శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఈసారైనా ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి సతీసమేతంగా వచ్చి స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పిస్తారా? లేదా ఎప్పటిలాగే చెంచాలను వెంటపెట్టుకొని వచ్చి కార్యక్రమాన్ని మమ అనిపిస్తారా? అన్నదానిపై తాడేపల్లి కాపల కుక్క పేర్ని నాని అయినా… జిల్లా మంత్రి రోజా అయినా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జి శ్రీ కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు సతీసమేతంగా వచ్చి శ్రీవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారని… ముఖ్యమంత్రి గారికి తన భార్య భారతీరెడ్డిని ఎందుకు తీసుకురావడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఆమె రానంటుందా? లేదా ముఖ్యమంత్రి గారు రానివ్వడం లేదా? అనే దానిపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయన్నారు. పట్టు వస్ర్తాల్లో జగన్ గారు మెరిసిపోతూ… భారతీ రెడ్డి గారితో కలిసి వస్తే ప్రజలు చూడాలనుకుంటున్నారని అన్నారు.
మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కిరణ్ రాయల్ మాట్లాడుతూ “కన్న తల్లినే పార్టీ నుంచి గెంటేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిది. జగన్ రెడ్డి చంచల్ గూడ జైల్లో ఉంటే జగనన్న విడిచిన బాణాన్ని అంటూ ఊరూరా తిరిగిన చెల్లిని ఆస్తి విషయంలో వెన్నుపోటు పొడిచాడు. పదవి కోసం సొంత బాబాయిని ఏం చేశారో తెలుసు. ఆయనది గొడ్డలి పోటో…గుండె పోటో చెప్పాలి. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ అధినాయకుడు. అలాంటి పార్టీలో ఉన్న నాని, రోజా లాంటివాళ్ళు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గురించి మాట్లాడడం విడ్డూరం
* నిద్రలేని రాత్రులు గడపడం ఖాయం
తాడేపల్లి కాపల కుక్క, మాజీ మంత్రి పేర్ని నాని బూట్లు బాగా నాకుతాడు. అందుకే ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి బూటు పాలిష్ ఖర్చు తగ్గిందని బయట టాక్ ఉంది. మీరు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై ఎంత మొరిగినా మళ్లీ ఆ కుక్కకి మంత్రి పదవి రాదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మేము బూతులు తిట్టడం మొదలుపెడితే సొంత భార్యలతో కూడా కాపురాలు చేసుకోలేరు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఈ కాపల కుక్క వీకెండ్ పొలిటీషన్ అన్నాడు. వీళ్లు అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అవుతుంది. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తెచ్చారా? ఒక్కడికి ఉద్యోగం కల్పించారా? కనీసం 100 అడుగుల రోడ్లు వేశారా? కాపలా కుక్క ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే … కుక్కను కొటినట్లు కొడతాం. యాత్ర గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన రోడ్లు మీదకు వస్తే లక్షలాది మంది ప్రజలు రోడ్డెక్కుతారు. అందుకు తగ్గ ఏర్పాట్లు పక్కాగా చేయాలి. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని శ్రీ పవన్ కళ్యాణ్ గారు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. మేము ఒకటే చెబుతున్నాం. యాత్రగానీ మొదలైతే వైసీపీ నాయకులకు నిద్రలేని రాత్రులు గడపడం ఖాయం.
* పర్యాటక శాఖ మంత్రి అంటే విదేశాల్లో పర్యటించడం కాదు
పర్యాటక శాఖ మంత్రి అయిన రోజా గారు సినిమాల్లో నటించేటప్పుడు విదేశాల్లో పర్యటించారు. ఇప్పడు రాజకీయాల్లో కూడా విదేశాల్లోనే పర్యటిస్తున్నారు. పర్యాటక శాఖ మంత్రి అంటే.. మీరు విదేశాల్లో పర్యటించడం అనుకుంటున్నారు. జనసేన పార్టీకి సింగిల్ గా పోటీ చేసే దమ్ముందా? 175 సీట్లలో అభ్యర్ధులను నిలబెట్టగలరా? అని ఆమె అడుగుతున్నారు. ఆమెకే సీటు లేక విదేశాల్లో తిరుగుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఎక్కడ నుంచి పోటీ చేస్తారో చెప్పగలరా? ఆమె పోటీ చేసే సీటు చిరిగిపోయింది. ఆమెకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నగరి నియోజకవర్గ సమీక్ష సమావేశం ఎందుకు పెట్టడం లేదు. సమావేశం నిర్వహిస్తే ఆమెతోపాటు ఇద్దరు గన్ మెన్లు, ఒక మ్యాకప్ మేన్, ఒక అసిస్టెంట్ తప్ప ఎవరూ రారు అన్న క్లారిటీ ఆమెకు ఉంది. అందుకే ఆమె సమీక్ష సమావేశం నిర్వహించడం లేదు. మా వైసీపీ నాయకుడు సింహం.. సింగిల్ గా వస్తాడు అంటున్నారు… మీ నాయకుడిని కన్న పెద్ద సింహం వైఎస్ఆర్ గారు 2004లో ఎందుకు సింగిల్ గా పోటీ చేయలేదు? టీఆర్ఎస్, వామపక్షాలతో ఎందుకు పొత్తులు పెట్టుకున్నారు? ప్రజలకు సమాధానం చెప్పండి. ప్రజలకు మంచి చేయడం ముఖ్యంగానీ సింగిల్ గా వచ్చామా? కలిసి కట్టుగా వచ్చామా ? అన్నది ముఖ్యం కాదు” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు శ్రీ జె. రాజారెడ్డి పాల్గొన్నారు.