• Home
  • Sample Page
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

అయోధ్యలో ఘనంగా “ఆదిపురుష్” మూవీ టీజర్ విడుదల వేడుక

admin by admin
October 2, 2022
in movies
0 0
0
అయోధ్యలో ఘనంగా “ఆదిపురుష్” మూవీ టీజర్ విడుదల వేడుక
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ “ఆదిపురుష్”. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృతి సనన్ నాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్ లపై భూషణ్ కుమార్,ఓం రౌత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ భారీ చిత్ర నిర్మాణంలో యూవీ క్రియేషన్స్ నుంచి వంశీ, ప్రమోద్ భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు. ప్రెస్టీజియస్ మూవీగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వారి వెయిటింగ్ కు తెరదించుతూ ఆదివారం సరయూ నది తీరాన శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య నగరంలో ఆదిపురుష్ టీజర్ విడుదల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్, కృతి సనన్, దర్శకుడు ఓం రౌత్ తో పాటు ఇతర చిత్రబృందం పాల్గొన్నారు. ఈ వేడుకలో ఆదిపురుష్ భారీ పోస్టర్ రిలీజ్ చేశారు. చెడుపై మంచి విజయాన్ని సాధించేందుకు శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ ఎలాంటి ధర్మ పోరాటం చేశారనేది టీజర్ లో అద్భుతంగా చూపించారు. టీజర్ విడుదల సందర్భంగా

*దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ*..పవిత్ర అయోధ్య నగరంలో ఆదిపురుష్ సినిమా టీజర్ విడుదల వేడుక జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి నేను ఒక శ్రీరామ భక్తుడిగా వచ్చాను. ఆదిపురుష్ అనేది కేవలం ఒక సినిమానే కాదు భక్తికి ప్రతీక. మా అందరి ఇష్టంతో ఇదొక మిషన్ లా భావించి పనిచేశాం. టీజర్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇదే ప్రేమను మాపై చూపించండి. అన్నారు.

*పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ*…శ్రీరాముడి ఆశీస్సులు తీసుకునేందుకు అయోధ్య నగరానికి వచ్చాం. మొదట ఈ పాత్రలో నటించేందుకు భయపడ్డాను. ప్రాజెక్ట్ అనుకున్న మూడు రోజుల తర్వాత దర్శకుడు ఓం రౌత్ కు ఫోన్ చేశాను. ఈ పాత్రలో మెప్పించేలా ఎలా నటించాలి అనేది మాట్లాడుకున్నాం. ప్రేమ, భయ భక్తులతో ఈ సినిమాను రూపొందించాం. అంకితభావం, క్రమశిక్షణ, విశ్వాసంతో ఉండటం ఈ మూడు విషయాలను శ్రీరాముడి ప్రవర్తన నుంచి మనం నేర్చుకోవచ్చు. శతాబ్దాలుగా మనం ఈ లక్షణాలను అనుసరించాలని చూస్తున్నాం కానీ మన వల్ల కావడం లేదు. అందుకే మనం మనుషులం అయ్యాం, శ్రీరాముడు దేవుడు అయ్యారు. శ్రీరాముడి కృప మాపై ఉంటుందని నమ్ముతున్నాం. అన్నారు.

*హీరోయిన్ కృతి సనన్ మాట్లాడుతూ*…దసరా పర్వదినం రాబోతోంది. భక్తి శ్రద్ధలతో మనమంతా నవరాత్రులు జరుపుకుంటున్నాం. ఇలాంటి శుభ సమయంలో అయోధ్య పవిత్ర నగరంలో మా సినిమా టీజర్ విడుదల కార్యక్రమం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకంటే మంచి సమయం, మంచి వేదిక మాకు దొరకదు. ఇలాంటి గొప్ప కథల్లో, పాత్రల్లో నటించే అవకాశం అందరికీ దక్కదు. నా కెరీర్ లో అతి త్వరగా ఈ అవకాశం రావడం ఆనందంగా ఉంది. జానకి పాత్రలో నటించడం ఉద్వేగంగా అనిపించింది. సినిమా షూటింగ్ పూర్తవుతుంటే బాధకు లోనయ్యాను. ఒక కల తీరిన ఫీలింగ్ కలిగింది. మనందరికీ తెలిసిన రామాయణ గాథ ఇది. చిన్నప్పుడు పెద్దవాళ్లు చెబుతుంటే విని ఉంటాం. అప్పుడే మన మనసులో రామాయణం ఎలా ఉంటుందనే ఊహించుకుని ఉంటాం. ఈ సినిమాను పిల్లలు, పెద్దలు అందరు కలిసి చూడండి. మన ఇతిహాస ఘనతను ఆదిపురుష్ లో చూస్తారు. అన్నారు.

*నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ*… మా నాన్నగారు గుల్షన్ కుమార్ శ్రీరామ భక్తుడు. రాామాయణ నేపథ్యంతో సిినిమా నిర్మించాలనే ఆయన కల ఈ సినిమాతో నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది. తానాజీ తర్వాత శ్రీరాముడి దివ్య గాథను సిినిమాగా రూపొందిస్తానని దర్శకుడు ఓం రౌత్ నా దగ్గరకు వచ్చారు. నేను వెంటనే ఈ ప్రాజెక్ట్ కు అంగీకారం తెలిపాను. నాకు ఈ సినిమా నిర్మించే అవకాశం ఇచ్చిన టీమ్ అందరికీ థాంక్స్. ప్రభాస్, కృతి సనన్ అద్భుతంగా పర్మార్మ్ చేశారు. అన్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న “ఆదిపురుష్” సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఐమాక్స్ ఫార్మేట్ తో పాటు త్రీడీలో ఈ సినిమా తెరపైకి రానుంది.

Adipurush’s Stellar Teaser Launched In Ayodhya

Pan India superstar Prabhas is collaborating with director Om Raut for Adipurush. The teaser of the film was unveiled today in holy city of Ayodhya and it is loaded with stellar VFX shots. The film is produced Bhushan Kumar under T Series and he is partnered by Vamsi and Pramod of UV Creations.

Speaking at the teaser launch, Om Raut said “It feels great to be in the holy city of Ayodhya and launch the teaser of Adipurush. I’ve come here as a Bhakta of Lord Sri Ram. Hope you all love what we have in store with Adipurush.”

Prabhas said “We’ve come to Ayodhya to seek the blessings of Lord Sri Ram. I was initially scared to play this role. Om Raut helped me portray this godly character with finesse. This film was made with love and devotion. Lord Sri Ram is a guiding force for us and we hope he blesses us and this film.

Kriti Sanon said “I feel glad to be a part of a project of this scale so early in my career. Ramayan is close to us right from childhood and I feel honored to play this divinely character. I think I am enlightened by the film and the story. This film will cater to the youngsters and also the elderly.

Producer Bushan Kumar said “My father Gulshan Kumar is a devotee of Lord Ram. It has been my dream to make a film on Ramayan and it is happening with Adipurush. I would like to thank the entire team for making this project happen. I immediately signed the project when Om Raut came up with the story.

Adipurush is up for release on the 12th of January, 2023. It is one of the most anticipated projects in Indian cinema.

Previous Post

శేఖర్ కమ్ముల క్లాప్ తో E3 With Love చిత్రం ప్రారంభం

Next Post

దిల్‌ రాజు చేత ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’ ట్రైలర్‌ లాంచ్‌!!

Next Post
దిల్‌ రాజు చేత ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’ ట్రైలర్‌ లాంచ్‌!!

దిల్‌ రాజు చేత ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’ ట్రైలర్‌ లాంచ్‌!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

‘పరారి’ మూవీ లో ఏమో ఏమో పాటను రిలీజ్ చేసిన లేడి సూపర్ స్టార్ విజయశాంతి
movies

‘పరారి’ మూవీ లో ఏమో ఏమో పాటను రిలీజ్ చేసిన లేడి సూపర్ స్టార్ విజయశాంతి

by admin
March 22, 2023
0

...

Read more
వి.యఫ్.సి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్.1 చిత్రం ప్రారంభం

వి.యఫ్.సి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్.1 చిత్రం ప్రారంభం

March 22, 2023
దర్శకుడు పరశరామ్ చేత రాయ్‌ లక్ష్మీ జనతాబార్ మోషన్ పోస్టర్ విడుదల

దర్శకుడు పరశరామ్ చేత రాయ్‌ లక్ష్మీ జనతాబార్ మోషన్ పోస్టర్ విడుదల

March 22, 2023

అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి; పవన్ కళ్యాణ్

March 19, 2023
నటి నేహా శెట్టి చేత కొంపల్లిలో డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమ్ స్టోర్‌ ప్రారంభం

నటి నేహా శెట్టి చేత కొంపల్లిలో డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమ్ స్టోర్‌ ప్రారంభం

March 18, 2023
మార్చి 30న ‘ పరారి’ గ్రాండ్ రిలీజ్

మార్చి 30న ‘ పరారి’ గ్రాండ్ రిలీజ్

March 18, 2023
అనం మీర్జా సౌంద్ కొత్త కలెక్షన్స్ ప్రారంభించారు.

అనం మీర్జా సౌంద్ కొత్త కలెక్షన్స్ ప్రారంభించారు.

March 17, 2023
“లిల్లీ’ ట్రైలర్ వేడుక

“లిల్లీ’ ట్రైలర్ వేడుక

March 13, 2023
గ్రీన్ స్పేస్ సెలెస్టియల్ బ్రౌచర్ ని విడుదల

గ్రీన్ స్పేస్ సెలెస్టియల్ బ్రౌచర్ ని విడుదల

March 13, 2023
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • Sample Page
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In