*పాఠశాలల విలీన జీవోపై సవరణ ఉత్తర్వులు*
*ఉపాధ్యాయ సంఘాలతో వారి సమస్యలపై చర్చలు*
*ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ*
పాఠశాలల విలీన జీవోపై అభ్యంతరాలను పరిశీలించి సవరణ ఉత్తర్వులు జారీ చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో వారి సమస్యలపై చర్చలు జరిపిన మంత్రి పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విధానంపై వెనక్కి తగ్గేది లేదన్నారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమానికే కట్టుబడి ఉన్నామని విద్యాశాఖ మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన మంత్రి.. పాఠశాలల విలీనానికి సంబంధించిన జీవో 117 రద్దు సహా, ఉపాధ్యాయ బదిలీలపై చర్చించారు. పాఠశాలల విలీన జీవోపై అభ్యంతరాలను పరిశీలించి సవరణ ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి బొత్స వెల్లడించారు.*
*ఉపాధ్యాయ సంఘాల సమస్యలపై వారితో చర్చించామని, సానుకూల నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. జీవో నెం.117లోని అభ్యంతరాలను పరిశీలించి సవరణ ఉత్తర్వులు. పాఠశాలల్లో అంగ్ల మాధ్యమం విధానంపై వెనక్కి తగ్గేదిలేదన్నారు. 1 నుంచి 8 వరకు నిర్బంధ ఆంగ్ల విద్య అమలు చేస్తామని, 3, 4, 5 తరగతుల విద్యార్థులు ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తామని, 21 మంది విద్యార్థులు ఉన్నచోట ఇద్దరు ఎస్జీటీలు ఉంటారని తెలిపారు. ఇవాళ సాయంత్రం లేదా రేపటిలోగా సవరణ ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం చెప్పినట్లు ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. ప్రభుత్వ నిర్ణయం తర్వాత డీఈవో కార్యాలయాల ముట్టడికి ఇచ్చిన పిలుపుపై పునరాలోచన చేస్తామని ఫ్యాప్టో ఛైర్మన్ ప్రకటించారు.