తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం ఉద్యమం ఉవ్వెత్తున లెగుస్తున్న సయమది. ఆ సమయంలోనే వైఎస్ జగన్ తన తండ్రి మరణాంతరం మృతి చెందిన అభిమానుల కుటుంబాలను ఓదార్చేందుకు 2010 మే 28న మానుకోటకు చేరుకున్నారు. మానుకోటకు వైఎస్ జగన్ రాకను జీర్ణించుకోని ఉద్యమకారులు స్థానిక రైల్వే ట్రాక్పై ఉన్న రాళ్లతో దాడి చేసి ‘గో బ్యాక్ జగన్ ‘ అంటూ అడ్డుకున్నారు. తూటాలకు భయపడని మానుకోట ప్రజల వీరోచిత పోరాటానికి నేటికి సరిగ్గా 14 ఏళ్లు.