముద్ర , బెజవాడ బేబక్క సంయుక్తంగా  విడుదల  చేసిన”వెంకీ పింకీ జంప్” సినిమా ఆడియో

ప్రముఖ దర్శకుడు వి. సముద్ర , బెజవాడ బేబక్క సంయుక్తంగా విడుదల చేసిన”వెంకీ పింకీ జంప్” సినిమా ఆడియో

January 13, 2026
సినీ గేయ రచయిత అనంత్ శ్రీరాం చేతుల మీదుగా విజేతలకు సన్మానం

సినీ గేయ రచయిత అనంత్ శ్రీరాం చేతుల మీదుగా విజేతలకు సన్మానం

January 12, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In