ఇది ఎన్డీఏ కూటమి మానిఫెస్టో కాదు..
టీడీపీ, జనసేన మానిఫెస్టో పట్టుకోవడానికి నిరాకరించిన బీజేపీ నాయకుడు సిద్ధార్థ్ నాథ్
అసలు బీజేపీ దీనికి మద్దతు ఇస్తుందా..? ఇవ్వడా..?
ఆల్ ఫ్రీ బాబు అని చంద్రబాబును ఊరికే అనలేదు. గతంలో కూడా అలవికాని హామీలను ఇచ్చి తుంగలో తొక్కారు బాబు. అక్క చెల్లెమ్మలు బ్యాంకులో ఉన్న మీ బంగారాన్ని నేను అధికారంలోకి రాగానే విడిపించి ఇస్తా… డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా… రైతు రుణాలు మాఫీ చేస్తా… ఇలా ఏవేవో అమలు సాధ్యం కానీ హామీలను ఇచ్చి… అభాసు పాలయ్యారు. ఇది కమల నాథులు గమనించారో ఏమో… ఈ రోజు విడుదల చేసిన కూటమి మ్యాని ఫెస్టో ప్రతులను పట్టుకోవడానికి బీజేపీ నాయకుడు సిద్ధార్థ్ నాథ్ విలేకరుల సమక్షంలోనే నిరాకరించారు. దాంతో అక్కడ ఉన్న వాళ్లంతా ఈ మ్యాని ఫెస్టో కూటమి మ్యాని ఫెస్టో కాదు.. టీడీపీ, జనసేన మ్యానిఫెస్టో అనడం మొదలెట్టేశారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేసిన మ్యాని ఫెస్టోకి అసలు రాష్ట్ర బడ్జెట్టు సపోర్టు చేస్తుందా? అంత ఆదాయం రాష్ట్రానికి ఉందా? కేవలం ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే ఇలాంటి అమలు సాధ్యం కానీ హామీలను మ్యాని ఫెస్టోలో పెట్టారనేది అందరికీ అర్థం అవుతోంది. గతంలో చంద్రబాబు నాయుడు మ్యానిఫెస్టోని ఆన్ లైన్ లో లేకుండా చేసిన విషయం తెలిసిందే. అదే వైయస్ జగన్ మ్యాని ఫెస్టోని ఓ బైబిల్ లాగ, ఖురాన్ లాగ, భగవద్గీత లాగ భావించి… ఇచ్చిన హామీలను, ఇవ్వని హామీలను కూడా ప్రజా సంక్షేమం కోసం అమలు చేసిన నాయకుడు అని ప్రజలు అనుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో వైయస్ జగన్ విజయం ఖాయమని ఇప్పటికే అన్ని సర్వేల్లోనూ తేలిపోయింది. ఇప్పుడు బాబు, పవన్ కలిసి ఎన్ని అలవికానీ హామీలనిచ్చినా ఏపీ ప్రజలు నమ్మరు. అందుకే భాజపా నాయకుడు ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రతులను పట్టుకోవడానికి నిరాఖరించి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని భాజపా బహిరంగంగా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే బాబు పాపంలో భాజపా కూడా భాగస్వామి అవ్వాల్సి వస్తుంది. ఈ రోజు విడుదల చేసిన కూటమి మ్యానిఫెస్టోపై భాజపా స్టాండ్ ఏంటో ప్రకటించాల్సి అవసరం ఎంతైనా ఉంది.