ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి విశాఖ పర్యటన ఖరారైంది. ఈనెల 13న ఉదయం 10.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి విచ్చేస్తారు. 11.05 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌కు వెళ్తారు. 11.05 నుంచి 11.15 గంటల వరకు స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం వైఎస్సార్ వాహన మిత్ర ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. తరువాత వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులతో ఫొటో సెషన్ జరుగుతుంది.
11.40 గంటల నుంచి 11.45 గంటల వరకు లబ్ధిదారుల ప్రసంగాలు ఉంటాయి.11.45 నుంచి 11.47 గంటల వరకు వాహన మిత్ర అంశంపై వీడియో ప్రదర్శన ఉంటుంది. 11.47 నుంచి 12.17 గంటలకు సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు. 12.20 నుంచి వైఎస్సార్ వాహనమిత్ర లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. 12.30 గంటలకు విమానాశ్రయానికి బయలుదేరుతారు. 12.55 గంటల నుంచి 1.15 గంటల వరకు స్థానిక నాయకులతో భేటీ అవుతారు. 1.20 గంటలకు గన్నవరం బయలుదేరుతారు.