• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

మోడికి పోస్ట్ కార్డ్ రాసిన కేటీఆర్

admin by admin
October 22, 2022
in politics
0 0
0
మోడికి పోస్ట్ కార్డ్ రాసిన కేటీఆర్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

రాష్ట్రంలోని నేతన్నలతోపాటు చేనేత వస్త్రాలపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు ప్రధానికి పోస్ట్ కార్డు రాయాలన్న కేటీఆర్

చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని పిలుపునిచ్చిన మంత్రి కేటీఆర్  ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీకి ఒక పోస్ట్ కార్డుని రాశారు. చేనేత కార్మికులకు సంబంధించిన పలు సమస్యలను తన పోస్ట్ కార్డులో ప్రస్తావించిన కేటీఆర్, ప్రధానంగా చేనేత వస్త్రాలు, చేనేత ఉత్పత్తులపై ఉన్న ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తన స్వహస్తాలతో రాసిన ఈ పోస్ట్ కార్డును ప్రధానమంత్రి కార్యాలయానికి పంపనున్నట్లు  తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి చేనేత కార్మికులకు సంబంధించిన పలు అంశాలను ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఇప్పటికే చేనేత కార్మికులకు సంబంధించిన సమస్యలను అనేక సందర్భాల్లో వివిధ వేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానన్న కేటీఆర్,  వాటిపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు తాను పలుమార్లు ప్రధానమంత్రికి స్వయంగా ఉత్తరాలు రాసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. చేనేత కార్మికులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం, అవి చాలవన్నట్లు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేనేత ఉత్పత్తులపై పన్ను వేసిందని విమర్శించారు. దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో అత్యంత కీలక ఉద్యమ సాధనంగా జాతిని ఏకతాటిపై నడిపించిన చేనేత వస్త్రాలపైన పన్ను వేసిన తొలి ప్రధాని మోడీనే అన్నారు. ఒకవైపు స్వదేశీ మంత్రం, ఆత్మనిర్బర్ భారత్, గాంధీ మహాత్ముని సూత్రాలను వల్లే వేసే కేంద్ర ప్రభుత్వం… తన విధానాల్లో మాత్రం ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికైనా దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న టెక్స్‌టైల్‌ రంగంలో కీలకమైన నేత కార్మికులను మానవీయ దృక్పథంతో దేశ సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే ఒక సాంస్కృతి సారథులుగా పరిగణించి చేనేతపైన వెంటనే పన్నును రద్దు చేయాలని కోరారు.

ఈ మేరకు ప్రగతి భవన్ నుంచి చేనేత కార్మికుల పక్షాన పోస్ట్ కార్డును రాశారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు అందరితోపాటు చేనేత కార్మికులు వారి ఉత్పత్తుల పట్ల ప్రేమ కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో భాగస్వాములు కావాలని తద్వారా నోరులేని నేత కార్మికుల బాధల్ని ప్రధానమంత్రి కార్యాలయానికి తెలియజేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

 

Previous Post

ప్రజాస్వామ్య పరిరక్షణ అనగానే జగన్ కి భయం పట్టుకుంది!!

Next Post

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల

Next Post
హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

24వ స్టోర్‌ను హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రారంభించిన గోయాజ్
movies

24వ స్టోర్‌ను హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రారంభించిన గోయాజ్

by admin
February 21, 2026
0

...

Read more
ఇళయరాజా గారి ఆ ఒక్క మాటతోనే మేము విజయం సాధించాం- ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్

ఇళయరాజా గారి ఆ ఒక్క మాటతోనే మేము విజయం సాధించాం- ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్

February 18, 2026
ప్ర‌భుత్వ కొలువుల‌కు చిరునామా- య‌ర్ర‌బండ‌

ప్ర‌భుత్వ కొలువుల‌కు చిరునామా- య‌ర్ర‌బండ‌

February 17, 2026
When Goodbye Becomes the Most Romantic Hello Story

When Goodbye Becomes the Most Romantic Hello Story

February 13, 2026
“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

February 11, 2026
WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

February 10, 2026
టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

February 10, 2026
గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన  సినీ నటి మాళవిక మోహన్

గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన సినీ నటి మాళవిక మోహన్

February 9, 2026
“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

February 2, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In