బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి: జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు
—నీలరెడ్డి పల్లిల్లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకులు–
-ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించిన మండల టిడిపి నేతలు
బుక్కరాయసముద్రం: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అని జిల్లా టిడిపి పర్వతనేని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని, బుక్క రాయసముద్రం మండల పరిధిలోని నీలారెడ్డిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహంకు కొర్రపాడు గ్రామపంచాయతీ నాయకులతో కలిసి గురువారం విగ్రహం వద్ద పూల మాలలు వేసి ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పర్వతనేని శ్రీధర్ బాబు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పేదప్రజలకు పలు సంక్షేమ పథకాలు అందించి వారి గుండెల్లో ఎన్టీఆర్ నిలిచిపోయారని, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపం చానికి చాటిచెప్పిన ఘనత ఆయనకే దక్కుతుందని పలువురు టీడీపీ నాయకులు అన్నారు. వైసీపీ వచ్చాక పేదలకు ఒరిగిందేమీ లేదని, రాష్ట్రం అథోగతి పాలైందన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జోహార్, ఎన్టీఆర్ అమర్ రహై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు మల్లేష్, రామానాయుడు, మండల క్లస్టర్ ఇంచార్జ్ నరేంద్ర యాదవ్, టిడిపి సీనియర్ నేతలు లక్ష్మీనారాయణ యాదవ్, బొజ్జయ్య, గోపాల్, రెడ్డిపల్లి నాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు అది , జిల్లా ఎస్సీ ఎస్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి అరికలరాజు, బూత్ కన్వీనర్ వడ్డే రామకృష్ణ, తదితరు కార్యకర్తలు పాల్గొన్నారు