• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఘనంగా ప్రారంభమైన CM పెళ్ళాం (కామన్ మ్యాన్ పెళ్ళాం) మూవీ

admin by admin
October 16, 2023
in movies
0 0
0
ఘనంగా ప్రారంభమైన CM పెళ్ళాం (కామన్ మ్యాన్ పెళ్ళాం) మూవీ
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

వాకాడ అప్పారావు సమర్పణలో ఆర్కే సినిమాస్ బేనర్ పై బొల్లా రామకృష్ణ నిర్మాతగా రమణారెడ్డి  కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తూ డైరెక్షన్ చేస్తున్న సినిమా CM పెళ్ళాం (కామన్ మ్యాన్ పెళ్ళాం). ఈ CM పెళ్ళాం (కామన్ మ్యాన్ పెళ్ళాం) సినిమా సోమవారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. మొయినాబాద్ CM ఇంటికి సంబంధించిన సన్నివేశాలను ఈ సినిమా ముహూర్తపు సన్నివేశంగా తీసి ఈరోజు(సోమవారం) ఉదయం సినిమాను అధికారికంగా ప్రారంభించారు. సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరగనుంది. ఇక ఈ సినిమాలో సీఎంగా అజయ్, సీఎం పెళ్లాంగా ఇంద్రజ, హోమ్ మినిస్టర్ గా సురేష్ కొండేటి నటిస్తున్నారు. ఇక సీనియర్ హీరో సుమన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నగేష్, కోటేశ్వర రావు, భరత్, ప్రీతి నిగం, రూపాలక్ష్మి, ప్రజ్ఞ, శాంతి, దాసరి చలపతి రావు, బేబీ హర్షిత, సత్యనారాయణ మూర్తి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ డైరెక్షన్ అన్నీ రమణారెడ్డి బాధ్యత వహిస్తున్నారు. సంగీతం ప్రిన్స్ హనీ, డీఓపీ నాగ శ్రీనివాసరావు, ఎడిటర్ రామారావు, ఆర్ట్ రామకృష్ణ, స్టిల్స్ శ్రీనివాస్ రెడ్డి, అంజన్ కుమార్ నిర్మాణ సారథ్యంలో నిర్మాత బొల్లా రామకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా సినిమా సమర్పకుడు వాకాడ అప్పారావు మాట్లాడుతూ అందరికీ నమస్కారాలు, ఇది ఆర్కే అనే సంస్థ ఒక కొత్త సంస్థ బొల్లా రామకృష్ణ  గారు దీనికి నిర్మాత. మా రమణా రెడ్డి డైరెక్టర్ మాత్రమే కాదు స్క్రీన్ ప్లే, మ్యూజిక్ సహా అన్నీ ఆయనే చూసుకుంటున్నారు. ఆయన ఈ సినిమా కథ చెప్పిన వెంటనే బొల్లా రామకృష్ణ గారితో మాట్లాడి ఈ సినిమాను సెట్స్ మీదకు ఈరోజు తీసుకురావడం జరిగింది. కామన్ గా చాలా మంది అనుకుంటారు సీఎంకి కామన్ మ్యాన్ కి ఏమీ తేడా లేదు, ఇద్దరూ ఒకటేనని అందుకు సంబంధించిన ఒక భార్య కథే ఈ సినిమా. ఇది ఒక కొత్త సబ్జెక్ట్, ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేని ఒక సబ్జెక్ట్. సమాజానికి పొలిటీషియన్స్, సాధారణ ప్రజలు ఎలా ఉపయోగపడాలి అని ఉద్దేశంతో రాసుకున్న సినిమా ఇది. ఎక్కడా నెగిటివ్ లేకుండా ముందుకు వెళుతోంది. అందరూ సినిమా చూసి ఆదరించాలి” అన్నారు.

డైరెక్టర్ రమణారెడ్డి మాట్లాడుతూ అందరికీ నమస్కారం, ఇప్పుడే సీఎం పెళ్ళాం – అంటే కామన్ మ్యాన్ పెళ్ళాం అందరూ చెప్పుకున్నట్టు నేను కూడా చెప్పాలి ఇది వెరైటీ సినిమా అని కానీ చూసాక ప్రేక్షకులే చెబుతారు ఇది వెరైటీ సినిమా అని. డిఫరెంట్ యాంగిల్ లో పొలిటికల్ పాయింట్స్, నిజంగా ఒక పదేళ్ళ తర్వాత రాజకీయాలు ఎలా ఉంటాయి? ఎలా ఉండబోతున్నాయి? అనేది భిన్నమైన కోణంలో ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాం. నిజానికి వాకాడ అప్పారావు గారికి థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన విన్న వెంటనే నేను బ్యాక్ బోన్ గా ఉంటానని అంటూ ముందుకు వచ్చారు. ఆర్కే గారు ఒక ఛానల్ పెట్టి ఎందరికో ఉపయోగపడే విధంగా ఉంటూనే మా సినిమా నిర్మించేందుకు ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. సంతోషం సురేష్ గారికి సంతోషంగా థాంక్స్ చెబుతున్నా” అన్నారు.

నిర్మాత బొల్లా రామకృష్ణ మాట్లాడుతూ మొట్టమొదటి సారిగా రమణారెడ్డి గారు నా వద్దకు వచ్చి ఈ స్టోరీ చెప్పి సినిమా చేద్దాం అని అన్నప్పుడు పొలిటికల్ గా కానీ కామన్ మ్యాన్ కి గాని జరిగే ఇబ్బందులు చూపించాలనే ఉద్దేశంతో నిర్మాణంలో అడుగుపెడుతున్నాం.  కామన్ మ్యాన్ పెళ్ళాం ఆర్కే సినిమాస్ బ్యానర్ మీద నిర్మితం అవుతుంది. ఈ సినిమా అందరూ చూసి తమ ఒపీనియన్ చెప్పాలని కోరుకుంటున్నాం అని అన్నారు.
నటి ఇంద్రజ మాట్లాడుతూ ఈరోజు సీఎం పెళ్లాం – కామన్ మ్యాన్ పెళ్ళాం అనే సినిమా ఓపెనింగ్ జరిగింది. సొసైటీకి చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజెస్ ఉన్న ఒక మూవీ ఇది. సోల్ ఫుల్ గా తీయాలని ప్రయత్నిస్తాం. త్వరలోనే మీ ముందుకు వస్తాం, ఇంతకు ముందు లానే మమ్మలని ఆదరించండి అని అన్నారు.

టైటిల్: CM పెళ్ళాం (కామన్ మ్యాన్ పెళ్ళాం)
నిర్మాణ సంస్థ : ఆర్కే సినిమాస్
నిర్మాత: బొల్లా రామకృష్ణ
కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ డైరెక్షన్ :రమణారెడ్డి
నటీనటులు: అజయ్, ఇంద్రజ, సురేష్ కొండేటి, నగేష్, కోటేశ్వర రావు, భరత్, ప్రీతి నిగం, రూపాలక్ష్మి, ప్రజ్ఞ, శాంతి, దాసరి చలపతి రావు, బేబీ హర్షిత, సత్యనారాయణ మూర్తి
సంగీతం: ప్రిన్స్ హనీ
డీఓపీ: నాగ శ్రీనివాసరావు
ఎడిటర్: రామారావు
ఆర్ట్: రామకృష్ణ
స్టిల్స్: శ్రీనివాస్ రెడ్డి,
నిర్మాణ సారథ్యం: వాకాడ అంజన్ కుమార్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : శేఖర్
సమర్పణ: వాకాడ అప్పారావు.

Tags: CM Pellam (Common Man Pellam) movie started grandly
Previous Post

నవంబర్ 17న ‘నేనెక్కడున్నా’ చిత్రం  విడుదల

Next Post

జోజు జార్జ్ & కల్యాణి ప్రియదర్శిని ”అంథోని” టీజర్ విడుదల

Next Post
జోజు జార్జ్ & కల్యాణి ప్రియదర్శిని ”అంథోని” టీజర్ విడుదల

జోజు జార్జ్ & కల్యాణి ప్రియదర్శిని ''అంథోని" టీజర్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్
movies

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

by admin
September 6, 2026
0

...

Read more
ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

September 5, 2026
టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన  “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

September 5, 2026
పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

September 4, 2026
Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

September 4, 2026
అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

September 4, 2026
మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

September 3, 2026
ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

September 3, 2026
ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

September 1, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In