ఎన్నారై సేవా ఫౌండేషన్ సేవలు అభినందనీయం అని తనికెళ్ళ భరణి మరియు సింగర్ సునీతా అన్నారు.
తనికెళ్ళ భరణి మరియు సునీతా ని సత్కరించిన ఎన్నారై ఫౌండేషన్ ప్రతినిధులు
ఎన్నారై సేవా ఫౌండేషన్ ని హరీష్ కొలసాని స్థాపించారు ఆయన ఆధ్వర్యంలో గత కొంత కాలంగా యూఎస్ మరియు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నారై సేవలు రోజు చాలా రకాలగా సేవలు అందిస్తుంది హెల్త్, మహిళలకు ఉదోగ్య అవకాశాలు, ఎడ్యుకేషన్ మరియు హాస్పిటల్స్ లో ఉన్నారు కి సహాయం మరియు స్లమ్ ఏరియాల్లో ఉన్నవారికి గత కొంత కాలంగా కుకట్ పల్లి, బంజార హిల్స్, మేడ్చల్ ప్రాంతాల్లో పేదలు, వయోదికులకు వైద్య సేవలు,ఫిజియోథెరపీ తో పాటూ, పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేషంట్లు, వారి అటెండెంట్లకు ఆహారం ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో ఎన్నారై సేవా ఫౌండేషన్ 10వ వార్షికోత్సవ వేడులకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సిని గాయని సునీత, రచయిత, నటుడు తనికెళ్ల భరణి హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిధులు ఎన్నారై ఫౌండేషన్ నిర్వహకులను అభినందించారు. ఎన్నారై సేవా సంస్థ మన దేశంలో ఉన్న పేద వారితో పాటూ…విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్లకు నిస్వార్థంగా సేవ చేయడం గొప్ప విషయం అన్నారు సింగర్ సునీత, నటుడు రచయిత తనికెళ్ల భరణి. కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు హరీష్, రాధ మోహన్ సంస్థకు చెందిన వైద్యులు, సిబ్బంది, అల్లాపూర్ లకు చెందిన సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.