ఆంధ్రప్రదేశ్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. తూర్పుగోదావరి జిల్లా కేపీ పురంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆమోదం తెలుపుతూ ఏపీ సర్కార్ కు కేంద్రం లేఖ రాసింది. ఈ బల్క్ డ్రగ్ పార్క్ కోసం ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు పోటీపడ్డాయి.