• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

మీడియా రంగంలోకి వస్తున్నాను: నట్టి కుమార్

admin by admin
September 7, 2022
in movies
0 0
0
మీడియా రంగంలోకి వస్తున్నాను: నట్టి కుమార్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఏ రంగంలోకి ప్రవేశించినా సినిమా ఇండ‌స్ట్రీని వదిలి పెట్టను: నిర్మాత నట్టి కుమార్‌

త్రీ(3) సినిమా రీ రిలీజ్ కొత్త ట్రెండ్ కు నాంది అవుతుంది

మీడియా రంగంలోకి వస్తున్నాను:

ఫిలిం ఛాంబర్ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తా: నట్టి కుమార్

తన యాభై ఏళ్ళ జీవన ప్రయాణంలో దాదాపు 30 ఏళ్ళ పాటు సినీరంగంలోనే కొనసాగుతూ వస్తున్నానని ప్ర‌ముఖ నిర్మాత న‌ట్టికుమార్ వెల్లడించారు. గురువారం త‌న 50వ పుట్టిన‌రోజును పురసరించుకుని బుధవారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన పైవిధంగా స్పందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి కేక్ కట్ చేసి, నిరాడంబ‌రంగా తన బర్త్ డేని
జ‌రుపుకున్నారు. అలాగే పలు విషయాల గురించి ఈ సమావేశంలో నట్టి కుమార్ మాట్లాడారు. 30 ఏళ్ళకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగిన నేను, ఇతర వ్యాపార రంగాల్లోనికి ప్రవేశిస్తున్నప్పటికీ ఎట్టి పరిస్థితులలో సినిమా రంగాన్ని వదిలిపెట్టనని, ఇక్కడ ఉంటూనే అనేక ప్రయోగాలు చేయాలనుకుంటున్నాని ఆయన చెప్పారు. ఇటీవ‌ల కొంద‌రు నిర్మాత‌లు ఏకాభిప్రాయంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌ని…త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునేందుకు బంద్‌కు పిలుపునిచ్చారు. అది స‌రికాదని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల చిన్న నిర్మాతలు, కార్మికులు మొదలుకుని పెద్ద నిర్మాతలు సైతం చాలా నష్టపోయారని ఆయన వివరించారు. అసలు ఈ బండ్ ఎందుకు చేశారో ఎవ్వరికీ అర్ధం కాలేదని ఆయన విమర్శించారు. ఇక .థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు రాక‌పోవ‌డం అనేది ఎప్ప‌టికీ ఉండ‌దని, టిక్కెట్ల రేట్లు తగ్గించడంతో పాటు మంచి కంటెంట్ ఉంటే పాత సినిమాల‌ను సైతం ఆద‌రిస్తార‌ని ఇటీవ‌ల విడుద‌లైన అగ్ర హీరోల ఒకప్పటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు రీ రిలీజ్ సందర్భంగా మరోసారి నిరూపించాయని అన్నారు. అలాగే ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించిన చిత్రాల‌న్నీ కంటెంట్‌ను న‌మ్ముకుని హిట్ సాధించిన‌వే కావ‌డం గ‌మ‌నార్హం. నేను కూడా అదే న‌మ్మ‌కంతో గ‌తంలో విడుద‌లై ఓ మోస్త‌రు విజ‌యం సొంతం చేసుకున్న ధ‌నుష్‌, శృతిహాస‌న్ న‌టించిన తెలుగులో త్రీ (3), త‌మిళంలో కొల‌వెరి చిత్రాన్ని అప్ప‌ట్లో మేమే విడుద‌ల చేశాము. అయితే అప్ప‌ట్లో ధ‌నుష్‌కు అంత‌గా పాపులారిటీ లేనందున పెద్ద‌గా ఆడ‌లేదు. ఇప్పుడు అదే చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల‌లో విడుదల చేస్తున్నాం. ఒక్క తెలంగాణలోనే ఇప్పటికే దాదాపు 75కు పైగా థియేట‌ర్ల‌లో వేస్తున్నాం. అన్ని షోస్ ఆన్ లైన్ బుకింగ్ ఫుల్ అయ్యాయి. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్లో కూడా ఇలానే విశేష స్పందన లభిస్తోంది. 3 సినిమాకు పదేళ్ల అనంతరం రీ రిలీజ్ లో ఇంత క్రేజ్ వ‌స్తుంద‌ని మేము కూడా ఊహించ‌లేదు. అంటే ప్రేక్ష‌కులు మంచి చిత్రాన్ని ఎప్ప‌టికీ ఆద‌రిస్తార‌ని నిరూప‌ణ అయ్యింది. అంతే కాదు మంచి కంటెంట్, టిక్కెట్ల రేట్లు అందుబాటులో ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అనేందుకు ఈ సినిమా రీ రిలీజ్ ఓ నాంది, ఒరవడి అవుతుందని ఆయన తెలిపారు. నిర్మాత‌లు, హీరోలు అంద‌రూ కంటెంట్‌ను న‌మ్ముకుని సినిమాలు తీయాల‌ని నా అభిప్రాయం. . ఇక నా యాభ‌య్య‌వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కొన్ని స‌రికొత్త ప్రాజెక్టులు చేప‌ట్ట‌బోతున్నాను. ఇందులో భాగంగా మీడియా రంగంలోనికి అడుగు పెట్టబోతున్నాను. రాజ‌కీయాల‌కు అతీతంగా నిజాన్ని నిర్భ‌యంగా చెప్పేరీతిలో నా మీడియాను నడుపుతాను. . . నట్టీస్ ప్యూర్ విలేజ్ ప్రొడ‌క్టుల పేరిట హోల్ సేల్‌, రిటైల్‌గా రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఆర్డ‌ర్ పై ఇంటింటికీ స‌ప్లై ఇచ్చే మ‌రో ప్రాజెక్టు కూడా చేప‌ట్ట‌నున్నాం. మా సంస్థ నుంచి సినిమాలు వ‌స్తునే ఉంటాయి. సినిమా కార్మికుల‌కు అండ‌గా నిల‌బ‌డేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తాను’ అని నట్టి కుమార్ తెలిపారు.

Previous Post

సీఎం జగన్‌ సంకల్పాన్ని అభినందిస్తున్నా: జేపీ

Next Post

అడియన్స్ అందరూ ఈ సినిమా స్క్రిప్ట్ కు కనెక్ట్ అవుతారు- హీరో నివాస్ శిస్టు

Next Post
అడియన్స్ అందరూ ఈ సినిమా స్క్రిప్ట్ కు కనెక్ట్ అవుతారు- హీరో నివాస్ శిస్టు

అడియన్స్ అందరూ ఈ సినిమా స్క్రిప్ట్ కు కనెక్ట్ అవుతారు- హీరో నివాస్ శిస్టు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..
movies

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

by admin
May 23, 2026
0

...

Read more
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

May 11, 2026
జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

May 10, 2026
హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

May 9, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In