• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

యూత్ ని ఆకట్టుకునే మిస్టర్ కళ్యాన్

admin by admin
March 10, 2023
in movies
0 0
0
యూత్ ని ఆకట్టుకునే మిస్టర్ కళ్యాన్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

శ్రీమతి ఉష శ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబడిన చిత్రం మిస్టర్ కళ్యాణ్. మార్చి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాన్యం కృష్ణ, అర్చన, హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాతో పండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాత సుబ్బారెడ్డి ఈ సినిమాను నిర్మించారు. సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.

కథ:
హీరో కళ్యాణ్ (కృష్ణ మాన్యం) ఒక కాల్ బాయ్. అలా అతని వృత్తిలో ఉన్న కళ్యాణ్ కు కొన్ని క్యారెక్టర్లు తారసపడతాయి. ఆ పాత్రలు కళ్యాణ్ తో కొన్ని ఎమోషన్స్ ను పంచుకుంటాయి. అదే సిటీలో చాపెల్ ( సప్తగిరి ) ఒక కార్పొరేట్ వ్యవస్థ పెట్టి కాల్ బాయ్ కంపెని రన్ చేస్తూ ఉంటాడు, ఈ క్రమంలో చాపెల్ తన కంపెనీలో జాన్ అవ్వమని కళ్యాణ్ ను రిక్వెస్ట్ చేస్తాడు. కానీ కళ్యాణ్ అతని మాట వినడు. కళ్యాణ్ కాల్ బాయ్ గా చేస్తున్న ఒకానొక సందర్భంలో తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి సారిక (అర్చన) కు దొరికిపోతాడు. ఆ తరువాత సారిక కళ్యాణ్ ను ఎలా ట్రీట్ చేసింది ? కళ్యాణ్ మరియు చాపెల్ చివరికి ఏమయ్యారు ? అసలు కళ్యాణ్ కాల్ బాయ్ గా ఎందుకు మారాడు వంటి విషయాలు తెలియాలంటే మిస్టర్ కళ్యాణ్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
మిస్టర్ కళ్యాణ్ సినిమా మొదటి భాగం వినోదాత్మకంగా సాగుతుంది. సప్తగిరి తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. సప్తగిరి కి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ పాత్రల్లో నటించిన ధనరాజ్, బాబీ వారి పాత్రల్లో బాగా నటించి మెప్పించారు. హీరోయిన్ అర్చన బాగా నటించింది, సారిక పాత్రలో ఒదిగిపోయింది. హీరో ప్రయాణంలో తనకు పరిచయం అయిన నాలుగు పాత్రలు మనలోని ఎమోషన్స్ ను తట్టి లేపుతాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక ఇంట్రెస్ర్ తప్పకుండా కలుగుతుంది. సెకండ్ హాఫ్ హ్యూమన్ ఎమోషన్స్, బంధాలు వాటి విలువల గురించి అద్భుతంగా చూపించారు.

దర్శకుడు పండు కు మిస్టర్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ మూవీ అయినప్పటికీ అనుభవం కలిగిన దర్శకుడిలా చేశాడు. తాను రాసుకున్న కథ కథనాలు తెర మీద చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు మొత్తం 5 పాటలను బాగా ఇచ్చాడు. నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా చేశాడు. సాహిత్యం కూడా తనే ఇవ్వడం విశేషం. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ గా మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ నిలబడ్డాడని చెపొచ్చు. కెమెరామెన్ నానాజి మరియు ఎమ్.వి.గోపి వీరి పనితనం అద్భుతం వారి కెమెరా వర్క్ తో సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్లిందని చెప్పక తప్పదు. డైరెక్టర్ పండు, కెమెరామెన్స్ నానాజి మరియు ఎమ్.వి.గోపి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ కొత్తవల్లే అయినప్పటికీ అనుభవం కలిగిన టెక్నిషన్స్ లా చేసి మిసర్ట్ కళ్యాణ్ సినిమాను నిలబెట్టారు. ఎడిటర్ వినోద్ అద్వయ్ సినిమాను చాలా నీట్ గా కట్ చేశారు. అతని వర్క్ బాగుంది. ఈ సినిమాకు ఫైట్స్ బిగ్ ప్లస్, షావాలింన్ మల్లేష్ మాస్టర్ కంపోజ్ చేసిన నాలుగు ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయి. అనిష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన నాలుగు పాటలు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో బాగా తీశారు. మాస్టర్ కొరియోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.

నిర్మాత ఎన్. వి.సుబ్బారెడ్డి ఖర్చుకు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మిస్టర్ కళ్యాణ్ సినిమాను నిర్మించారు. శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ లో వచ్చిన మొదటి సినిమా మిస్టర్ కళ్యాణ్ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. అన్ని వర్గాల వారికి నచ్చే చాలా ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా చూస్తే నిర్మాత ఎన్. వి. సుబ్బారెడ్డి అభిరుచి స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి మంచి కథ బలం ఉన్న సినిమాలు నిర్మాత తీయాలని కోరుకుందాం. వినోదం తో పాటు ఎమోషన్స్, వాల్యూస్, మెసేజ్ ఈ సినిమాలో బాగున్నాయి.

చివరిగా: మిస్టర్ కళ్యాణ్ అందరిని మెప్పిస్తాడు.

రేటింగ్: 3/5

Tags: Mr Kalyan (2023) movie review and rating
Previous Post

ఘనంగా శ్రీ శంకర్ ఆర్ట్స్ పరారీ మూవీ పోస్టర్ ఆవిష్కరణ

Next Post

మెసేజ్ ఇచ్చే… నేడే విడుదల

Next Post
మెసేజ్ ఇచ్చే… నేడే విడుదల

మెసేజ్ ఇచ్చే... నేడే విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్
movies

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్

by admin
April 18, 2026
0

...

Read more
చంద్రబాబు ప్రభుత్వంపై బీసీ సంఘాల ఆగ్రహం..

చంద్రబాబు ప్రభుత్వంపై బీసీ సంఘాల ఆగ్రహం..

April 14, 2026
సెన్సార్ కార్యక్రమాల్లో  “ఆర్ కే దీక్ష”

సెన్సార్ కార్యక్రమాల్లో “ఆర్ కే దీక్ష”

April 13, 2026
క్షీణిస్తున్న బోడె రామచంద్ర యాదవ్ ఆరోగ్యం

క్షీణిస్తున్న బోడె రామచంద్ర యాదవ్ ఆరోగ్యం

April 13, 2026
శ్రీకాకుళంలో గోయాజ్ 25వ స్టోర్ ను ప్రారంభించిన హీరోయిన్ నేహా శెట్టి

శ్రీకాకుళంలో గోయాజ్ 25వ స్టోర్ ను ప్రారంభించిన హీరోయిన్ నేహా శెట్టి

April 11, 2026
మంగళగిరిలో ‘ధర్మ దీక్ష’: బీసీల హక్కుల కోసం బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష!

మంగళగిరిలో ‘ధర్మ దీక్ష’: బీసీల హక్కుల కోసం బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష!

April 11, 2026
ఘనంగ “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగ “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

April 11, 2026
రివ్యూ- డీకాట్ (Dacoit)

రివ్యూ- డీకాట్ (Dacoit)

April 10, 2026
ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!

ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!

April 7, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In