బాహుబలి తరవాత సరైన హిట్టు లేని రానా దగ్గుబాటి, ఆశించని స్థాయిలో హిట్టవ్వని శ్యామ్ సింగరాయ్ హీరోయిన్ సాయి పల్లవి… జంటగా, ఓ మోస్తారు టాక్ తెచ్చుకున్న నీది నాదీ ఒకే కథ డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న ‘ విరాటపర్వం ‘ చిత్రం ఈ శక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వరంగల్, హైదరాబాద్ లో ప్రమోషన్స్ ఈవెంట్స్ చేసినా పెద్దగా బజ్ రాలేదు. మెగా ఫ్యాన్స్ ని గ్రాబ్ చేయడానికి శిల్పకళా వేదిక ఈవెంట్ కి రామ్ చరణ్ వస్తాడని చిత్ర యూనిట్ ప్రచారం చేసింది. కానీ రామ్ చరణ్ రాలేదు. చివరకు వెంకటేష్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో సాయి పల్లవి కాశ్మీర్ ఇష్యూ మీద, గో హత్యల మీద చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ మండి పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో విడుదల అవుతున్న విరాటపర్వంలో రవన్న పాత్రలో రానా, వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. సింహభాగం వెన్నెల పాత్ర చూట్టూ జరిగే కథ… కథనంలో రానా పాత్ర నిడివి మొదట్లో నామ మాత్రంగా వుండేదని… అయితే రానా దగ్గరుండి తన పాత్ర నిడివిని పొడిగించి… వెన్నెల పాత్రకు కత్తెర వేసారనే టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది. దాంతో దర్శకుడు కూడా కొంత అసంతృప్తితో ఉన్నాడని తెలిసింది. తను ఎంతో ఇష్టంగా రాసుకున్న వెన్నెల పాత్రకు ఇలా కత్తెర వేయడం దర్శకునికి రుచించడం లేదని తెలిసింది. చూడాలి ఈరోజు సాయంత్రం AMB మాల్ లో ప్రీమియర్ షో ప్రదర్శన తరవాత చిత్ర యూనిట్ అండ్ రివ్యువర్స్ రియాక్షన్ ఏంటో.
#virataparvamonjune17th #RanaDaggubati #saipallavi