• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

సస్పెన్స్ తో ఉత్కంఠత రేపే… భూతద్దం భాస్కర్ నారాయణ

admin by admin
March 1, 2024
in movies, reviews
0 0
0
సస్పెన్స్ తో  ఉత్కంఠత రేపే… భూతద్దం భాస్కర్ నారాయణ
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

డిటెక్టివ్ థ్రిల్లర్స్ కి మంచి ఫ్యాన్స్ భేస్ వుంటుంది. కంటెంట్ వుంటే చిన్న సినిమాలు కూడా ఈ జోనర్ లో పెద్ద విజయాలు సాధిస్తుంటాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దీనికి మంచి ఉదాహరణ. అయితే తెలుగులో మంచి డిటెక్టివ్ థ్రిల్లర్ వచ్చి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు శివ కందుకూరి నటించిన భూతద్ధం భాస్కర్ నారాయణ ప్రమోషనల్ కంటెంట్ ఈ జోనర్ ప్రేక్షకులని ఊరించింది. డిటెక్టివ్ కథకు పురాణాలతో ముడిపెట్టడం ఆసక్తిని పెంచింది. మరా ఆసక్తి సినిమాలో కనిపించిందా? భూతద్ధం భాస్కర్ నారాయణ టేకాప్ చేసిన కేసులోని మలుపులు ప్రేక్షకులని అలరించాయా?

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో వరుస హత్యలు కలకలం రేపుతాయి. ఎవరో సైకో కిల్లర్ మహిళల తల నరికేసి ఆ స్థానంలో దిష్టిబొమ్మని పెడతాడు. ఈ కేసుని దిష్టిబొమ్మ హత్యలుగా పిలుస్తారు పోలీసులు. ఈ సైకో కిల్లర్ ని పట్టుకోవడానికి రంగంలో దిగుతాడు లోకల్ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి). మరి ఈ కేసుని చేధించాడా? ఈ కేసుకిపురాణాలకి మధ్య వున్న లింక్ ఏమిటి ? ఈ కేసులో ఎలాంటి నిజాలు వెలుగు చూశాయి.? అనేది తక్కిన కథ.

థ్రిల్లర్ కథలకు వుండాల్సిన ప్రధాన లక్షణం సస్పెన్ ని చివరి వరకూ ఆసక్తిగా కొనసాగించడం. ఈ విషయంలో భూతద్ధం భాస్కర్ నారాయణకు మంచి మార్కులు పడతాయి. ఒక క్రైమ్ థ్రిల్లర్ కి పురాణాలతో ముడిపెట్టడం, దానిని దిష్టి బొమ్మ హత్యలకు లింక్ చేయడం భలే కుదిరింది. నిజానికి ఇలాంటి కంటెంట్ తెలుగులో సినిమాలు రాలేదనే చెప్పాలి. హీరో చైల్డ్ వుడ్ ఎపిసోడ్ తో మొదలుపెట్టిన దర్శకుడు ఆ పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దాడు. ఫన్ ఎలిమెంట్స్ తో పాటు లవ్ ఎమోషన్ పర్వాలేదనిపిస్తాయి. అయితే సీరియల్ కిల్లింగ్స్ తెరపైకి వచ్చిన తర్వాత కథ చాలా ఉత్కంఠగా ముందుకు సాగుతుంది. సీరియల్ కిల్లర్ ఎవరు ?అనే ఆసక్తి చివరి వరకూ కొనసాగుతుంది. ద్వితీయార్ధంలో వచ్చే మలుపులు ప్రేక్షకులని మరితంగా అలరిస్తాయి. దర్శకుడు రాసుకున్న పురాణ కోణం బాగా వర్క్ అవుట్ అయ్యింది. అది కథకు ఒక కొత్తదనం తెచ్చింది. చివరివరకూ సస్పెన్స్ ని హోల్డ్ చేయడంలోనే దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

నటీనటులు: శివ కందుకూరి, భాస్కర్ నారాయణ పాత్రలో ఒదిగిపోయాడు. డిటెక్టివ్ అంటే బ్లాక్ అండ్ బ్లాక్ లో చూపిస్తుంటారు, ఇందులో మాత్రం ఆ పాత్రకు లోకల్ టచ్ ఇవ్వడం నేచురల్ గా వుంది. ఆ పాత్రతో మరింత కనెక్ట్ అయ్యేలా చేసింది. తన పెర్ఫామెన్స్ చాలా ప్రామెసింగ్ గా వుంది. యాక్టింగ్ లో మంచి యీజ్ చూపించాడు. రిపోర్టర్ లక్ష్మీ పాత్రలో చేసిన రాశి సింగ్ నటన బావుంది. మిగతానటీనటులు కథకు బాగా హెల్ప్ అయ్యారు.

టెక్నికల్ గా శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం ఈ సినిమాకి బిగ్ ఎసెట్. థ్రిల్లింగ్ మూడ్ ని బాగా ఎలివేట్ చేశాడు. తన సంగీతంలో కూడా ఒక రూరల్ టచ్ కనిపించింది. కెమరాపనితనం రిచ్ గా వుంది. నిర్మాతలు చేసిన ఖర్చు తెరపై కనిపించింది. విఎఫ్ఎక్స్ అవుట్ పుట్ బాగానే వుంది. దర్శకుడు చెప్పిన కంటెంట్ లో కొత్తదనం వుంది. థ్రిల్లర్స్ ని ఇష్టపడే ప్రేక్షకులు భూతద్ధం భాస్కర్ నారాయణ నచ్చుతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

రేటింగ్: 3.25

Previous Post

మునుపెన్నడూ చూడని అద్భుతమైన మైథలాజికల్… ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’

Next Post

రామోజీ ఫిలింసిటీలో “1920 భీమునిపట్నం” ప్రారంభం

Next Post
రామోజీ ఫిలింసిటీలో “1920 భీమునిపట్నం” ప్రారంభం

రామోజీ ఫిలింసిటీలో "1920 భీమునిపట్నం" ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి
movies

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి

by admin
May 6, 2026
0

...

Read more
ఈ నెల 28న  “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్

ఈ నెల 28న “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్

April 26, 2026
బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

బుల్లెట్ దిగింది.. మిస్టరీ పెరిగింది! ‘గేదెల రాజు’ మూవీ రివ్యూ

April 25, 2026
ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

April 25, 2026
‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

April 25, 2026
‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

April 25, 2026
ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు “The 3rd” ఎంపిక

ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌కు “The 3rd” ఎంపిక

April 25, 2026
నటుడిగా వెండితెరపై.. సేవామూర్తిగా నిజ జీవితంలో: బహుముఖ ప్రజ్ఞాశాలి అఫ్సర్ ఆజాద్

నటుడిగా వెండితెరపై.. సేవామూర్తిగా నిజ జీవితంలో: బహుముఖ ప్రజ్ఞాశాలి అఫ్సర్ ఆజాద్

April 23, 2026
శ్రీకాకుళంలో విద్యాశాఖలో ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూళ్లు.. ఎవరీ శేషగిరి?

శ్రీకాకుళంలో విద్యాశాఖలో ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూళ్లు.. ఎవరీ శేషగిరి?

April 23, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In