ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మెల్లిగా మొదలవుతోంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు వ్యూహకర్తలుగా మారి ఆంధ్ర రాజకీయ చదరంగాన్ని తమదైన శైలిలో ఆడడానికి సిద్ధపడుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ ఈసారి కూడా వైయస్ జగన్ ప్రభుత్వమే పీఠం ఎక్కుతుంది అని ఒకసారి స్పష్టంగా తెలుస్తుంది. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్ర పేదలకు తాను ఉన్నాను అని అండగా నిలబడి అభివృద్ధితో రాష్ట్రాన్ని పరుగులు తీయిస్తున్నాడు జగన్ అన్న. ఈ నేపథ్యంలో జగన్ పాలనపై ఆంధ్ర రాష్ట్రంలో మంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
ఇది నేను చెప్పే మాట కాదు తాజాగా జన్‌మత్ పోల్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వే నివేదిక చెప్పే పచ్చి నిజం. పేదలకు అండగా నిలబడ్డ పెద్దన్న.. మన జగనన్న కే ఈసారి కూడా ఓట్లు ఎక్కువగా పడే అవకాశం ఉందని ఈ సర్వే ద్వారా వెళ్లడయ్యింది. ఈ సర్వే పోల్స్ ప్రకారం వైయస్సార్ పార్టీకి 116 నుంచి 118 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక కూటమిగా దాడి చేస్తున్న టిడిపి, జనసేనకు 46 నుంచి 48 ఓట్లు దక్కే అవకాశం ఉంది. మిగిలిన కాస్త కోస్తా ఓట్లు ఇండిపెండెంట్లు ,ఇతర పార్టీల ఖాతాలోకి వెళ్తాయి.
దీనితోపాటుగా దేశంలో ప్రఖ్యాతిగాంచిన టైమ్స్ నౌ గ్రూప్..ఈటీజీ గ్రూప్ నిర్వహించిన సర్వే రిపోర్ట్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో 51 శాతం ప్రజలు జగనన్న వెనకే ఉన్నారు. ఈ సంస్థలు దేశవ్యాప్తంగా అనేక ఎన్నికల సర్వేలు నిర్వహించి మంచి అనుభవం గడించి ఉన్నాయి. పలు సందర్భాలలో ఈ సంస్థలు వెల్లడించిన సర్వేల అంచనాలు ఎన్నికల ఫలితాలలో నిరూపించబడ్డాయి.
పొలిటికల్ క్రిటిక్ సర్వేస్ అండ్ అనాలసిస్.. అనే సంస్థ ఇటీవల వెల్లడించిన సర్వే రిపోర్టు ప్రకారం జగన్ పార్టీకి 135 పైగా సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనితో పాటుగా పోల్స్ట్రాటజీ గ్రూప్ సర్వేలో..48.5 శాతం ఓట్లు జగనన్న ఖాతాలో పడితే టిడిపికి 38.2 శాతం వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇలా ఎన్ని సర్వేల ఫలితాలు తీసుకున్న ఫైనల్ గా ఈసారి కూడా జగన్ ప్రభుత్వం వస్తుంది అని స్పష్టం అయిపోతుంది. సంక్షేమ పథకాలను సరియైన పద్ధతిలో అవలంబించి.. అభివృద్ధిని ప్రజలకు పరిచయం చేసి.. బడుగు బలహీన వర్గాలకు చేదోడుగా నిలిచి.. ఆంధ్ర ప్రజల గుండెలలో చెరగని ముద్ర వేశాడు జగన్. ఇక ఫ్యాన్ ప్రభంజనానికి.. సైకిలు, గ్లాసు గల్లంతు కాక తప్పదు అనిపిస్తుంది.