పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నియంత్రణకు రాష్ట్ర ఎపిఎస్ ఆర్టీసీ ఒక అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా ట్రయల్ రన్ కోసం మొదటి ఎలక్ట్రిక్ బస్సు తిరుమలకు చేరుకొంది. ట్రయల్ రన్ నిమిత్తం తిరుమల డిపోకు ఒక ఏసీ ఎలక్ట్రిక్ బస్సును నిపుణుల బృందం సోమవారం తీసుకొచ్చారు. ఆర్టీసీ, ఎలక్ట్రిక్ బస్సు కంపెనీ నిపుణులు ఈ బస్సుతో రెండోవ కనుమదారిలో ప్రయాణించారు..ఎతైన ప్రదేశాలు,మలుపులు వద్ద బస్సు పనితీరును పరిశీలించారు..వారం రోజుల పాటు బస్సు పనితీరును పరిశీలించి ఆమోదించడం జరుగుతుందని ఒలెక్టర కంపెనీ అధికారులు తెలిపారు.